pizza

Dil Raju Presents, Devi Sri Prasad, Venu Yeldandi, Shirish, Sri Venkateswara Creations' Yellamma First Look Presenting DSP As PARSHI Is A Blockbuster Material
దిల్ రాజు సమర్పణలో, 'రాక్‌స్టార్' దేవి శ్రీ ప్రసాద్, వేణు యెల్దండి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 'ఎల్లమ్మ' నుంచి పర్షిగా దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్ రిలీజ్

You are at idlebrain.com > news today >

02 August 2026
Hyderabad

After delivering the critically acclaimed and commercially blockbuster hit Balagam, National Award-winning filmmaker Venu Yeldandi is presently working on his most ambitious project, Yellamma. Presented by renowned producer Dil Raju and produced by Shirish under the esteemed Sri Venkateswara Creations banner, the film blends strong emotions with a deeply rooted cultural narrative. Adding to the excitement is the acting debut of Rockstar Devi Sri Prasad, who takes on the lead role while also composing the music, making Yellamma a landmark project in his career.

In a move that has taken the entire film industry by surprise, the makers of Yellamma today unveiled the first look of Devi Sri Prasad as PARSHI. The poster, released on the occasion of DSP's birthday, has already set the internet ablaze with excitement and admiration.

What makes this first look truly stand apart is its refreshing simplicity. At a time when Indian cinema has become accustomed to larger-than-life mass posters and over-the-top visual spectacles, the Yellamma team has chosen a different path, and it pays off brilliantly. DSP stands in a natural, unforced pose, holding a crown and dressed in simple everyday clothes, radiating a warmth and groundedness that are rarely seen in contemporary first-look posters.

The innocence in Devi Sri Prasad's eyes is what makes PARSHI instantly lovable. The character exudes a raw, relatable quality—the kind of character that audiences across all five languages will find themselves rooting for. DSP has not merely "appeared" in the film; he has inhabited the role with a naturalness that is extraordinary for a first-time actor, a testament to the vision of director Venu Yeldandi.

DSP is not just playing the lead in the film; he is also composing the music.

Venu has treated this film as his dream project, nurturing it for years with passion and conviction. That relentless commitment to delivering the very best to the audience speaks volumes about his belief in this story. After creating magic with Balagam, Venu is all set to do it once again.

Ever since its announcement and the title glimpse, Yellamma has been building extraordinary anticipation, and this first look only amplifies that excitement even further.

The film is slated for a pan-India release in Telugu, Tamil, Hindi, Malayalam, and Kannada.

Cast: Devi Sri Prasad

Technical Crew:
Presents: Dil Raju
Producer: Shirish
Writer, Director: Balagam fame Venu Yeldandi
Banner: Sri Venkateswara Creations
Music: Devi Sri Prasad

దిల్ రాజు సమర్పణలో, 'రాక్‌స్టార్' దేవి శ్రీ ప్రసాద్, వేణు యెల్దండి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 'ఎల్లమ్మ' నుంచి పర్షిగా దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్ రిలీజ్

విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని అందుకున్న 'బలగం' చిత్రం తర్వాత, జాతీయ అవార్డు గ్రహీత వేణు యెల్దండి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ఎల్లమ్మ' సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం, బలమైన భావోద్వేగాలను, సాంస్కృతిక నేపథ్యాన్ని మిళితం చేస్తూ సాగుతుంది. 'రాక్‌స్టార్' దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించడంతో పాటు హీరోగా పరిచయమౌతున్నారు. ఇది DSP కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుంది.

అందరినీ సర్ప్రైజ్ చేస్తూ 'ఎల్లమ్మ' చిత్ర బృందం ఈ రోజు 'పర్షి'గా దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. DSP పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్, ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఈ ఫస్ట్ లుక్ ప్రత్యేకత సింప్లీసిటీ. ఈ మధ్యకాలంలో భారీ మాస్ పోస్టర్లు, ఓవర్ ది టాప్ ప్రెజెంటేషన్లు ఎక్కువగా కనిపిస్తున్న సమయంలో... 'ఎల్లమ్మ' టీమ్ మాత్రం పూర్తిగా భిన్నంగా ప్రజెంట్ చేసింది. సింపుల్ డ్రెస్ లో, చేతిలో కిరీటాన్ని పట్టుకుని ఎంతో సహజంగా నిలబడ్డ డీఎస్పీ లుక్‌లో అమాయకత్వం, నిజాయితీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే ఈ పోస్టర్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది.

డీఎస్పీ కళ్లలో కనిపించే అమాయకత్వం 'పర్షి' పాత్రను ప్రేక్షకులకు వెంటనే దగ్గర చేస్తోంది. అన్ని భాషల ప్రేక్షకులు ఈ పాత్రతో కనెక్ట్ అయ్యేలా ఉండబోతోందనే సంకేతాలు ఫస్ట్ లుక్‌లో కనిపిస్తున్నాయి. తొలి సినిమానే అయినప్పటికీ, డీఎస్పీ ఈ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిన తీరు దర్శకుడు వేణు ఎల్దండి విజన్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ చిత్రంలో డీఎస్పీ కేవలం హీరోగానే కాకుండా సంగీత దర్శకుడిగానూ తనదైన ముద్ర వేయనున్నారు. ఎన్నో సంవత్సరాలుగా తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా 'ఎల్లమ్మ'ను మలిచిన వేణు, 'బలగం' తర్వాత మరోసారి ప్రేక్షకులను మనసులని తాకే కథతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

అనౌన్స్మెంట్, టైటిల్ గ్లింప్స్‌తోనే భారీ అంచనాలు నెలకొల్పిన 'ఎల్లమ్మ' పై ఈ ఫస్ట్ లుక్ మరింత ఆసక్తిని పెంచింది.

తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

నటీనటులు: దేవి శ్రీ ప్రసాద్

సాంకేతిక బృందం:
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత: శిరీష్
రచన, దర్శకత్వం: 'బలగం' ఫేమ్ వేణు యెల్దండి
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved