Brahmastra’s Kesariya team reunite for Hrithik & Kiara song in Ayan Mukerji’s War 2!
అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ‘వార్ 2’లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం రంగంలోకి బ్రహ్మాస్త్ర ‘కేసరియా’ టీం
Internet is abuzz with the news that Ayan Mukerji is getting his blockbuster Kesariya music team back for a song picturised on Hrithik Roshan & Kiara Advani in War 2! So, Ayan, Pritam, Arijit Singh & Amitabh Bhattacharya are reuniting again and the internet can’t keep calm.
When checked with producers, Yash Raj Films, they confirmed this information without divulging the date of the launch.
A source says, “It is a beautiful track that shows the romance between Hrithik and Kiara’s character in War 2. The track will drop this week and will be the first song of War 2 to drop for people to watch.”
War 2, the theatrical action spectacle, is set to release in theatres on August 14th worldwide in Hindi, Telugu & Tamil. War 2 trailer is getting blockbuster response on the internet! It is a true blue pan India film as it brings two of the most iconic actors of our country, Hrithik and NTR locking horns in a deadly, bloody battle.
అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ‘వార్ 2’లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం రంగంలోకి బ్రహ్మాస్త్ర ‘కేసరియా’ టీం
అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోని కేసరియా అనే పాట దేశాన్ని ఊపేసింది. మరోసారి అయాన్ తన టీంను ‘వార్ 2’ కోసం రంగంలోకి దించారు. అయాన్ ప్రస్తుతం ‘వార్ 2’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇండియన్ ఐకానిక్ స్టార్లైన హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ కాంబోలో ‘వార్ 2’ సినిమాని యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ ఎత్తున నిర్మించింది. ఆగస్ట్ 14న రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో సునామీని సృష్టిస్తోంది.
ఇక తాజాగా ఈ మూవీలోని ఓ డ్యూయెట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. హృతిక్, కియారా మీద చిత్రీకరించే ఈ పాట కోసం తన బ్లాక్ బస్టర్ కేసరియా సంగీత బృందాన్ని రంగంలోకి దించారు. ‘వార్ 2’లోని ఈ యుగళ గీతం కోసం ప్రీతమ్, అరిజిత్ సింగ్, అమితాబ్ భట్టాచార్య మళ్ళీ ఒకే చోటకు చేరారు. త్వరలోనే ఈ పాటను సోషల్ మీడియాలో రిలీజ్ చేసి మరింత హైప్ పెంచాలని చిత్రయూనిట్ భావిస్తోంది. ‘వార్ 2’లో హృతిక్, కియారా పాత్ర మధ్య ప్రేమను చూపించే అందమైన ట్రాక్‌గా ఈ పాటను కంపోజ్ చేస్తున్నారట. ఇక ఇదే ‘వార్ 2’ నుంచి వచ్చే మొదటి పాట అవుతుందన్న సంగతి తెలిసిందే. థియేట్రికల్ యాక్షన్ ప్యాక్డ్ ‘వార్ 2’ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషలలో థియేటర్లలో విడుదల కానుంది.