The conflict between the lead characters inspired the music for the movie "The Girlfriend": Music director Hesham Abdul Wahab
హీరో హీరోయిన్స్ పాత్రల మధ్య సంఘర్షణే "ది గర్ల్ ఫ్రెండ్" మూవీకి మంచి మ్యూజిక్ ఇచ్చేలా స్ఫూర్తినిచ్చింది - మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్
Starring national crush Rashmika Mandanna and talented actor Dheekshith Shetty, "The Girl Friend" is produced jointly under the banners of Geetha Arts and Dheeraj Mogilineni Entertainment, with renowned producer Allu Aravind presenting the film. Director Rahul Ravindran has crafted an intense and emotional love story, while Dheeraj Mogilineni and Vidya Koppineedi serve as producers. This fresh love story is set to release in Hindi and Telugu on November 7, and on November 14, it will have a worldwide theatrical release in Tamil, Malayalam, and Kannada. In a recent interview, music director Hesham Abdul Wahab shared his experiences working on the film.
"This is the first Telugu movie I signed, ‘The Girlfriend.’ After this, I composed for ‘Kushi’ and ‘Hi Nanna,’ which are also love stories. Among these, the intensity in ‘The Girlfriend’ is much higher. I have been composing music for consecutive romantic films, and now offers for different genres are coming my way. I feel satisfied having contributed to these romantic projects."
"The release of this movie was delayed. I had started working on the BGM, but due to certain reasons, the film came out later. During that time, Prashanth Vihari handled the background music. I’m happy that he worked on the film as the main music director. He delivered a great BGM, and the feel I envisioned is clearly reflected in his work."
"The film has four songs, and the fourth song ‘Needhey’ was recently released. I put in a lot of effort composing this song. Before starting, director Rahul told me that it should be an anthem for every girl, a ‘Bhooma anthem.’ I worked hard to achieve that. For the entire album, Rahul wanted a blend of Indian and Western music, so we incorporated traditional Indian ragas along with Western instruments."
"The conflict between Vikram and Bhooma’s characters inspired me to create good songs for this film. It’s a movie everyone should watch. Watching it myself made me reflect, and I’m confident audiences will appreciate it. All credit goes to director Rahul, as he designed all the songs to fit perfectly within the story."
"There is no specific time for composing a good song. I don’t set aside a particular time for composing. I admire music director A.R. Rahman a lot. I used to sing along to songs from ‘Dil Se’ while learning his compositions. Performing my compositions from ‘Hi Nanna’ in front of him at the IIFA awards was an unforgettable experience. I also like Telugu composers like Keeravani, Thaman, Devi sri Prasad, and Bheems."
"I transitioned from being a singer to a music director, so the makers often request me to sing at least one song in my movies. I’ve sung in films directed by other music directors like Mass Jathara and Kannappa as well. Singing in these projects has been a valuable experience and has helped me learn Telugu faster. I don’t accept every opportunity that comes my way; I avoid projects that feel repetitive. However, I never refuse offers from companies like Sithara, Geetha Arts, and Mythri, which gave me recognition in Tollywood."
"I have mostly composed love songs so far, but I am planning to work on mass and beat songs soon, as such opportunities arise. Background music plays a key role in romantic films. The BGM I composed for films like ‘Manamey’ and ‘8 Vasanthalu’ received a good response. I am happy to work in the Telugu film industry, as opportunities keep coming one after another. I selectively work in Malayalam cinema and am currently involved in a film with Anand Deverakonda and Vaishnavi, directed by Aditya Hassan, along with projects in Tamil and Kannada. I will also soon announce my first Bollywood film."
హీరో హీరోయిన్స్ పాత్రల మధ్య సంఘర్షణే "ది గర్ల్ ఫ్రెండ్" మూవీకి మంచి మ్యూజిక్ ఇచ్చేలా స్ఫూర్తినిచ్చింది - మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 7న హిందీతో పాటు తెలుగులో.. ఈ నెల 14న, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో ఈ చిత్రానికి పనిచేసిన ఎక్సిపీరియన్స్ తెలియజేశారు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్.
తెలుగులో నేను ఒప్పుకున్న మొదటి సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమా తర్వాత ఖుషి, హాయ్ నాన్న సినిమాలు చేశాను. ఇవన్నీ ప్రేమ కథా చిత్రాలే. వీటిలో "ది గర్ల్ ఫ్రెండ్" కథలో ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. వరుసగా ప్రేమ కథా చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ వచ్చాను. ఇప్పుడు వేరే జానర్ మూవీస్ కు ఆఫర్స్ వస్తున్నాయి. కొన్ని ప్రేమ కథా చిత్రాలకు సంగీతాన్ని అందించాను అనే సంతృప్తి ఉంది.
