pizza

Paradise new viral poster
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన న్యాచురల్ స్టార్, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్

You are at idlebrain.com > news today >

16 September 2026
Hyderabad

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

తాజాగా మేకర్స్ నాని, కయాదు లోహార్‌ను ఇంటెన్స్ రొమాంటిక్ అవతార్‌లో ప్రజెంట్ చేస్తూ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

పోస్టర్‌లో నాని రఫ్ అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తుండగా, కయదు లోహార్ కూడా ఇంటెన్స్ అవతార్‌లో కనిపించారు. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడి.. సిగరెట్స్ ను లైటర్‌తో వెలిగించుకుంటున్న విజువల్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. చుట్టూ ఉన్న డార్క్, ఇంటెన్స్ వాతావరణం మధ్య ఈ సన్నివేశం వారి మధ్య ఉన్న బాండింగ్‌ను డిఫరెంట్‌గా ప్రజెంట్ చేస్తోంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇందులో హీరో, హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా ఉండబోతున్నాయి. జడల్ & సుబ్బు..ప్రేమ ఇంతకుముందెన్నడూ చూడనంత ప్రత్యేకంగా ఉండబోతుంది.

‘ది ప్యారడైజ్’ సెన్సార్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుంది.

రేపటి నుంచి మిగతా భాషల్లో ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేస్తున్నారు. రేపు హీరో నాని చెన్నై వెళ్తున్నారు.

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved