pizza

"I Take Anti-Drug Advocacy as a Responsibility" – Actor Vijay Deverakonda
డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - హీరో విజయ్ దేవరకొండ

You are at idlebrain.com > news today >

26 June 2025
Hyderabad

Actor Vijay Deverakonda stated that he considers anti-drug advocacy a personal responsibility. He participated as a guest in an awareness event organized by the Telangana state government on Thursday, marking the International Day Against Drug Abuse and Illicit Trafficking. The event was also attended by Chief Minister Revanth Reddy and actor Ram Charan.

Speaking on the occasion, Vijay Deverakonda said, "I live in my own world and often don’t know much about what’s happening outside. While I was shooting in Visakhapatnam, a police officer asked me to give a video (statement) against drugs. I took part in that campaign. Later, I came to know that there's actually an International Day against Drugs, which surprised me. When I asked a few police officers, they explained more about it. After learning the details, I felt a strong need to create awareness among people about this addiction. That’s why I’m now taking up anti-drug campaigning as a personal responsibility."

"You don’t need a war to destroy a country getting its youth addicted to drugs is enough. Our country has a huge youth population, and that’s why some forces are trying to push drugs onto our youth. Once someone becomes addicted, it's very hard to recover. If any of your friends are addicted to drugs, stay away from them. In life, what truly matters is health, money, and respect. There’s no point in doing things that can’t give you these. We should live in a way that brings pride to our parents." He emphasized the importance of staying drug-free and promoting awareness to protect the nation’s future.

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - హీరో విజయ్ దేవరకొండ

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటానని అన్నారు హీరో విజయ్ దేవరకొండ. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హీరో రామ్ చరణ్ తో పాటు విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - నేను నాదైన ప్రపంచంలో బతుకుతుంటా. బయట ఏం జరుగుతుందో పెద్దగా తెలియదు. విశాఖలో నేను షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక పోలీస్ అధికారి డ్రగ్స్ కు వ్యతిరేకంగా బైట్ ఇవ్వమని చెప్పారు. ఆ క్యాంపెయిన్ లో పాల్గొన్నాను. ఆ తర్వాత డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ డే ఉందని తెలిసి ఆశ్చర్యపోయా. కొందరు పోలీస్ అధికారులను అడిగితే వివరాలు చెప్పారు. ఆ వివరాలు తెలుసుకున్న ఈ వ్యసనం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి అనిపించింది. అందుకే డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని ఒక బాధ్యతగా తీసుకుంటున్నా. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అక్కడి యువతకు మత్తు పదార్థాలు అలవాటు చేస్తే చాలు. మన దేశంలో యువశక్తి ఎక్కువ. అందుకే కొన్ని దేశాలు మన యువతకు మత్తుపదార్థాలు అలవాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. డ్రగ్స్ కు అలవాటు పడితే కోలుకోవడం కష్టం. మీ స్నేహితులు ఎవరికైనా మత్తు అలవాటు ఉంటే వారికి దూరంగా ఉండండి. మనకు జీవితంలో ఆరోగ్యం, డబ్బు, గౌరవం కావాలి. ఈ మూడు ఇవ్వలేని పనులు చేసి ఉపయోగం లేదు. మీ తల్లిదండ్రులకు గౌరవం తెచ్చేలా ప్రవర్తించాలి. అన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved