22 December 2017
Hyderabad
వి.కె.ఎ.ఫిలింస్ బ్యానర్‌పై ఆశిష్‌రాజ్, సిమ్రన్ జంటగా నటించిన చిత్రం 'ఇగో'. విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మాతలు. సుబ్రమణ్యం ఆర్.వి. దర్శకుడు. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో త్రినాథరావు నక్కిన, సిడబ్ల్యుఇ జగదీశ్ పర్వాని, బాలాజీ, థర్టీ ఇయర్స్ పృథ్వీ, సాయికార్తీక్, త్రినాథరావు, శ్రీమతి సునీత రావు, శ్రీమతి నందిత, టీడీపీ నాయకులు మల్లా సురేందర్, వెంకటేష్, అశోక్‌కుమార్, స్నిగ్ధ తదితరులు పాల్గొన్నారు. త్రినాథరావు నక్కిన థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. బిగ్ సీడీ, ఆడియో సీడీలను దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఈ సందర్భంగా...
జగదీశ్ పర్వాని మాట్లాడుతూ - ``ఆశిష్‌రాజ్‌లో మంచి ఎనర్జీ ఉంది. తను భవిష్యత్తులో మంచి విజయాలను సాధిస్తాడు. వికెఎ.ఫిలింస్ బ్యానర్‌కు ఇగో సినిమాతో మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నాను`` అన్నారు.
పృథ్వీ మాట్లాడుతూ - ``సినిమా షూటింగ్ పాలకొల్లులో జరుగుతున్నప్పుడు, నిర్మాతలు హైదరాబాద్ నుండి పర్యవేక్షించారు. పక్కా ప్లానింగ్‌తో ఉండటం వల్ల నిర్మాతలకు, హీరోకు ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావాలి. ఆకతాయి సినిమా కంటే ఈ సినిమాలో ఆశిష్‌రాజ్ ఎనర్జీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. దర్శకుడు సుబ్రమణ్యంగారు మంచి టైమింగ్ ఉన్న డైరెక్టర్. సినిమాలో నేను అంకుశం సీఐ పాత్రలో కనపడతాను`` అన్నారు.
సుకుమార్ (వీడియో ద్వారా)మాట్లాడుతూ - ``మా సుబ్రమణ్యం మంచి హార్డ్ వర్కింగ్ పర్సన్. తనకు సినిమాలంటే ప్యాషన్. ఆశిష్‌రాజ్, సిమ్రన్ నటించిన ఇగో చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను`` అని తెలిపారు.
స్నిగ్ధ మాట్లాడుతూ - ``తొలిసారి ఓ పల్లెటూరి పాత్రలో కనపడతాను. ఆశిశ్ రాజ్, సిమ్రన్ సహా అందరికీ ఆల్ ది బెస్ట్. మంచి టీమ్‌తో పనిచేశాను`` అన్నారు.
కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ - ``దర్శకుడు సుబమ్రణ్యం టైటిల్ ద్వారానే అసలు సినిమా ఏంటనే విషయాన్ని చాలా సింపుల్‌గా చెప్పేశారు. సినిమాను చక్కగా తెరకెక్కించారు. పూర్తి కథ విన్నాను. సినిమా బాగా ఉంటుంది. డైరెక్టర్ సహా టీం అంతా మంచి అవుట్ పుట్ రావడానికి అందరం ఎంతో కష్టపడ్డారు. దర్శక నిర్మాతలను అందరూ ఆదరించాలి`` అన్నారు.
త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ - ``నా తొలి చిత్రం `మేం వయసుకు వచ్చాం` తర్వాత, మా అమలాపురంలో నాకు ఓ సన్మానం జరిగింది. దానికి వైట్ అండ్ వైట్‌లో సుబ్రమణ్యం వచ్చారు. ముందు తనని చూసి పొలిటీషియన్ అనుకున్నాను. తర్వాత సినిమా కబుర్లు చెప్పడం మొదలు పెట్టాడు..అప్పుడు తనని ప్రొడ్యూసర్‌ని అనుకున్నాను. తర్వాత గడ్డంతో కనిపిస్తే టెక్నిషియన్ అనుకున్నా, తర్వాత సినిమాను డైరెక్ట్ చేసి తను డైరెక్టర్ అని చెప్పాడు. మంచి పవర్‌పుల్ టైటిల్. ఈ మధ్య కాలంలో క్యారెక్టరైజేషన్స్‌ను బేస్ చేసుకుని తీస్తున్న సినిమాలు పెద్ద సక్సెస్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుంది. అలాగే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్‌తో కూడా మంచి రిలేషన్ ఉంది. తనకు సౌండ్స్ మీద కమాండ్ ఉంది. మంచి కథకు తగ్గట్లు ఆశిష్ అద్భుతంగా నటించాడు. తనకు మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకంటున్నాను. ముగ్గురు నిర్మాతల పెట్టిన ఖర్చు తెరపై కనపడుతుంది. సినిమాను రిచ్‌గా తెరకెక్కించారు. వాళ్లకి అభినందనలు`` అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ - ``ఇండస్ట్రీకి చాలా సమస్యలున్నాయి. ఆ సమస్యలను తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌గారు నేరవేర్చాలని కోరుకుంటున్నాం. ముగ్గురు అన్నదమ్మలు కలిసి నిర్మించిన చిత్రమిది. అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేసి, విడుదల చేస్తున్నారు. ఆశిష్‌రాజ్ బాగా నటిస్తున్నాడు. మంచి ఎనర్జీ ఉంది. తనకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్ చాలా తర్వగా 50 సినిమాలను పూర్తి చేసేశాడు. తను ఇదే స్పీడుతో వెళితే చక్రవర్తిగారిని దాటేస్తాడు. అలాగే దాటాలని కూడా కోరుకుంటున్నాను. దర్శకుడు సుబ్రమణ్యం కొత్త కాన్సెప్ట్‌తో ఇండస్ట్రీలోకి వస్తున్నాడు. డెఫనెట్‌గా సినిమా బావుంటుందని కోరుకుంటున్నాను`` అని తెలిపారు.
ఆశిష్ రాజ్ మాట్లాడుతూ - ``నా తల్లిదండ్రులకు థాంక్స్. అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. నాకు ఇంత మంచి ఫ్లాట్ ఫాం ఇచ్చిన మావయ్యలకు థాంక్స్. మంచి టీమ్‌తో కలిసి పనిచేశాం. దర్శకుడు సుబ్రమణ్యంగారు సినిమాను ఎంతో బాగా తెరకెక్కించారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్ మాట్లాడుతూ - ``సినిమా చాలా బాగా వచ్చింది. సుబ్రమణ్యంగారు సినిమాను ఎంతో కేర్‌గా తెరకెక్కించారు. ఆయనకు ఈ సినిమాతో పెద్ద సక్సెస్ అవుతుంది. ఆశిష్‌రాజ్ చక్కగా నటించాడు. తనకు ఈ సినిమా మంచి బ్రేక్ అవుతుంది`` అన్నారు.
దర్శకుడు సుబ్రమణ్యం ఆర్.వి. మాట్లాడుతూ - ``సాయికార్తీక్ అన్న..చక్కగా మ్యూజిక్ ఇచ్చాడు. మంచి కిక్ ఉన్న మ్యూజిక్ అందించాడు. కథ విన్న తర్వాతనే వెంటనే ట్యూన్ ఇచ్చేశారు. మ్యూజిక్‌కు తగ్గ సాహిత్యం కుదిరింది. రీరికార్డంగ్ బాగా కుదిరింది. హీరో ఆశిష్. సిమ్రన్ సహా అందరికీ థాంక్స్.సినిమాటోగ్రాఫర్ ప్రసాద్‌గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. నిర్మాతలు మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశారు`` అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సినిమాటోగ్రపీ: ప్రసాద్ జి.కె, ఎడిటర్: శివ, ఆర్ట్: ఆర్.కె.రెడ్డి, స్టంట్స్: నందు, నిర్మాతలు: విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్, రచన, దర్శకత్వం: సుబ్రమణ్యం ఆర్.వి.