pizza

Vrushakarma 1st Single on Nov 7
నాగచైతన్య, కార్తీక్ దండు, ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ ‘వృషకర్మ’ ఫస్ట్ సింగిల్ స్వాగ్ ఆఫ్ అర్జున్ నవంబర్ 7న రిలీజ్

You are at idlebrain.com > news today >

04 Novembar 2026
Hyderabad

యువ సామ్రాట్ నాగచైతన్య ప్రతిష్టాత్మక మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది.

తాజాగా ‘వృషకర్మ’ మ్యూజికల్ జర్నీ మొదలుపెడుతున్నారు మేకర్స్. ఫస్ట్ సింగిల్ స్వాగ్ ఆఫ్ అర్జున్ నవంబర్ 7న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆసక్తిని పెంచుతోంది.

నాగచైతన్య సైడ్ ప్రొఫైల్‌లో బ్లాక్ గాగుల్స్, ఇయర్‌ఫోన్స్‌తో చాలా ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. భుజంపై గాయం, డార్క్ బ్యాక్‌డ్రాప్ పోస్టర్‌కు మరింత రఫ్ అండ్ రగ్గడ్ అప్పీల్‌ను తీసుకొచ్చాయి. అర్జున్ పాత్రలోని స్వాగ్, అటిట్యూడ్‌ను ప్రతిబింబించేలా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. దీంతో ఫస్ట్ సింగిల్‌పై అంచనాలు పెరుగుతున్నాయి.

నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఆయన కెరీర్‌లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను కూడా సాధించింది. ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ‘వృషకర్మ’పై పాజిటివ్ బజ్ నెలకొంది.

ఈ సినిమాలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.

రగుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్, నవీన్ నూలి ఎడిటింగ్.

నటీనటులు: నాగచైతన్య, మీనాక్షి చౌదరి, స్పర్శ్ శ్రీవాస్తవ

సాంకేతిక బృందం
దర్శకత్వం: కార్తీక్ దండు
నిర్మాతలు: బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్
సమర్పణ: బాపినీడు
సంగీతం: అజనీష్ బి. లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ: రగుల్ డి హెరియన్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరసింహ చారి చెన్నోజు

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved