Telusu Kada teaser on 11
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా, ఎస్ థమన్, నీరజా కోన, టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'తెలుసు కదా' టీజర్ సెప్టెంబర్ 11న రిలీజ్
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'తెలుసు కదా' విడుదలకు రెడీ అవుతోంది. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. అక్టోబర్ 17న విడుదలకు రెడీ అవుతున్న మూవీకి టీం ప్రమోషన్లను వేగవంతం చేసింది.
థమన్ ఎస్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ 'మల్లికా గంధ' ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుని చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు, నెక్స్ట్ బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తెలుసు కదా టీజర్ సెప్టెంబర్ 11న విడుదల కానుంది.
టీజర్ అనౌన్స్మెంట్ తో పాటు ఒక అందమైన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది తెలుసు కదా ప్రేమకథను ప్రజెంట్ చేస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ బాల్కనీలో నిలబడి, పక్కన కనిపించే శ్రీనిధి శెట్టి , రాశి ఖన్నా వైపు చూడటం, రాశి చిరునవ్వుతో కనిపిస్తూ, శ్రీనిధి దూరంగా చూడటం, కథలో ట్రైయాంగిల్ లవ్ ట్రాక్‌ను చూపిస్తోంది. ఈ పోస్టర్ యూత్ ఫుల్ ఎనర్జీతో ఆకట్టుకుంది.
ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్రను పోషిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ VS లావిష్ విజువల్స్‌ను అందిస్తుండగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. కాస్ట్యూమ్స్ శీతల్ శర్మ.
తెలుసు కదా ఈ దీపావళికి తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
తారాగణం: సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష
రచన, దర్శకత్వం: నీరజ కోన
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: థమన్ ఎస్
DOP: జ్ఞాన శేఖర్ VS
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