pizza

Beautiful melody Nadhive released from the movie The Girlfriend
'ద గర్ల్ ఫ్రెండ్' సినిమా నుండి జారిన ఓ అందమైన మెలోడీ "నదివే.. నువ్వు నదివే"

You are at idlebrain.com > news today >

16 July 2025
Hyderabad

A beautiful melody, "Nadive.. Nuvvu Nadive", has been released from the film The Girlfriend. This soothing track carries profound meaning within its simplicity.

Starting with the lines "Velu daaruna nishi poosina... veli vesina madi veeduna", the song has been composed and sung by Hesham Abdul Wahab. The essence of the song lies in a lover's unwavering promise to stand by his beloved through every hardship. Hesham's soulful voice adds depth, and the visuals featuring Rashmika and Dheekshith Shetty’s graceful dance perfectly complement the tune. The film is directed by Rahul Ravindran.

With lyrics like "Gunde kanumusina.. vidhi rasina.. kala kaalipovu nijamaina.. ninu vadalakuma", the song beautifully portrays the resolve of a lover who vows never to let go, reassuring his partner about their future together, urging her to keep moving forward like a river. Lyricist Rakendu Mouli crafts a life lesson into the song - if we stop because of hardships, life loses its meaning.

The track leaves us wondering: what broke her spirit so deeply, and what circumstances led him to become her source of courage?

'ద గర్ల్ ఫ్రెండ్' సినిమా నుండి జారిన ఓ అందమైన మెలోడీ "నదివే.. నువ్వు నదివే"

ఓ మంచి మెలోడీ సాంగ్ 'ద గర్ల్ ఫ్రెండ్' సినిమా నుండి బయటికొచ్చింది. వినసొంపుగా ఉన్న ఈ పాటలో సంద్రం అంత అర్ధం కనిపిస్తుంది.

"వెలు దారున నిశి పూసినా..వెలి వేసినా మది వీడునా" అంటూ మొదలయ్యే ఈ పాటకు సంగీతాన్నిఅందించింది హేషం అబ్దుల్ వహాబ్. ఈ పాట పాడింది కూడా ఆయనే. ఎంత కష్టమొచ్చినా తన ప్రేయసి వెంట నిలబడతానని ప్రియుడు చెప్తున్న ధైర్యమే ఈ పాట. అబ్దుల్ వహాబ్ గాత్రం శ్రోతలకు నచ్చుతుంది. ఈ పాటలో రష్మిక మరియు దీక్షిత్ శెట్టిల నృత్యం కూడా పాటకు తగ్గట్టే ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకు దర్శకుడు రాహుల్ రవీంద్రన్.

"గుండె కనుమూసినా..విధి రాసినా..కల కాలిపోవు నిజమైనా..నిను వదలకుమా.." అంటూ ఎలాంటి సందర్భంలోనూ ప్రేయసి చేతిని విడిచిపెట్టనంటూ, ప్రేయసి భవిష్యత్తుకి ధైర్యం చెపుతూ, నదిలా ఆగిపోకుండా సాగాలని చెప్పే విధానం బాగుంది. కష్టాలకు ఆగిపోతే మనిషి జీవితానికొక అర్ధముండదన్న భావం కలిగేలా ఈ పాటను రచించారు రచయిత రాకేందు మౌళి. జీవిత పాఠాన్ని ఓ పాట రూపంలో మలిచినట్టుంది ఈ పాట విన్నంతసేపూ. ఎందుకిలా ఓటమి ఆమెను కుంగించిందో, ఏ సందర్భంలో ఆమెకు అతనిలా ధైర్యం చెపుతూ ధైర్యం అవ్వాల్సి వచ్చిందో తెలియాల్సివుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved