pizza
Balakrishnudu music launch
`బాలకృష్ణుడు` ఆడియో విడుదల 
You are at idlebrain.com > News > Functions
Follow Us

10 November 2017
Hyderabad

సరస్‌చంద్రిక విజనరీ మోషన్‌ పిక్చర్స్‌, మాయా బజార్‌ మూవీస్‌ సంయుక్తంగా నారా రోహిత్‌-రెజీనా జంటగా డెబ్యూ డైరెక్టర్‌ పవన్‌ మల్లెల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'బాలక ష్ణుడు'. బి.మహేంద్రబాబు, ముసునూను వంశీ, సరస్‌చంద్రిక విజనరీ మోషన్‌ పిక్చర్స్‌ శ్రీ వినోద్‌ నందమూరి, మాయా బజార్‌ మూవీస్‌ సినిమా నిర్మాతలు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. దిల్‌రాజు ట్రైలర్‌ను విడుదల చేశారు. బిగ్‌ సీడీని సాయిధరమ్‌ తేజ్‌, సమంత విడుదల చేశారు. ఆడియో సీడీలను సమంత విడుదల చేయగా, తొలి సీడీని సాయిధరమ్‌ తేజ్‌ అందుకున్నారు.

సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ - ''సాంగ్స్‌ విన్నాను. మణిశర్మగారు అద్భుతమైన సంగీతం అందించారు. మహేంద్రగారు నిర్మాతగా చేసిన తొలి సినిమా ఇది. యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

సమంత మాట్లాడుతూ - ''మహేంద్రగారు తొలిసారి నిర్మాతగా చేస్తోన్న సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి. పవన్‌ మల్లెల దర్శకత్వంలో వస్తోన్న సినిమా. ఐదేళ్లుగా నాకు మంచి మిత్రుడు. నాకు బాగా దగ్గరైన మహేంద్రగారు, పవన్‌ మల్లెలగారు కలయికలో వస్తోన్న సినిమా ఇది. ట్రైలర్‌ చూస్తే సినిమా పెద్ద హిట్‌ సాధిస్తుందనిపిస్తుంది. నారా రోహిత్‌, రెజీనా, మణిశర్మ సహా యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

కల్యాణ్‌ కృష్ణ మాట్లాడుతూ - ''ఫస్ట్‌ టైమ్‌ సిక్స్‌ప్యాక్‌ కృష్ణుడిని చూడబోతున్నాం. ప్రొడక్షన్‌ వాల్యూస్‌ చూస్తే భారీ సినిమా అని అర్థమవుతుంది. రమ్యకృష్ణగారు, రెజీనాగారు సహా యూనిట్‌ సభ్యులకు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

మారుతి మాట్లాడుతూ - ''మణిశర్మగారు చాలా రోజుల తర్వాత మంచి కమర్షియల్‌ సినిమాతో వస్తున్నారనిపిస్తుంది. సాంగ్స్‌ బావున్నాయి'' అన్నారు.

నాగశౌర్య మాట్లాడుతూ - ''బోయపాటిలా నెక్స్‌ట్‌ లెవ్‌లోని ఉండే డైరెక్టర్‌ పవన్‌గారు, తొలిసారి డైరెక్ట్‌ చేసిన సినిమా ఇది. వివి.వినాయక్‌ డైరెక్షన్‌లో సినిమాలో ఆది సినిమాను చూసినప్పుడు ప్రేక్షకులకు ఎలా గూజ్‌ బామ్స్‌ వచ్చాయో..అలా సినిమా ఉంటుంది. నిర్మాతతలకు మంచి పేరు రావాలి. కథను నమ్మి..భారీ బడ్జెట్‌తో చేసిన సినిమా ఇది. నారా రోహిత్‌ చాలా సన్నగా, బావున్నాడు. అందరికీ నచ్చేలా రోహిత్‌ సినిమాలో కనపడతాడు'' అన్నాడు.

నారా రోహిత్‌ మాట్లాడుతూ - ''నేను చాలా డిఫరెంట్‌ సినిమాలు చేశాను. మంచి కథ దొరికితే కమర్షియల్‌ సినిమా చేయాలనుకుంటున్న తరుణంలో దర్శకుడు పవన్‌ మల్లెల బాలకృష్ణుడు కథతో నా వద్దకు వచ్చాడు. నాపై నమ్మకంతో వచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌. మణిశర్మగారితో నేను చేస్తోన్న నాలుగో సినిమా ఇది. నా కంటే సినిమా ఎక్కువగా మాట్లాడాలని కోరుకుంటున్నాను. సినిమా కోసం ఎక్కువ ఎఫర్ట్‌ పెట్టాను. పవన్‌ నా వెనుక పడి బరువు తగ్గమని ఫోన్‌ చేసేవాడు. నేను తగ్గానంటే కారణం క్రెడిట్‌ పవన్‌కే దక్కుతుంది. నవంబర్‌ 24న సినిమా విడుదలవుతుంది'' అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ - ''మహేంద్ర ఇండస్ట్రీలో అందరికీ కావాల్సిన వాడు. బాలకృష్ణుడు సినిమాకు మంచి ఆర్టిస్టులే కాదు, స్టార్‌ టెక్నిషియన్స్‌ కూడా పనిచేశారు. బాలకృష్ణగారికి మువ్వగోపాలుడు, ఎన్టీఆర్‌కి బృందావనం హిట్‌ అయినట్లే, ఈ సినిమా నారా రోహిత్‌ పెద్ద హిట్‌ అవుతుందని భావిస్తున్నాను'' అన్నారు.

దర్శకుడు పవన్‌ మల్లెల మాట్లాడుతూ - ''నేను ఇండస్ట్రీలోకి వచ్చి ఏం చేయాలని తిరుగుతున్నప్పుడు నాకు మహేంద్రు దొరికాడు. తిప్పుతూ ఉండేవాడు. నాకు చిరాకు వచ్చి విజయవాడ వెళ్లిపోతే సినిమా చేద్దామని నన్ను హైదరాబాద్‌కు మళ్లీ పిలిపించాడు. ఆ సినిమానే బాలకృష్ణుడు. మణిశర్మగారి సంగీతంలోని పాటలు వింటూ పెరిగాం. అద్భుతమైన సాంగ్స్‌ ఇచ్చాడు. ఇక నేను అనుకున్న విజువల్స్‌ను రెండువందల శాతం తెరపై తీసుకొచ్చిన సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌ సి.కుమార్‌గారికి థాంక్స్‌. కోటగిరి వెంకటేశ్వరరావు ఇలా సూపర్బ్‌ సినిమా కుదిరింది'' అన్నారు.

రాశిఖన్నా మాట్లాడుతూ - ''ఈ సినిమాలో నేను పాట కూడా పాడాను. నాతో పాట పాడించిన మణిశర్మగారికి థాంక్స్‌. నారా రోహిత్‌, రెజీనా సహా యూనిట్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు. కార్యక్రమంలో వెన్నెల కిషోర్‌, సత్య, విద్యుల్లేఖా రామన్‌, బెల్లంకొండ సురేష్‌, సాయికార్తీక్‌, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్‌ తదితరులు పాల్గొని యూనిట్‌ సభ్యులను అభినందించారు. నారారోహిత్‌, రెజీనా కసండ్ర, రమ్యక ష్ణ, పృథ్వీ, ఆదిత్య మీనన్‌, కోట శ్రీనివాసరావు, దీక్షాపంత్‌, పియా బాజ్‌పాయ్‌, అజయ్‌, తేజస్విని, శ్రావ్య రెడ్డి, వెన్నెలకిషోర్‌, శివప్రసాద్‌, రఘుబాబు, రామారాజు, శ్రీనివాస్‌రెడ్డి, ప థ్వీ, దువ్వాసి మోహన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి స్టంట్స్‌ః విజయ్‌, కాస్ట్యూమ్స్‌ః నరసింహారావ్‌, ఆర్ట్‌ః ఆర్‌.కె.రెడ్డి, గ్రాఫిక్స్‌ః మేట్రిక్స్‌ వి.ఎఫ్‌.ఎక్స్‌, కథ, మాటలుః కొలుసు రాజా, మ్యూజిక్‌ః మణిశర్మ, సినిమాటోగ్రఫీః విజయ్‌ సి.కుమార్‌, ఎడిటర్‌ః కోటగిరి వెంకటేశ్వరరావు, లైన్‌ ప్రొడ్యూసర్‌ః డి.యోగానంద్‌, నిర్మాతలుః బి.మహేంద్రబాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్‌ నందమూరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః పవన్‌ మల్లెల.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved