pizza

"Back then, the first thing I did after waking up was open Idlebrain.com" – Vijay Deverakonda
అప్పట్లో లేచిన వెంటనే idlebrain.com ఓపెన్ చేసి చూసేవాడిని - విజయ్ దేవరకొండ.

You are at idlebrain.com > news today >

29 June 2025
Hyderabad

Vijay Deverakonda and Devi Sri Prasad attended the launch event of Dil Raju Dreams as special guests. Speaking at the event, Vijay fondly reminisced about his early days.

He said, “Fourteen years ago, my daily routine started with waking up and immediately opening Idlebrain.com to check if there were any casting calls. Back then, we didn’t have social media or multiple entertainment channels—Idlebrain.com was the only source for aspiring actors.”

He recalled how one day he saw a casting call for director Sekhar Kammula’s Life is Beautiful, which mentioned a requirement for three male and three female leads. He applied and was later selected among 11 candidates out of 60,000 applicants, along with fellow actor Naveen Polishetty.

Vijay expressed that Dil Raju Dreams would inspire millions of aspiring actors. “Even if just one person’s dream is fulfilled through this platform, it means Dil Raju sir has achieved what he set out to do,” he said.

He added, “Five years from now, someone sitting in this audience may walk up to this very stage and say, ‘Dil Raju sir launched Dil Raju Dreams, Vijay Deverakonda inaugurated the website, I applied there, and today I’m here.’ I hope to hear that speech.”

Dil Raju is soon set to produce Rowdy Janardhan, a film starring Vijay Deverakonda, with pre-production already underway. The project is expected to launch in September.

అప్పట్లో లేచిన వెంటనే idlebrain.com ఓపెన్ చేసి చూసేవాడిని - విజయ్ దేవరకొండ.

దిల్ రాజు డ్రీమ్స్ వెబ్సైట్ ప్రారంభ కార్యక్రమానికి ప్రత్యేక అతిధులుగా విజయ్ దేవరకొండ, దేవిశ్రీ ప్రసాద్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో తన పాత జ్ఞాపకాలను మళ్ళీ నెమరువేసుకున్నారు విజయ్ దేవర కొండ. పద్నాలుగేళ్ల క్రితం రోజూ లేవడం, లేచిన వెంటనే idlebrain.com ఓపెన్ చేయడం, అందులో ఏదైనా కాస్టింగ్ కాల్ ఉందా అని చూడటమే జరిగేదన్నారు. ఆ టైంలో ఇంత సోషల్ మీడియా , ఇన్ని ఛానల్స్ లాంటివి లేవంటూ సినిమా వాళ్లకు idlebrain.com ఒక్కటే ఉండేదన్నారు. ఒకరోజు అలా ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే శేఖర్ కమ్ముల గారి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకు ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు కావాలనే కాస్టింగ్ కాల్ చూశానని, అలా ఆ సినిమాకు అప్లై చేశానని, వచ్చిన 60,000 అప్లికేషనన్లలో 11 మందిని తీసుకున్నారని, ఆ పదకొండు మందిలో తనతో పాటూ నవీన్ పోలిశెట్టి కూడా ఉన్నారన్నారు.

ఈ దిల్ రాజు డ్రీమ్స్ అన్నది లక్షలాది మందికి ఎంతో హాప్ ఇస్తుందన్నారు. ఇందులో ఒక్కరి డ్రీమ్ సాకారం అయినా దిల్ రాజు గారు ఆయన అనుకున్నది అచీవ్ అయినట్టే అన్నారు. మరో అయిదేళ్ల తరువాత క్రింద కూర్చున్న మీలో ఒకరు స్టేజ్ మీదకు వచ్చి, "ఆరోజు దిల్ రాజు గారు దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్రాజెక్టును లాంచ్ చేశారని, ఆ వెబ్సైట్ ను విజయ దేవరకొండ వచ్చి ప్రారంభించాడని, దానిని చూసే, అప్లై చేసే ఈరోజు ఇక్కడున్నాం" అంటూ స్పీచ్ చెప్పడం వినాలనివుందన్నారు.

దిల్ రాజు త్వరలో రౌడీ జనార్దన్ సినిమాని విజయ్ దేవరకొండ తో తీయబోతున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పని జరుగుతుంది. సెప్టెంబర్ కి లాంచ్ కి రెడీ అవుతుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved