pizza

VishnuVinyasam Funtastic Blockbuster celebrations
‘విష్ణు విన్యాసం’ను లీక్ చేసి బ్లాక్‌ మెయిల్ చేశారు. లీక్ ని అరికట్టి థియేటర్స్ లో రిలీజ్ చేశాం. సినిమాకి ఆడియన్స్ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది: ప్రెస్ మీట్ లో హీరో శ్రీవిష్ణు

You are at idlebrain.com > news today >

28 February 2026
Hyderabad

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ 'విష్ణు విన్యాసం'. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ... అందరికి నమస్కారం. విష్ణు విన్యాసం నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేశాం. నేనెప్పుడూ కూడా ఫ్యామిలీస్ యూత్ ని నమ్ముకునే సినిమాలు చేస్తాను. వాళ్ల రెస్పాన్స్ ఫస్ట్ షో, సెకండ్ షో నుంచి చాలా బాగా కనిపించింది. సినిమా చూసి మమ్మల్ని అప్రిషియేట్ చేసిన అందరికీ కూడా చాలా థాంక్స్. నవ్వించాలనే ప్రయత్నంతో చేసిన సినిమా ఇది. ఇంకా చూడని వారు తప్పకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ యూత్ కి చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్ కి బాగా నచ్చింది. ముఖ్యంగా టౌన్స్ నుంచి మాకు చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. మంచి ఫుల్స్ చూస్తున్నాం. అది ఈ వీక్ అంత కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. యుఎస్ ఆడియన్స్ అందరికీ థాంక్యూ. నా కెరీర్ లోనే మంచి నెంబర్ ఇచ్చారు. మా సినిమాకి పనిచేస్తున్న టెక్నీషియన్స్ అందరికీ థాంక్యూ. డైరెక్టర్ మారుతికి థాంక్యూ.

ఈ సినిమా ఫాస్ట్ గా రిలీజ్ చేయాలనే నిర్ణయానికి రావడానికి కారణం.. ఎలా జరిగిందో తెలియదు గానీ మా సినిమా అంతా డిసెంబర్ లో లీక్ అయిపోయింది. లీక్ చేసి మా నిర్మాతని బ్లాక్ మెయిల్ చేశారు. విడుదల ముందురోజు వరకూ ఇదంతా జరిగింది. టీమ్‌ అంతా సహకారం అందించారు. ఇరవై రోజుల పనిని ఏడు రోజుల్లో రాత్రి, పగలూ విరామం లేకుండా చేయాల్సి వచ్చింది. టీమ్‌ అంతా సహకారం అందించారు. అలా చేస్తేనే ఈ టైమ్‌కు రాగలిగాం. చెన్నై నుంచి ఈ సినిమాను లీక్‌ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశాం. దీనిపై కేసు నడుస్తోంది. ఆ విషయంలో నిర్మాతలు చాలా బలంగా నిలబడ్డారు. లీక్ ని బయటకు రాకుండా అరికట్టి సినిమాని రిలీజ్ చేయగలిగాం. ఇంకా సినిమా చూడని వారు చూడండి. ఈ సినిమాని ఇంకా బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. థియేటర్లో ఆడియన్స్ తో కలిసి సినిమా చూశాను. ఆడియన్స్ రియాక్షన్ అదిరిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. బుక్ మై షో లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం యూత్ కనెక్ట్ అవుతున్నారు. సెకండ్ హాఫ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఖచ్చితంగా సినిమా థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.

మ్యూజిక్ డైరెక్టర్ రధన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నిర్మాతలు హీరో చాలా సపోర్ట్ చేశారు. అలాగే ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేశారు. అందరూ ఫోన్ చేసి సాంగ్స్ బాగున్నాయని చెప్పారు. అది నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అందరూ థియేటర్ కి వెళ్లి మళ్లీ మళ్లీ చూసి ఈ సినిమాని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను

ప్రొడ్యూసర్ సుమంత్ నాయుడు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సినిమా నిన్న రిలీజ్ అయింది, చూసిన అందరు కూడా సినిమా చాలా బాగుందని నాకు పర్సనల్ మెసేజ్ చేస్తున్నారు. నిన్న మాట్నీ నుంచి గ్రోత్ ఇంకా పెరిగింది. యూఎస్ నుంచి కేరళ నుంచి కంటిన్యూగా మెసేజ్లు వస్తున్నాయి. ఇది ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. అందరూ కూడా హ్యాపీగా నవ్వుకోడానికి మీ ఫ్యామిలీ తో రండి.

ప్రొడ్యూసర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. విష్ణు విన్యాసం కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. ప్రతి షో కి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. బుక్ మై షో లో సినిమా ట్రెండింగ్ లో ఉంది. కంపల్సరిగా ఇది హిట్ సినిమా. మీ అందరి సపోర్ట్ కావాలి. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. వరుసగా ఈ సినిమాకు సంబంధించిన వీడియోలను నాకు పంపారు. ఆ మెసేజ్ లు చూడగానే నా భవిష్యత్‌ కళ్ల ముందు కనపడింది. మా యూనిట్‌ నుంచే తెలియకుండా సన్నివేశాలు వెళ్లిపోయాయి. మాకు సినిమా క్లిప్‌లను పంపిన నెంబర్‌ను ట్రేస్‌ చేశాం. ఆ తర్వాత ఛాంబర్‌లో ఫిర్యాదు చేశాం. రోజూ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు పంపడం మొదలుపెట్టారు. చాలా డిస్టర్బ్ అయ్యాం. పరిస్థితి అదుపు తప్పడంతోనే మిగిలిన షూటింగ్‌ వేగంగా పూర్తి చేసి ఈ సినిమాను తీసుకురావాల్సి వచ్చింది. అంతేకానీ, ‘మృత్యుంజయ్‌’ మూవీకి పోటీగా దీన్ని రిలీజ్ చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. ఆ చిత్ర నిర్మాత పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved