pizza

Nikhil’s Swayambhu World-Class Making: 175 Days Of Shoot, 2500 VFX Shots
నిఖిల్ ‘స్వయంభు’ వరల్డ్ క్లాస్ మేకింగ్.. 175 రోజుల షూటింగ్, 2,500 వీఎఫ్‌ఎక్స్ షాట్స్

You are at idlebrain.com > news today >

12 September 2026
Hyderabad

Nikhil Siddhartha is set to take audiences into a larger-than-life historical world with Swayambhu, an ambitious period action drama that is being mounted on an enormous scale. Directed by Bharat Krishnamachari, the film is produced by Bhuvan and Sreekar under Pixel Studios, with Tagore Madhu presenting the project. The makers have shared an exciting update on the film, confirming their plans for a grand release, as a multi-language Pan-Indian project.

The journey to this point has been anything but ordinary. The team has spent an incredible 175 days shooting the film, while approximately 2,500 VFX shots are being incorporated into the final product. The numbers themselves underline the magnitude of the project and the amount of technical work involved. The latest behind-the-scenes picture gives a fascinating look at the making of the film. Nikhil is seen in an intense warrior avatar, seemingly preparing for an action sequence.
 
For a film that appears to be heavily dependent on visual grandeur, the extended production schedule could prove crucial. Rather than compromising on the final output, the makers have chosen to take the time required to complete the project to their satisfaction. Their latest message carries a clear sense of confidence: “Good things take time. We are almost there.”
 
Now, the wait is entering its final phase. The makers have promised that the release date announcement will be unveiled soon, while the trailer is also expected to add further momentum to the promotions.
 
Swayambhu brings together an impressive technical team to support its ambitious vision. Cinematographer KK Senthil Kumar handles the visuals, while Ravi Basrur provides the music. Production designers M. Prabhaharan and Raveendra are responsible for creating the film’s expansive world.
 
Samyuktha and Nabha Natesh play prominent roles alongside Nikhil. Following the attention generated by the teaser, the first song Ra Ra Dheevara has added further momentum by presenting the heroic and larger-than-life nature of the protagonist.
 
The team is planning to intensify the promotional activities.
 
Cast: Nikhil, Samyuktha, Nabha Natesh
 
Technical Crew:
Writer, Director: Bharat Krishnamachari
Producers: Bhuvan and Sreekar
Banner: Pixel Studios
Presents: Tagore Madhu
DOP: KK Senthil Kumar
Music: Ravi Basrur
Editor: Tammiraju
Dialogues: Vijay Kamisetty
Production Designers: M Prabhaharan, Raveendar
Action: King Solomon, Stunt Silva
Lyrics: Ramajogayya Sastry

నిఖిల్ ‘స్వయంభు’ వరల్డ్ క్లాస్ మేకింగ్.. 175 రోజుల షూటింగ్, 2,500 వీఎఫ్‌ఎక్స్ షాట్స్

నిఖిల్ సిద్ధార్థ్ ‘స్వయంభు’ సినిమాతో ప్రేక్షకులను చారిత్రక ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. మల్టీ లాంగ్వేజ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

‘స్వయంభు’ కోసం ఏకంగా 175 రోజుల పాటు షూటింగ్ నిర్వహించారు. ఫైనల్ ప్రొడక్ట్‌లో సుమారు 2,500 వీఎఫ్‌ఎక్స్ షాట్స్‌ను పొందుపరుస్తున్నారు. ఈ నెంబర్స్ సినిమా ఏ స్థాయిలో తెరకెక్కుతోందో, ఎంత భారీ టెక్నికల్ వర్క్ జరుగుతోందో తెలియజేస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన బిహైండ్ ది సీన్స్ పిక్చర్ సినిమా మేకింగ్‌పై ఆసక్తిని పెంచుతోంది. ఇందులో నిఖిల్ ఇంటెన్స్ వారియర్ అవతార్‌లో యాక్షన్ సీక్వెన్స్‌కు సిద్ధమవుతున్నట్లు కనిపించారు.

విజువల్ గ్రాండియర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రానికి లెన్తీ ప్రొడక్షన్ షెడ్యూల్ కీలకం. ఫైనల్ అవుట్‌పుట్ విషయంలో రాజీపడకుండా, తాము అనుకున్న స్థాయిలో సినిమాను పూర్తి చేసేందుకు అవసరమైన సమయాన్ని తీసుకుంటున్నారు. “మంచి విషయాలకు సమయం పడుతుంది. మేం దాదాపు చివరి దశకు చేరుకున్నాం” అంటూ మేకర్స్ తమ కాన్ఫిడెన్స్‌ను వ్యక్తం చేశారు.

ఇప్పుడు ‘స్వయంభు’ రిలీజ్ కోసం ఎదురుచూపులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

‘స్వయంభు’ కోసం అద్భుతమైన టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ విజువల్స్ అందిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్లు ఎం. ప్రభాహరన్, రవీందర్ ఈ సినిమా కోసం భారీ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు.

నిఖిల్ సరసన సంయుక్త, నభా నటేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి ఆసక్తిని క్రియేట్ చేయగా, ‘రా రా ధీవర’ ఫస్ట్ సింగిల్ హీరో క్యారెక్టర్‌లోని లార్జర్ దేన్ లైఫ్ నేచర్‌ను చూపిస్తూ సినిమాపై మరింత బజ్‌ను పెంచింది.

మేకర్స్ త్వరలోనే ప్రమోషనల్ యాక్టివిటీస్‌ను మరింత ముమ్మరం చేయనున్నారు.

కాస్ట్: నిఖిల్, సంయుక్త, నభా నటేష్

టెక్నికల్:
రచన, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి
నిర్మాతలు: భువన్, శ్రీకర్
బ్యానర్: పిక్సెల్ స్టూడియోస్
సమర్పణ: ఠాగూర్ మధు
డీవోపీ: కేకే సెంథిల్ కుమార్
సంగీతం: రవి బస్రూర్
ఎడిటర్: తమ్మిరాజు
డైలాగ్స్: విజయ్ కామిశెట్టి
ప్రొడక్షన్ డిజైనర్స్: ఎం. ప్రభాహరన్, రవీందర్
యాక్షన్: కింగ్ సోలోమన్, స్టంట్ సిల్వా
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved