VISA ~ VINTARA SARADAGA TO ARRIVE IN THEATRES ON JANUARY 1, 2027!
అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా ఉద్భవ్ రఘు దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్.
The New Year is set to begin on an entertaining note as VISA ~ Vintara Saradaga gears up for a grand worldwide theatrical release on January 1, 2027. Starring Ashok Galla and Sri Gouri Priya in the lead roles, the film promises a refreshing blend of youthful romance, friendship, fun and entertainment, making it an exciting addition to the New Year weekend celebrations.
Directed by Udbhav Raghu, VISA ~ Vintara Saradaga is set against the backdrop of Telugu students navigating life in the United States. Exploring the experiences of youngsters chasing their dreams away from home, the film brings together friendship, love, unexpected situations and the many adventures of student life abroad.
The film has already generated good anticipation through its promotional campaign. Both teasers have received encouraging responses, offering glimpses into the film's youthful premise, entertaining moments and the chemistry between the lead pair.
The musical promotions have further added to the buzz surrounding the film. The two songs released so far, 'Anaga Anaga America' and 'Chingari', have showcased different shades of the film. While 'Anaga Anaga America', sung by Sanjith Hegde, captures the freshness and romance of the lead pair's journey in America, 'Chingari', rendered by Sid Sriram and Lipsika, brings out its soulful romantic side. Music composer Vijai Bulganin has added another exciting dimension to the film with these melodies.
Ashok Galla and Sri Gouri Priya headline the film, with Rahul Vijay, Shivathmika Rajasekhar, Satya, Viva Harsha, Gundu Sudarshan and others playing important roles.
Produced by Naga Vamsi S under Sithara Entertainments and Sai Soujanya under Fortune Four Cinemas, VISA is all set to welcome audiences into 2027 with its youthful and entertaining theatrical experience.
VISA GRAND WORLDWIDE RELEASE ON JANUARY 1, 2027!
అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా ఉద్భవ్ రఘు దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్.
నూతన సంవత్సరానికి వినోదభరితమైన ఆహ్వానం పలుకుతూ యంగ్ హీరో అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘VISA – వింటారా సరదాగా’ ప్రపంచవ్యాప్తంగా జనవరి 1, 2027న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ప్రేమ, స్నేహం, సరదా, యువత జీవితంలోని అనుభవాల సమ్మేళనంగా తెరకెక్కిన ఈ చిత్రం న్యూ ఇయర్ సందర్భంగా ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించనుంది.
ఉద్భవ్ రఘు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అమెరికా నేపథ్యంలో సాగుతుంది. ఉన్నతమైన కలలను సాకారం చేసుకోవాలనే ఆశయంతో స్వదేశాన్ని విడిచి అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థుల జీవితాల చుట్టూ కథనం సాగుతుంది. విదేశాల్లో విద్యార్థుల జీవనశైలి, స్నేహాలు, ప్రేమలు, అనుకోని సంఘటనలు, ఎదురయ్యే ఆసక్తికరమైన పరిస్థితులను వినోదాత్మకంగా ఈ సినిమాలో ఆవిష్కరించారు.
ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు సినిమాపై మంచి ఆసక్తిని పెంచాయి. యూత్‌ఫుల్ కథాంశం, వినోదభరితమైన సన్నివేశాలు, అశోక్ గల్లా – శ్రీ గౌరీ ప్రియ జంట మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటివరకు విడుదలైన ‘అనగా అనగా అమెరికా’, ‘చింగారి’ పాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సంజిత్ హెగ్డే ఆలపించిన ‘అనగా అనగా అమెరికా’ పాట అమెరికాలో హీరోహీరోయిన్ల ప్రయాణంలోని ప్రేమ, కొత్తదనం, ఆహ్లాదకరమైన భావాలను ఆవిష్కరిస్తే, సిద్ శ్రీరామ్, లిప్సిక ఆలపించిన ‘చింగారి’ పాట ప్రేమలోని మధురమైన అనుభూతులను పలికించింది. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి చక్కటి సంగీతాన్ని అందించారు.
ఈ చిత్రంలో అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ ప్రధాన పాత్రల్లో నటించగా, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, సత్య, వివా హర్ష, గుండు సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఎస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ లవ్, ఫ్రెండ్షిప్, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో రూపొందిన ‘VISA – వింటారా సరదాగా’ 2027 నూతన సంవత్సరాన్ని థియేటర్లలో మరింత సందడిగా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
‘VISA – వింటారా సరదాగా’ గ్రాండ్ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ – జనవరి 1, 2027!