ఈ సినిమా రిలీజ్ అవడం లేట్ అయ్యింది. నేను ఈ సినిమాకు బీజీఎం స్టార్ట్ చేశా. అయితే కొన్ని కారణాలతో మూవీ లేట్ అవుతూ వచ్చింది. ఆ టైమ్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు ప్రశాంత్ విహారిని తీసుకున్నారు. సాటి మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రశాంత్ ఈ సినిమాకు పనిచేయడం హ్యాపీగా ఫీలయ్యా. అతను చాలా మంచి బీజీఎం ఇచ్చాడు. నేను అనుకున్న ఫీల్ అతని బీజీఎంలో కూడా కనిపించింది.
"ది గర్ల్ ఫ్రెండ్" సినిమాలో నాలుగు సాంగ్స్ ఉంటాయి. వాటిలో నాలుగో పాట నీదే నీదే కథా రీసెంట్ గా రిలీజ్ చేశాం. ఈ పాట కంపోజింగ్ కోసం ఎక్కువ కష్టపడ్డాను. ఈ పాట చేసేముందు రాహుల్ నాకు చెప్పిందేంటంటే ఇది ప్రతి అమ్మాయి ఆంథెమ్ గా ఉండాలి, భూమా ఆంథెమ్ గా ఉండాలి అన్నారు. కష్టపడి ఈ పాట చేశా. మొత్తం ఆల్బమ్ కు రాహుల్ ఇండియన్, వెస్ట్రన్ కలిసిన మ్యూజిక్ కావాలని అడిగాడు. అందుకే మన రాగాలు, వెస్ట్రన్ ఇన్ స్ట్రుమెంట్స్ ఉపయోగించాం.
సినిమాలో విక్రమ్, భూమా పాత్రల మధ్య ఉండే సంఘర్షణే నేను ఈ సినిమాకు మంచి పాటలు చేసేందుకు స్ఫూర్తినిచ్చింది. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. నేనూ ఈ సినిమా చూసి ఆలోచనలో పడ్డాను. మీరంతా మూవీ చూసి అప్రిషియేట్ చేస్తారనే నమ్మకం ఉంది. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ రాహుల్ కే దక్కుతుంది. ఈ చిత్రంలోని పాటలన్నీ కథలో సరైన సందర్భంలో వచ్చేలా రాహుల్ డిజైన్ చేసుకున్నాడు.
ఒక మంచి పాట చేసేందుకు ప్రతి సమయం సరైనదే. నాకు కంపోజింగ్ కు ప్రత్యేకంగా ఒక సమయం పెట్టుకోను. నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఆయన దిల్ సే సినిమా పాటలను నేను చదువుకునేప్పుడు పాడేవాడిని. ఐఫా వేడుకల్లో ఆయన సమక్షంలో నేను కంపోజ్ చేసిన హాయ్ నాన్న పాటలు పాడటం మర్చిపోలేని సందర్భం. తెలుగులో కీరవాణి ఇష్టం. అలాగే థమన్, దేవిశ్రీ ప్రసాద్, భీమ్స్...వీళ్ల మ్యూజిక్ అన్నా ఇష్టపడతాను.
నేను సింగర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా మారాను. అందుకే నా సినిమాల్లో ఒక పాటైనా పాడమని మేకర్స్ అడుగుతుంటారు. మాస్ జాతర, కన్నప్ప లాంటి ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ సినిమాల్లోనూ పాటలు పాడాను. సింగర్ గా మిగతా చిత్రాల్లో పాడటం కూడా నాకు అనుభవాన్నిస్తోంది. దీంతో తెలుగు త్వరగా నేర్చుకుంటున్నా. వచ్చిన అన్ని అవకాశాలు చేయడం లేదు. ఒకేలా ఉన్న మూవీస్ వస్తే వదులుకుంటున్నా. అయితే సితార, గీతా ఆర్ట్స్, మైత్రీ లాంటి సంస్థల నుంచి ఏ అవకాశం వచ్చినా వదులుకోను. నాకు టాలీవుడ్ లో గుర్తింపు ఇచ్చిన సంస్థలు ఇవి.
నేను లవ్ సాంగ్స్ ఎక్కువగా చేశాను. త్వరలో మాస్, బీట్ సాంగ్స్ కూడా చేయబోతున్నా. అలాంటి మూవీస్ అవకాశాలు వస్తున్నాయి. ప్రేమ కథలకు బీజీఎం చాలా కీలకం. నేను మ్యూజిక్ చేసిన మనమే, 8 వసంతాలు సినిమాల్లోని బీజీఎం కూడా మంచి పేరొచ్చింది. తెలుగు సినిమా పరిశ్రమలో పనిచేయడం సంతోషంగా ఉంది. నాకు ఇక్కడ ఒకదాని తర్వాత మరొకటిగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. మలయాళంలో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాను. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ, వైష్ణవి జంటగా దర్శకుడు ఆదిత్య హాసన్ రూపొందిస్తున్న సినిమాతో పాటు తమిళం, కన్నడలో సినిమాలు చేస్తున్నా. నా ఫస్ట్ బాలీవుడ్ మూవీ కూడా త్వరలో ప్రకటిస్తా.