కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు హిలేరియస్ జాయ్‌రైడ్ 'విష్ణు విన్యాసం'తో అలరించబోతున్నారు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇపటికే ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ నయన్ సారిక విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ?
చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. నా క్యారెక్టర్ కి చాలా షేడ్స్ వుంటాయి. కొంచెం ఫీమేల్ డామినేటింగ్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ లో అబ్బాయిలకి కాస్త చిరాకు కలిగిస్తుంది. కానీ దానికి కారణం ఏమిటో సెకండ్ హాఫ్ లో రివీల్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్ ని అందరూ అర్ధం చేసుకొని, ఇష్టపడతారు.
మీ క్యారెక్టర్ టీజర్ లో కాస్త బోల్డ్ గా కనిపించింది కదా.. ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
-నాకు ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు చాలా నచ్చింది. టీజర్ లో చూసిన కొన్ని సీన్స్ క్యారెక్టర్ కోసం కథ కోసం చాలా ఇంపార్టెంట్. ఇందులో మనీషా అనే క్యారెక్టర్ లో కనిపిస్తాను. తను జీవితంలో చాలా బాధలు ఎదుర్కొన్న అమ్మాయి. ఒక పాయింట్ వచ్చిన తర్వాత జీవితాన్ని హాయిగా బ్రతకాలనుకునే అమ్మాయి. నేను కాలేజీలో ఫ్యాకల్టీగా కనిపిస్తాను. విష్ణు గారి క్యారెక్టర్ కూడా అదే. ఇద్దరు లెక్చరర్స్ మధ్య జరిగే ప్రేమ కథ. స్టూడెంట్స్, యూత్ చాలా బాగా కనెక్ట్ అవుతారు.
మీ మూవీ జర్నీ గురించి ?
- మాది మహారాష్ట్ర. నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. తెలుగులోనే నా ఫస్ట్ సినిమా చేశాను. అక్కడి నుంచి ఇది ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. భవిష్యత్తులో కూడా తెలుగు సినిమాలకి నా మొదటి ప్రాధాన్యత. గంగం గణేశా, ఆయ్, క లాంటి వరుస విజయాలు రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. విష్ణు విన్యాసం కూడా నాకు మరింత మంచి పేరు తీసుకొస్తుందని భావిస్తున్నాను. తెలుగు ఆడియన్స్ ఇస్తున్న సపోర్టుకి కృతజ్ఞతలు. మంచి కథా బలం, పాత్ర బలం ఉన్న సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనుంది. అలాగే మంచి పెర్ఫార్మన్స్, కొత్తదనం వున్న సినిమాలు చేయాలని ఉంది.
శ్రీ విష్ణు గారితో పనిచేయడం ఎలా అనిపించింది?
ఆయనతో వర్క్ చేయడం వెరీ ఫన్ జర్నీ. ఆయన చాలా జోవియల్ పర్సన్. ఆయన సరదాగా మాట్లాడుతుంటే వినడానికి చాలా హాయిగా ఉంటుంది. చాలా మాటలు గుర్తుండిపోతాయి. ఆయనతో కలిసి పనిచేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్.
డైరెక్టర్ గురించి?
-డైరెక్టర్ మారుతి గారు చాలా టాలెంటెడ్. ఆయన కథ చెప్పినప్పుడే చాలా ఎంజాయ్ చేశాను. తను చాలా క్లారిటీ ఉన్న ఫిలిం మేకర్. నా క్యారెక్టర్ కోసం చాలా గైడ్ చేశారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది
నిర్మాతల గురించి?
నిర్మాతలు చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు. ప్రతి విషయంలో సపోర్ట్ చేశారు. సుమంత్ గారు సినిమాకు కావలసిన ప్రతిదీ సమకూర్చారు.
మీ ఫేవరేట్ సాంగ్?
-రధన్ గారు అద్భుతమైన పాటలు ఇచ్చారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది ఇందులో బ్రేకప్ సాంగ్ నాకు చాలా ఇష్టం. అలాగే మొదలే మొదలే పాట నా ఫేవరెట్.
మీరు నటి కావాలని అనుకున్నారా?
-లేదండి. నేను లాయర్ కావాలనుకున్నాను. కానీ నాకు సినిమాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండేది. ఆ ఇష్టమే నా కెరియర్ గా మారింది. నటన విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను.
కామెడీ చేయడం కష్టమే కదా?
-ప్రేక్షకులను నవ్వించడం నిజంగా కష్టం. విష్ణు గారికి ఆ కామెడీ టైమింగ్ చాలా నేచురల్ గా వచ్చేస్తుంది. ఆ విషయంలో ఆయన వెరీ టాలెంటెడ్. అలాగే ఆయన స్పాట్లో ఇంప్రవైజ్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. ఆయన నేచురల్ పర్ఫార్మెర్ కావడంతో మా పెర్ఫార్మన్స్ కూడా బెటర్ అయ్యింది.
ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం ఎలా అనిపించింది?
-చిన్నప్పటి నుంచి టీవీలో ఫిలింఫేర్ అవార్డు అని చూస్తూ పెరిగాను. అదే వేదిక మీద నేను అవార్డు అందుకోవడమనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది. అదొక కల నెరవేరిన సందర్భం.
మీ డ్రీమ్ ప్రాజెక్టు?
-నాకు రాజమౌళి గారి సినిమాలో పనిచేయాలని ఉంది. ఆయన సినిమాలో చేయడం నా డ్రీం ప్రాజెక్టుగా భావిస్తున్నాను.
మీ నుంచి రాబోతున్న సినిమాలు?
-ప్రస్తుతం రాకాస సినిమా చేస్తున్నాను. అది ఫాంటసీ కామెడీ. అలాగే గోల్డెన్ స్టార్ గణేష్ తో ఒక కన్నడ సినిమా చేస్తున్నాను.