As a Producer, The Girlfriend gave me immense satisfaction: Ace Producer Allu Aravind at Pre Release Press Meet
నిర్మాతగా నాకు ఎంతో సంతృప్తిని కలిగించిన సినిమా "ది గర్ల్ ఫ్రెండ్" - ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్
The movie stars National Crush Rashmika Mandanna and talented actor Dheekshith Shetty in the lead roles. It is being jointly produced by Geetha Arts and Dheeraj Mogilineni Entertainment, presented by Allu Aravind. The film is written and directed by Rahul Ravindran and produced by Dheeraj Mogilineni and Vidya Koppineedi. The Girlfriend is an intense and emotional love story that will release on November 7 in Telugu and Hindi, and on November 14 in Tamil, Malayalam, and Kannada across the world. The team held a grand pre-release press meet in Hyderabad today.
Editor Chota K Prasad said, “Geetha Arts has its own editing room, and I always wondered when I would get a chance to work there. I feel fortunate that The Girlfriend gave me that opportunity. Allu Aravind garu has seen every kind of success, and I’m sure this film will be a memorable one in his career.”
Music Director Prashanth Vihari said, “Working on The Girlfriend was a big experience for me. The movie is a visual feast. After watching it, audiences will remain emotionally moved for a while.”
Music Director Hesham Abdul Wahab said, “This is the first Telugu movie I agreed to do. After Hridayam, Rahul was the first director from Hyderabad to approach me. He has made this movie a visual experience. I want to thank Prashanth Vihari for the background score. All the songs are very enjoyable. Please watch our film in theatres and support us.”
Producer Dheeraj Mogilineni said, “Director Rahul lives and breathes cinema. Even though he went through personal challenges, he never stopped working. We’re both friends and sometimes rivals, but he’s truly passionate. He plans to buy his own house, and I promise I’ll make that happen after the release of The Girlfriend. We approached several heroes for various stories before this one, but nothing materialized. Two years ago, we narrated this story to Rashmika, and she immediately said yes. Later, we got Dheekshith’s dates, but shooting didn’t happen on schedule. Still, he adjusted multiple times. After this movie, he’ll get many offers in Telugu cinema because his performance is amazing. Hesham was first approached by us before he did Kushi and Hi Nanna. Both Hesham and Prashanth worked without ego and helped us complete the film on time. Vidya akka was crucial + without her, this film wouldn’t have happened. Just like Geetha Arts and Vyjayanthi Movies have worked together, I hope to make at least ten more films with Vidya akka. She’s not in anyone’s shadow; she’s going to be a major producer. With Allu Aravind garu’s presence, I feel like God himself is with me. No matter the problem, his support gives me confidence. I even want to put his photo in our office for inspiration.”
Producer Vidya Koppineedi said, “Whenever I need advice, I turn to Allu Aravind mama. After hearing the story, he encouraged us to make it, saying it was very relevant to today’s audience. This is not just our film - it’s a movie everyone should watch in theatres and show to their children. As a mother, sister, and daughter, I can say this film carries deep emotional values. Some feelings in life can’t be described in words, and The Girlfriend gives answers to many unspoken questions. It’s not just a women-centric film; both men and women must see it at least once. After watching Dheekshith and Rashmika as Vikram and Bhuma, audiences will remember them by those characters for a long time. Anu Emmanuel’s character makes you wish you had a friend like her; people will remember her as Durga.”
Director Rahul Ravindran said, “The Girlfriend has been a beautiful journey in my career. If Allu Aravind garu hadn’t approved it, this project wouldn’t exist. I feel proud to be a part of the long and respected legacy of Geetha Arts. Vidya and Dheeraj have been fantastic producers. Vidya has great vision, and Dheeraj and I, even when we argued, always ended with a hug. The entire team - DOP, editor, music directors worked with great passion. I was unsure if Anu Emmanuel would accept the Durga role, but she did and performed brilliantly. Dheekshith and Rashmika’s performances are unforgettable. When Aravind garu saw the first schedule’s footage, he praised Dheekshith and immediately gave him an advance cheque for his next movie. There are few actors in his age group with such range. Rashmika is the soul of this film - she not only acted but lived the character. Her performance will be remembered as one of the best by a Telugu actress this decade and will surely earn her awards.”
Hero Dheekshith Shetty said, “I thank director Rahul for trusting me with Vikram’s role. During the shoot, Allu Aravind garu gave me an advance for another project. That wasn’t just money - it was confidence and hope. Coming from TV and theatre, I doubted whether I could establish myself in cinema, but his words gave me belief. Vidya ma’am supported me a lot. I used to wait eagerly for shooting calls. Rashmika was a wonderful co-star; she never made me feel like I was working with a star. If I performed well, the credit goes to her. Like Rahul said, if even one Vikram in the audience changes after watching our film, our effort will be worth it. Please watch The Girlfriend in theatres and support us.”
Producer Allu Aravind said, “I’ve produced many films and earned crores through cinema, and I say that with no hesitation. But what I wanted to earn from The Girlfriend was not money - it was satisfaction. This movie gives me immense creative fulfillment. When I first heard the story, I felt that some unspoken truths about life needed to be told through cinema. Only a sensitive and committed filmmaker like Rahul could handle such a subject. He narrated it with great emotion and made it just as beautifully. This isn’t a film to watch for its songs, jokes, or entertainment - it’s one to feel deeply. You have to watch it thinking about the emotions and unspoken desires in the hearts of women around us - our sisters, mothers, and daughters.
If not titled The Girlfriend, the film could have been called "Nee Jeevithamantha Nene." It’s a delicate love story between a boy and a girl that ends with powerful intensity. After watching it, many people may find it hard to sleep that night - it will haunt them. Every family will relate to this story in some way, either personally or through someone they know. Even critics will find it difficult to rate this film.
Rashmika has truly lived the role. Dheekshith’s performance shows he’ll have a bright future in Telugu cinema. After watching him, I gave him an advance for my next film immediately. Every scene he did was perfect. Vidya and Dheeraj are close to me - Dheeraj’s father introduced him to me, and I didn’t expect he’d be producing with Geetha Arts so soon. Vidya is like my daughter - she grew up with us and now she’s part of Geetha Arts. Dheeraj, Vidya, Vasu, SKN - all those I’ve encouraged are keeping Geetha Arts thriving with their work. I hope the media treats this film with responsibility and helps promote it strongly.”
Technical Crew:
Cinematography – Krishnan Vasant
Music – Hesham Abdul Wahab
Costumes – Sravya Varma
Production Design – S. Ramakrishna, Mounika Nigothri
PRO – GSK Media, Vamsi Kaka
Marketing – First Show
Presented by – Allu Aravind
Banners – Geetha Arts & Dheeraj Mogilineni Entertainment
Producers – Dheeraj Mogilineni, Vidya Koppineedi
Writer & Director – Rahul Ravindran
నిర్మాతగా నాకు ఎంతో సంతృప్తిని కలిగించిన సినిమా "ది గర్ల్ ఫ్రెండ్" - ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 7న హిందీతో పాటు తెలుగులో.. ఈ నెల 14న, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ మాట్లాడుతూ - గీతా ఆర్ట్స్ లో ఎడిటింగ్ రూమ్ ఉంటుంది. నేను అక్కడ వర్క్ చేసే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవాడిని. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాతో ఆ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. అల్లు అరవింద్ గారు చూడని సక్సెస్ లేదు. ఎన్నో పెద్ద చిత్రాలు నిర్మించారు. ఈ సినిమా ఆయన కెరీర్ లో ఒక ప్రత్యేక చిత్రంగా పేరు తెచ్చుకుంటుంది. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి మాట్లాడుతూ - "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాకు వర్క్ చేయడం నాకు ఒక బిగ్ ఎక్సిపీరియన్స్ అనుకుంటాను. ఈ సినిమా విజువల్ ఫీస్ట్ లా ఉంటుంది. మీరు సినిమా చూసి బయటకు వచ్చాక కాసేపు మూవీ ప్రభావంలోనే ఉండిపోతారు. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహాబ్ మాట్లాడుతూ - నేను తెలుగులో ఒప్పుకున్న మొదటి సినిమా ఇదే. నేను చేసిన హృదయం సినిమా రిలీజ్ తర్వాత హైదరాబాద్ నుంచి నన్ను అప్రోచ్ అయిన ఫస్ట్ డైరెక్టర్ రాహుల్. ఈ సినిమాను విజువల్ ఎక్సిపీరియన్స్ లా ఆయన తెరకెక్కించారు. బీజీఎం అందించిన ప్రశాంత్ విహారికి థ్యాంక్స్. ఈ చిత్రంలోని పాటలన్నీ మీరు ఎంజాయ్ చేస్తారు. మా మూవీని థియేటర్స్ లో చూసి ఆదరించండి. అన్నారు.
ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ - సినిమానే ప్రపంచంగా జీవించే డైరెక్టర్ రాహుల్. ఆయన పర్సనల్ లైఫ్ లో కొన్ని ఘటనలు జరిగాయి. అయినా సినిమా వర్క్ మాత్రం ఏరోజు ఆపలేదు. మేము మంచి స్నేహితులం, శత్రువులం కూడా. ఆయన సొంతిల్లు కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారు. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా రిలీజ్ తర్వాత రాహుల్ సొంతింటి కల నేను నెరవేరుస్తా. ఆయనతో మరిన్ని మూవీస్ చేయాలని ఉంది. మేము కొన్ని కథలు అనుకుని హీరోలను అప్రోచ్ అయ్యాం. ఏ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాలేదు. ఆ తర్వాత రెండేళ్ల కిందట రశ్మిక గారిని ఈ సబ్జెక్ట్ తో కలిస్తే ఆమె వెంటనే ఒప్పుకున్నారు. ఆ తర్వాత దీక్షిత్ డేట్స్ తీసుకున్నాం. కానీ ఆ డేట్స్ కు సినిమా షూటింగ్ కాలేదు. దీక్షిత్ ఎన్నోసార్లు డేట్స్ అడ్జస్ట్ చేశాడు. ఈ సినిమా తర్వాత అతనికి తెలుగులో బాగా ఆఫర్స్ వస్తాయి. ఆయన అద్భుతమైన పర్ ఫార్మెన్స్ ను థియేటర్స్ లో ప్రేక్షకులు చూడబోతున్నారు. హేషమ్ గారిని తెలుగు నుంచి ఫస్ట్ అప్రోచ్ అయ్యింది మేమే. ఆ తర్వాత ఖుషి, హాయ్ నాన్న వంటి హిట్ మూవీస్ చేశారు. ఈ సినిమాకు హేషమ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ప్రశాంత్ విహారితో కలిసి ఎక్కడా ఈగోలు లేకుండా మాకు టైమ్ కు మూవీ కంప్లీట్ అయ్యేలా వర్క్ చేశారు. విద్య అక్క లేకుంటే ఈ ప్రాజెక్ట్ అయ్యేది కాదు. గీతా ఆర్ట్స్ వైజయంతీ మూవీస్ కలిసి సినిమాలు చేసినట్లు, విద్య అక్కతో కలిసి కనీసం మరో పది సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. విద్య అక్క ఎవరి షాడోలో లేరు. ప్రొడ్యూసర్ గా పెద్ద సినిమాలు చేయబోతున్నారు. అరవింద్ గారి రూపంలో దేవుడు నా వెంట ఉన్నాడు అనుకుంటున్నా. నాకు ఏ కష్టం వచ్చినా అరవింద్ గారు ఉన్నారనే భరోసా ఉంది. ఆయన పర్మిషన్ తో మా ఆఫీస్ ల్లో అరవింద్ గారి ఫొటో పెట్టుకోవాలని అనుకుంటున్నాం. అన్నారు.
ప్రొడ్యూసర్ విద్య కొప్పినీడి మాట్లాడుతూ - నేను ఏదైనా సలహా అడగాలంటే అరవింద్ గారినే అడుగుతుంటా. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా కథ విన్నాక ఆయన ఈతరం ప్రేక్షకులకు చాలా రిలవెంట్ గా ఉండే సబ్జెక్ట్ ఇది చేయమని ప్రోత్సహించారు. ఇది మేము చేసిన సినిమా అని చెప్పడం లేదు కానీ "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ప్రతి ఒక్కరూ థియేటర్స్ లో చూడాలి. మన పిల్లలకు చూపించాలి. ఒక తల్లిగా, సోదరిగా, బిడ్డగా నేనీ మాట చెబుతున్నా. ఎన్నో విలువలు ఉన్న సినిమా ఇది. మనం జీవితంలో ఎక్సిపీరియన్స్ చేస్తే గానీ చెప్పలేం. ఎన్నో ఫీలింగ్స్ ఉన్నా మాటల్లో వివరించలేం, మనం అడగలేని ప్రశ్నలు కూడా ఉంటాయి. అలాంటి అన్నింటికీ ఈ సినిమా సమాధానంగా నిలుస్తుంది. ఇది వుమెన్ సెంట్రిక్ మూవీ కాదు, అబ్బాయిలు, అమ్మాయిలు ఒక్కసారైనా ఈ సినిమా చూడాలి. ఈ చిత్రంలో దీక్షిత్, రశ్మిక పర్ ఫార్మ్ చేసిన తీరు చూస్తుంటే వాళ్లను భూమా, విక్రమ్ గానే ప్రేక్షకులు చాలా కాలం గుర్తుపెట్టుకుంటారు. మనం కూడా దీక్షిత్, రశ్మికను మర్చిపోయి ఆ పాత్రలనే చూస్తాం. అనూ ఇమ్మాన్యుయేల్ క్యారెక్టర్ చూశాక అలాంటి ఒక ఫ్రెండ్ ఉండాలని అనుకుంటారు. ఆమెను దుర్గ పాత్రలోనే మీరంతా గుర్తుపెట్టుకుంటారు. అన్నారు.
డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ - "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నా కెరీర్ లో ఒక బ్యూటిఫుల్ జర్నీగా మిగిలిపోతుంది. అరవింద్ గారు ఓకే చెప్పకుంటే ఈ ప్రాజెక్ట్ ఉండేది కాదు. గీతా ఆర్ట్స్ సుదీర్ఘ ప్రస్థానంలో దర్శకుడిగా నేనూ ఉండటం గర్వంగా ఉంది. విద్య, ధీరజ్ నాకు దొరికిన మంచి ప్రొడ్యూసర్స్. విద్య గారికి సినిమా పట్ల మంచి విజన్ ఉంది. ధీరజ్ నేను సినిమా కోసం ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా, వెళ్లేప్పుడు హగ్ చేసుకునేవాళ్లం. ఈ సినిమాకు అనుకున్నది అనుకున్నట్లు తీసేలా ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేశారు. డీవోపీ, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్..ఇలా మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ ఎంతో ప్యాషనేట్ గా వర్క్ చేశారు. అనూ ఇమ్మాన్యుయేల్ ను అప్రోచ్ అయినప్పుడు ఆమె చేస్తారా చేయరా అనే సందేహం ఉండేది. కానీ దుర్గ క్యారెక్టర్ కు ఆమె ఓకే చెప్పి సూపర్బ్ గా పర్ ఫార్మ్ చేశారు. దీక్షిత్, రశ్మిక చేసిన పర్ ఫార్మెన్ ను ప్రేక్షకులు మర్చిపోలేరు. దీక్షిత్ ను చూస్తుంటే ఎంత బాగా నటిస్తున్నాడని ఇంప్రెస్ అయ్యా. ఫస్ట్ షెడ్యూల్ రశెస్ చూసి అరవింద్ గారు ఎంతబాగా నటిస్తున్నాడు అని ప్రశంసించారు. నెక్ట్స్ డే లొకేషన్ కు వచ్చి దీక్షిత్ కు నెక్ట్స్ మూవీకి అడ్వాన్స్ చెక్ ఇచ్చారు. దీక్షిత్ ఏజ్ గ్రూప్ లో అన్ని అంశాల్లో మెప్పించే హీరోలు తక్కువగా ఉన్నారు, దీక్షిత్ సక్సెస్ అయితే అది మాలాంటి మేకర్స్ అందరికీ సక్సెస్ వచ్చినట్లే. రశ్మిక లేకుంటే ఈ సినిమా లేదు. స్క్రిప్ట్ వినగానే ఈ సినిమా మనం వెంటనే చేయాలని ఓకే చెప్పింది. పెద్ద పెద్ద సినిమాలు చేయడం వల్లే "ది గర్ల్ ఫ్రెండ్" లాంటి సినిమా చేయగలుగుతున్నా అని రశ్మిక ఇంటర్వ్యూస్ లో చెప్పడం హ్యాపీగా అనిపించింది. రశ్మిక బాగా నటిస్తుందని తెలుసు గానీ మానిటర్ లో కొన్ని సీన్స్ చూస్తుంటే ఆమె ఆ పాత్రలో జీవించింది అనే ఫీల్ కలిగింది. ఈ సినిమాలో రశ్మిక చేసిన పర్ ఫార్మెన్స్ ఈ దశాబ్దంలో ఒక ఫీమేల్ యాక్టర్ తెలుగులో చేసిన బెస్ట్ పర్ ఫార్మెన్స్ గా నిలుస్తుంది. ఆమె ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ కు అర్హురాలు. అన్నారు.
హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ - "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాలో విక్రమ్ రోల్ ను నేను పర్ ఫార్మ్ చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రాహుల్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే నాకు మరో మూవీకి అడ్వాన్స్ ఇచ్చిన అరవింద్ గారికి థ్యాంక్స్. ఆయన ఇచ్చింది అడ్వాన్స్ కాదు ఎంతో ధైర్యం. టీవీ, నాటకం నుంచి వచ్చిన నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలనా అనే సందేహం ఉండేది. అరవింద్ గారు ఇచ్చిన ప్రశంసలు, అడ్వాన్స్ తో నాకు ఎంతో ఆత్మవిశ్వాసం కలిగింది. నేను సరైన దారిలోనే వెళ్తున్నాను అనిపించింది. విద్య గారు ప్రొడ్యూసర్ గా చాలా సపోర్ట్ చేశారు. ఈ టీమ్ నుంచి షూటింగ్ కోసం ఎప్పుడు ఫోన్ వస్తుందా అని ఎదురుచూసేవాడిని. రశ్మికతో నటిస్తున్నప్పుడు ఒక స్టార్ తో నటిస్తున్నా అనే ఫీల్ ఎప్పుడూ కలగలేదు. చాలా మంచి కోస్టార్ తను. నేను ఈ మూవీలో బాగా పర్ ఫార్మ్ చేశాను అంటే అందుకు రశ్మిక కారణం. రాహుల్ చెప్పినట్లు మా సినిమా చూస్తూ థియేటర్ లో ఒక్క విక్రమ్ మారినా మా ప్రయత్నం సక్సెస్ అయినట్లే. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాను థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయండి. అన్నారు.
ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ - నిర్మాతగా ఎన్నో సినిమాలు చేశాను, చేస్తున్నాను. సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాను. అందులో దాపరికం లేదు. అయితే "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ద్వారా నేను సంపాదించాలనుకున్నది డబ్బు కాదు. సంతృప్తి. ఈ సినిమా నిర్మించాననే విషయం ఎంతో సంతృప్తినిస్తోంది. మనకు తెలిసిన కొన్ని చెప్పలేని నిజాలను సినిమా మాధ్యమం ద్వారా చెప్పాలి అనే ఫీల్ ఈ కథ విన్నప్పుడు కలిగింది. రాహుల్ లాంటి సున్నిత మనస్కుడు, కమిటెడ్ పర్సన్ మాత్రమే ఇలాంటి సినిమాను రూపొందించగలరు. ఆయన కథ చెబుతున్నప్పుడు ఎంత ఉద్వేగంతో చెప్పారో, సినిమాను కూడా అంతే బాగా తెరకెక్కించారు. ఎన్ని పాటలున్నాయి, ఎన్ని జోక్స్ ఉన్నాయి, ఎంత ఎంటర్ టైన్ మెంట్ ఉంది అని చూసే సినిమా కాదిది. అలా చూస్తే ఈ సినిమా చేయలేం. మన అక్క, చెల్లి, పిన్ని వాళ్ల మనసుల్లో ఏముంటుంది, ఎలాంటి కోర్కెలు ఉంటాయి అనుకుని మూవీ చూడాలి. ది గర్ల్ ఫ్రెండ్ కాకుండా మరో టైటిల్ ఈ సినిమాకు చెప్పమంటే నీ జీవితమంతా నేనే అని చెప్పాలి. అమ్మాయి అబ్బాయి తమ జీవిత భాగస్వామి గురించి ఇలాగే అనుకుంటూ అతి సున్నితంగా సాగే ఈ సినిమా చివరకు అతి ఘాటుగా ముగుస్తుంది. ఈ సినిమా చూశాక చాలామంది ఆ రాత్రి నిద్రపోరు. అంతగా ఈ మూవీ వారిని వెంబడిస్తుంది. ప్రతి ఫ్యామిలీలో ప్రతి పర్సన్ ఈ మూవీలోని కథతో రిలేట్ అవుతారు. తమకు కాకున్నా తమకు తెలిసిన వారికి ఇలా జరిగింది అనుకుంటారు. ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వడానికి క్రిటిక్స్ కూడా ఇబ్బంది పడతారు. రశ్మిక మంచి నటి అని తెలుసు. ఈ సినిమాలో జీవించేసింది. దీక్షిత్ పర్ ఫార్మెన్స్ చూసి ఇతను తెలుగులో స్థిరపడతాడు, ఇలాంటి ప్రతిభావంతులను ప్రోత్సహించాలి అనిపించింది. వెంటనే నా సినిమాలో చేస్తున్నావు అంటూ చెక్ ఇచ్చాను. ఏ సీన్ చూసినా ఇంతకంటే బాగా చేయలేం అనేంతగా దీక్షిత్ పర్ ఫార్మ్ చేశాడు. విద్య, ధీరజ్ మంచి ఫ్రెండ్స్. ధీరజ్ ను వాళ్ల నాన్న నాకు పరిచయం చేశాడు. ఇండస్ట్రీలో నిర్మాతగా అంత సులువు కాదు అతనే తెలుసుకుంటాడు అనుకున్నా కానీ ఇలా మా గీతా సంస్థతో కలిసి సినిమాలు చేస్తాడని అనుకోలేదు. విద్య నా కూతురు లాంటిది. నా దగ్గరే పెరిగింది. ఈ రోజు మా గీతా ఆర్ట్స్ ను సొంతం చేసుకుంది. ధీరజ్, విద్య, వాసు, ఎస్ కేఎన్..ఇలా నేను ఎంకరేజ్ చేసిన వాళ్లంతా మాతో కలిసి సినిమాలు చేస్తూ గీతా ఆర్ట్స్ ను పచ్చగా ఉంచుతున్నారు. మీడియా కూడా ఈ సినిమాను ఒక బాధ్యతగా ఫీలై ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.