pizza

The Great Pre-Wedding Show Continues Its Dream Run, Crossing $100K milestone in North America
$100K డాల‌ర్స్ వ‌సూళ్ల‌తో నార్త్ అమెరికాలో దూసుకెళ్తోన్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’

You are at idlebrain.com > news today >

19 November 2025
Hyderabad

The Great Pre-Wedding Show, which has steadily grown through strong word of mouth and an unexpectedly warm reception, has now touched another milestone: a North America gross of $100,777+. For a film positioned as a small, rooted entertainer, this milestone is a genuine badge of honour, earned not through noise, but through consistency. The overseas release has been handled by Atharvana Bhadrakali Pictures, whose strategy and reach played a key role in taking the film to Telugu audiences across the US and Canada.

Its success comes from something simple yet surprisingly rare: authenticity. The plot is deceptively straightforward, Ramesh, a small-town photographer, gets pulled into a chain of personal and emotional misadventures after a lost memory card sets off chaos. What works is the film’s lived-in humour, its affectionate look at everyday people, and performances that never tip into exaggeration. The lead brings a grounded charm, the supporting cast delivers humour that feels organic, and the writing captures the texture of rural life without mocking or glorifying it. This blend of slice-of-life drama, situational comedy, and emotional honesty gave audiences exactly what they’ve been missing: a film that feels human.

Directed by Rahul Srinivas, the film features Thiruveer, Teena Sravya, and Narendra Ravi in key roles. Produced under 7PM Productions with the backing of Sandeep Agram and Ashmita Reddy Basani, the film released on November 7, 2025, and has since built its reputation brick by brick. Early critical appreciation turned into strong audience support, which snowballed into this overseas success. With its North American run gaining momentum, the film stands as a reminder that you don’t need spectacle to make an impact, just sincerity, craft, and a story worth telling.

$100K డాల‌ర్స్ వ‌సూళ్ల‌తో నార్త్ అమెరికాలో దూసుకెళ్తోన్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’

వెర్సటైల్ యాక్ట‌ర్‌ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నవంబర్ 7న వచ్చిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’. సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ఈ సినిమా మౌత్ టాక్‌తో అద్భుత‌మైన స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంటోంది. నార్త్ అమెరికాలో చిన్న చిత్రం సాధించిన మైల్ స్టోన్ ఇది. అథ‌ర్వ‌ణ భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని ఓవ‌ర్ సీస్‌లో విడుద‌ల చేశారు. వారి ప్లానింగ్, రీచ్‌తో ఈ సినిమాను అమెరికా, కెన‌డాలోని ప్రేక్ష‌కులకు చేర‌వేయటంలో కీల‌క పాత్ర‌ను పోషించాయి.

ఇది సింపుల్‌గా, ఆశ్చ‌ర్య‌క‌రంగా అనిపించే అరుదైన విజ‌యం. చిన్న ప‌ట్నంలో ఉండే ర‌మేష్ అనే ఫొటోగ్రాఫ‌ర్ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసిన‌ప్పుడు మెమొరీ కార్డుని కోల్పోవ‌టం కార‌ణంగా ఏర్ప‌డే గంద‌ర‌గోళ‌మైన ప‌రిస్థితుల‌తో న‌డిచే క‌థ‌తో సినిమాను తెర‌కెక్కించారు. మ‌నం రోజు మ‌న చుట్టూ ఉన్న వారిలో చూసే కామెడీ, ఆప్యాయ‌త వంటి కోణాల‌ను అతిశ‌యోక్తిగా కాకుండా మ‌న‌కు క‌నెక్ట్ అయ్యేలా చిత్రీక‌రించారు. స‌న్నివేశాల్లోని కామెడీ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు ఎలా ఉంటారు, ఎలా ప్ర‌వ‌ర్తిస్తార‌నే అంశాల‌ను స‌హ‌జంగా చిత్రీక‌రించారు. మ‌న‌సుల జీవితాల్లోని డ్రామా, కామెడీ, భావోద్వేగాల్లోని నిజాయ‌తీ క‌ల‌యిక‌గా రూపొందిన ఈ సినిమా ఏదో మిస్ అయ్యామ‌నే భావించే ప్రేక్ష‌కులు కోరుకునే అంశాల‌ను స‌హ‌జంగా అందించింది.

విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకున్న ఈ సినిమా క్ర‌మంగా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌ను కూడా పొందుతూ ఓవ‌ర్‌సీస్‌లో విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది. నార్త్ అమెరికాలోని ఆడియెన్స్‌కు సినిమా బాగా క‌నెక్ట్ అవుతోంది. భారీ స్పెష‌ల్ ఎఫెక్ట్స్‌, భారీత‌నంతోనే కాకుండా నిజాయ‌తీ, నైపుణ్యంతో మంచి క‌థ ఉంటే చాల‌ని మ‌రోసారి ఈ సినిమా నిరూపించింది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved