The Wedding Song" From Vishwanth & Sons Is Out Now ~ Suriya & Mamitha Baiju Light Up the Screens
'విశ్వనాథ్ & సన్స్' చిత్రం నుంచి రెండవ గీతం 'ది వెడ్డింగ్ సాంగ్' విడుదల
After the massive success of the chartbusting first single Neno Butterfly, the Vishwanth & Sons team is back with another treat for fans "The Wedding Song" is out now and it's already being hailed as the perfect celebration anthem of the season.
A high-energy, festive number, the song sees Suriya and Mamitha Baiju light up the screen with their infectious dance moves, capturing the joy and warmth of a big fat family wedding. Adding a special touch, Suriya himself has lent his voice to the track, making it an even more personal and heartfelt musical moment.
The music is composed by G. V. Prakash Kumar, with lyrics penned by Ramajogayya Sastry giving the song its distinct festive and celebratory flavour.
With two back-to-back chartbusters Neno Butterfly and now The Wedding Song, expectations for Vishwanth & Sons continue to soar.
Directed by Venky Atluri and produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments & Fortune Four Cinemas. Presented by Srikara Studios, the family entertainer is all set for a grand worldwide theatrical release this Independence Day weekend on August 14th.
'విశ్వనాథ్ & సన్స్' చిత్రం నుంచి రెండవ గీతం 'ది వెడ్డింగ్ సాంగ్' విడుదల
తమిళ అగ్ర కథానాయుడు సూర్య ప్రధాన పాత్రలో ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తోన్న చిత్రం 'విశ్వనాథ్ & సన్స్'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన తొలి గీతం 'నేనో బటర్‌ఫ్లై' విశేషంగా ఆకట్టుకుంది. ఆ ఉత్సాహంతో 'విశ్వనాథ్ & సన్స్' చిత్ర బృందం, 'ది వెడ్డింగ్ సాంగ్' రూపంలో అభిమానులకు మరో కానుకను తీసుకొచ్చింది. ఈ రెండవ గీతం విడుదలైన తక్షణమే అందరినీ అలరిస్తూ, అసలుసిసలైన వేడుకల గీతంగా ప్రశంసలు అందుకుంటోంది.
ఉత్సాహభరితమైన, పండుగ వాతావరణాన్ని తలపించే ఈ పాటలో.. సూర్య, మమితా బైజు తమ అద్భుతమైన నృత్యంతో తెరపై వెలుగులు నింపుతూ, ఒక ఘనమైన కుటుంబ వివాహంలోని ఆనందాన్ని, ఆత్మీయతను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ పాటను సూర్య స్వయంగా ఆలపించడం మరింత ప్రత్యేకంగా, హృదయానికి హత్తుకునే సంగీత అనుభూతిగా మార్చింది.
ఈ గీతానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ అద్భుతమైన సంగీత సాహిత్య కలయిక, పాటకు సంబరాల అనుభూతిని జోడించింది.
కేవలం ప్రకటనతోనే 'విశ్వనాథ్ & సన్స్' సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పోస్టర్లు, టీజర్ ఆకట్టుకోవడంతో పాటు.. 'నేనో బటర్‌ఫ్లై', 'ది వెడ్డింగ్ సాంగ్' వంటి వరుస చార్ట్‌బస్టర్లతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి.
ఈ కుటుంబ కథా చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఆగస్టు 14, 2026 న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది.