pizza

‘Vevela Oohale Chupina’, the Second Song from Chitralayam Studios’ New-Age Crime Comedy ‘Baa Baa Black Sheep’, Released by Hit Machine Anil Ravipudi – Grand Theatrical Release on October 9హిట్ మెషిన్ అనిల్‌ రావిపూడి చేతుల మీదుగా చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘వెవెలా ఊహ‌లే చూపినా..’ సాంగ్ రిలీజ్ - అక్టోబ‌ర్ 9న సినిమా భారీ విడుద‌ల‌

You are at idlebrain.com > news today >

16 September 2026
Hyderabad

‘Baa Baa Black Sheep’ is a new-age crime comedy being made with a different concept to entertain audiences across all sections. Presented by Donepudi Chakrapani and produced by Venu Donepudi under the Chitralayam Studios banner, the film is directed by Guni Manchikanti. The movie is set for a grand theatrical release on October 9. Tinu Anand, Upendra, George Maryan, Akshay, Vishnu, Karthikeya, Vismayasri, Malavi Malhotra, Kashyap, Raja Ravindra and others play key roles.

Interestingly, ‘Baa Baa Black Sheep’ is the first South Indian film to be shot entirely in the state of Meghalaya. The teaser released earlier, along with the recently released song ‘Aaja Meri Jaani’, received an amazing response. Against this backdrop, the makers have now released the film’s second song, ‘Vevela Oohale Chupina’. Hit Machine Anil Ravipudi unveiled the song and congratulated the entire team.

Coming to the backdrop of ‘Vevela Oohale Chupina’, a villain gang is searching for a rare box that they desperately want. They believe that the box is with the hero and heroine. At the same time, the hero and heroine come into the gang’s sight. Meanwhile, the hero is holding a gun, which unexpectedly goes off. The gang then starts firing back at the hero and heroine. It is against this backdrop that the retro-styled song ‘Vevela Oohale Chupina’ plays.

The song has been penned by Kittu Vissapragada and sung by Shrri Sagar. With a distinctive backdrop and engaging music, the song is captivating throughout and makes listeners want to play it on repeat. On this occasion...

Producer Venu Donepudi said, “The teaser of our film ‘Baa Baa Black Sheep’ and the song ‘Aaja Meri Jaani’ have received a superb response so far. Now, we are bringing the song ‘Vevela Oohale Chupina’ to you. This is a song that unfolds in a very different style. My thanks to Anil Ravipudi garu for releasing this song. We are releasing the film on October 9. The post-production work is currently in the final stage.

“We completed the entire film in Meghalaya. ‘Baa Baa Black Sheep’ is the first South Indian movie to have been shot entirely in Meghalaya. We also filmed in breathtaking locations such as Cherrapunji. We successfully completed the film with meticulous planning. This was made possible with the support of our director Guni Manchikanti, the actors, technicians and the entire team.”

Cast

Tinnu Anand, Upendra Limaye, George Maryan, Akshay, Karthikeya, Subhalekha Sudhakar, Abhinav, Harsha, Kishore Krishna, Vismaya sri, Malavi Malhotra, Samriddhi, Vishnu Oy, Kashyap, Raja Ravindra, K. L. Damodhar Prasad, Aneesh Kuruvilla, Kadambari Kiran and others.

Technical Team

Banner: Chitralayam Studios
Producer: Venu Donepudi
Co-Producer: Kondal Jinna
Director: Guni Manchikanti
Creative Producer: Swetha Donepudi
Music: Electronic Kili & Arcado
Art: Sahi Suresh
Editing: Vijay Mukthavarapu
Cinematography: Ajay Abraham George
Co-Director: Kishore Krishna
Executive Producers: Vaisakh Nair, Srida Donepudi
Costumes: Priyanka Srinivas
Choreography: JD Master
Action: Wing Chun Anji

హిట్ మెషిన్ అనిల్‌ రావిపూడి చేతుల మీదుగా చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘వెవెలా ఊహ‌లే చూపినా..’ సాంగ్ రిలీజ్ - అక్టోబ‌ర్ 9న సినిమా భారీ విడుద‌ల‌

అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబ‌ర్ 9న సినిమా రిలీజ్ అవుతుంది. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, క‌శ్య‌ప్‌, రాజారవీంద్ర‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

మేఘాల‌యా రాష్ట్రంలో పూర్తిగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకున్న తొలి ద‌క్షిణాది సినిమా ఇదే కావ‌టం విశేషం. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్, రీసెంట్‌గా రిలీజైన ‘ఆజా మేరీ జాని’ సాంగ్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘వెవెలా ఊహ‌లే చూపినా..’ను రిలీజ్ చేశారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ఈ పాట‌ను విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు.

‘వెవెలా ఊహ‌లే చూపినా..’ సాంగ్ నేప‌థ్యం విష‌యానికి వ‌స్తే..త‌మ‌కు కావాల్సిన ఓ అరుదైన బాక్స్ కోసం విల‌న్ గ్యాంగ్ వెతుకుతుంటుంది. అది హీరో, హీరోయిన్ ద‌గ్గ‌ర ఉంద‌ని వారు భావిస్తుంటారు. అదే స‌మ‌యంలో వాళ్లు విల‌న్స్ కంట‌ప‌డ‌తారు. మ‌రోవైపు హీరో చేతిలో గ‌న్ ఉంటుంది..అది ఊహించ‌ని రీతిలో పేలుతుంది. దీంతో హీరోహీరోయిన్‌ల‌పై గ్యాంగ్ రివ‌ర్స్ ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ నేప‌థ్యంలో రేట్రో స్టైల్లో ‘వెవెలా ఊహ‌లే చూపినా..’ సాంగ్ ప్లే అవుతుంటుంది.

ఎల‌క్ట్రానిక్ కిలి, ఆర్కాడో సంగీత సార‌థ్యంలో ఈ సాంగ్‌ను కిట్టు విస్సాప్ర‌గ‌డ రాయ‌గా..శ్రీ సాగ‌ర్ పాడారు. పాట‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించేలా డిఫ‌రెంట్ బ్యాక్ డ్రాప్‌, మ్యూజిక్‌తో ఆసాంతం ఆక‌ట్టుకుంటోంది. ఈ సంద‌ర్భంగా..

చిత్ర నిర్మాత‌ వేణు దోనేపూడి మాట్లాడుతూ ‘‘ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజైన మా బా బా బ్లాక్ షీప్ మూవీ టీజ‌ర్‌, అజా మేరీ జాని సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ‘వెవెలా ఊహ‌లే చూపినా..’ అనే సాంగ్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. డిఫ‌రెంట్ స్టైల్లో సాగే పాట ఇది. ఈ సాంగ్‌ను రిలీజ్ చేసిన మా అనిల్ రావిపూడిగారికి థాంక్స్‌. సినిమాను అక్టోబ‌ర్ 9న రిలీజ్ చేస్తున్నాం. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ ఫైన‌ల్ స్టేజ్‌లో ఉన్నాయి. మేఘాల‌యాలోనే పూర్తి సినిమాను కంప్లీట్ చేశాం. అక్క‌డే మొత్తం సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న తొలి సౌత్ మూవీ ఇదే. ముఖ్యంగా చిరపుంజి వంటి అద్భుత‌మైన లొకేష‌న్స్‌లోనూ చిత్రీక‌రించాం. ప‌క్కా ప్లానింగ్‌తో సినిమాను కంప్లీట్ చేశాం. మా డైరెక్ట‌ర్ గుణి, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు స‌హా ఎంటైర్ టీమ్‌ స‌హకారంతో ఇది సాధ్య‌మైంది’’ అన్నారు.

నటీనటులు :

టిను ఆనంద్, ఉపేంద్ర , జార్జ్ మరియన్, అక్షయ్, కార్తికేయ, అభినవ్, శుభలేఖ సుధాకర్, హర్ష, కిషోర్ కృష్ణ, విస్మయశ్రీ, మాళవి, సమృద్ధి, విష్ణు ఓయ్, క‌శ్య‌ప్‌, రాజా ర‌వీంద్ర‌, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, అనీష్ కురివిల్లా, కాదంబరి కిరణ్ తదితరులు

సాంకేతిక బృందం :

బ్యానర్ : చిత్రాలయం స్టూడియోస్
నిర్మాత : వేణు దోనేపూడి
సహ నిర్మాత: కొండల్ జిన్నా
దర్శకత్వం : గుణి మంచికంటి
క్రియేటివ్‌ ప్రొడ్యూస‌ర్‌: శ‌్వేత దోనేపూడి
మ్యూజిక్‌ : ఎల‌క్ట్రానిక్ కిలి, ఆర్కాడో
ఆర్ట్ : సాహి సురేష్
ఎడిటింగ్ : విజయ్ ముక్తవరపు
కెమెరామెన్ : అజయ్ అబ్రహం జార్జ్
కో డైెరెక్టర్ : కిషోర్ కృష్ణ‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వైశాఖ్ నాయర్, శ్రీద దోనేపూడి
కాస్ట్యూమ్స్ : ప్రియాంక శ్రీనివాస్‌
కొరియోగ్రఫీ : జెడి. మాస్టర్
యాక్షన్స్ : వింగ్ చున్ అంజి



 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved