pizza
Geetha Govindam music launch
'గీత గోవిందం' ఆడియో ఆవిష్కరణ
You are at idlebrain.com > News > Functions
Follow Us


29 July 2018
Hyderabad

విజయ్‌ దేవరకొండ, రష్మిక మండన్న హీరో హీరోయిన్లుగా.. అల్లు అరవింద్‌ సమర్పణలో జి.ఎ 2 పిక్చర్స్‌ బ్యానర్‌పై పరుశురాం దర్శకత్వంలో బన్నివాసు నిర్మిస్తోన్న చిత్రం 'గీత గోవిందం'. గోపీసుందర్‌ సంగీతం అందించిన ఈసినిమా పాటలను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా...

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మాట్లాడతూ - ''బన్ని వాసుకోసమే ఈ వేడుకకి వచ్చాను. నా కెరీర్‌ బిల్డింగ్‌లో మా నాన్నగారి సపోర్ట్‌ ఎంత ఉంటుందో.. బన్నివాసుది అంతే కానీ.. అంత కంటే ఎక్కువగానీ సపోర్ట్‌ ఉంది. ఈ సినిమాను నేను చూశాను. రెండు సంవత్సరాలు క్రితం కథ విన్నాను. రీసెంట్‌గా సినిమా చూశాను. విజయ్‌, రష్మిక రాక్‌ ది షో. సినిమా చాలా బావుంది. గోపీసుందర్‌గారు అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. ఎన్నో సినిమాలకు తన మ్యూజిక్‌తో ప్రాణం పోసిన గోపీసుందర్‌గారు ఈ సినిమాకు మరోసారి ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చారు. పరుగు సినిమా సమయంలో పరుశురాంగారిని అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చూశాను. ఆయన ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ డైరెక్టర్‌గా ఎదిగారు. ఆయన కెరీర్‌లో ఇది బెస్ట్‌ మూవీ అవుతుంది. సినిమా చాలా బాగా తీశారు. రష్మిక కిరాక్‌పార్టీలో చక్కగా నటించిందని విన్నాను. నేను ఆ సినిమా చూడలేదు కానీ.. ఈ సినిమాలో రష్మిక క్యారెక్టర్‌ అద్భుతంగా ఉంది. రేపు సినిమా చూసి అందరూ అదే చెబుతారు. అర్జున్‌రెడ్డి తర్వాత.. నేను ఒక వారం పాటు ఎవరినీ కలవలేదు. ఏం సినిమాలు చేస్తున్నాం మనం అనుకుంటూ ఉండిపోయాను. డిస్ట్రబ్‌ అయిపోయాను. తన పెర్ఫామెన్స్‌కు ఆ ఏడాది ఫిలిమ్‌ పెర్ఫామర్‌గా అవార్డ్‌ రావాలని అనుకున్నాను. నేను అనుకున్నట్లుగానే తనకు ఆ అవార్డు దక్కింది. తెలుగులో గుడ్‌ పెర్ఫామర్స్‌ ఉన్నారు. కొద్ది మందే గ్రేట్‌ పెర్ఫామర్స్‌ ఉన్నారు. అలాంటి కొద్దిమందిలో విజయ్‌ ఒకరు. ఫిమేల్‌ ఓరియెంటెడ్‌ స్క్రిప్ట్‌ను ఒప్పుకుని తన స్టయిల్లో మార్కులు కొట్టేస్తాడు. అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ - ''శ్రీరస్తు శుభమస్తు' సమయంలో ఈ సినిమా లైన్‌ను ఓ పదిహేను నిమిషాల పాటు వినిపించాడు. నువ్వు కథలో వేసిన ముడి చాలా బావుంది. ఆ ముడి విప్పి నాకు కథ చెప్పు అంటే.. ఆరు నెలలు తర్వాత ఒక గంట కథ చెబితే.. అప్పటి నుండి ఆఫీస్‌లో ఉంచాం. వన్‌ ఇయర్‌ తర్వాతే సినిమాను మొదలు పెట్టాం. ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయిన తర్వాత అర్జున్‌రెడ్డి విడుదలైంది.. యూనిట్‌ అంతా కాస్త కంగారు పడి మాట్లాడుకున్నాం. ఈ హీరోతో ఇలాంటి క్యారెక్టర్‌ చేయించడం బావుంటుందా? అనుకునన్నాం. అయితే అర్జున్‌రెడ్డిని చూసి కంగారు పడి ఓ లైన్‌ కూడా మార్చొద్దు అనుకున్నాం. అదే ఈ సినిమా సక్సెస్‌ అవుతుంది. అందుకు కారణం విజయ్‌ దేవరకొండే. తను విజయ్‌ నైస్‌ జెంటిల్‌మెన్‌. రష్మిక రాక్‌డ్‌ ఇన్‌ ది మూవీ.పరుశురాం గురించి నేను ప్రత్యేకంగా ఏదీ చెప్పనక్కర్లేదు. గోపీసుందర్‌గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మేం మామూలు సినిమా చేస్తే.. దాని పాటలకి 27 మిలియన్‌ హిట్స్‌ వచ్చేటట్లు చేసిన ఘనత గోపీసుందర్‌గారిదే. బన్నివాసు నిర్మాణ బాధ్యతలు తీసుకుని సమర్ధవంతగా పూర్తి చేశాడు. నా నమ్మకాన్ని నిజం చేశాడు. సినిమా చాలా బాగా వచ్చింది. కచ్చితంగా పెద్ద సక్సెస్‌ అవుతుంది'' అన్నారు.

జాగర్లమూడి క్రిష్‌ మాట్లాడుతూ ''2015లో పరుశురాం నాకు ఈ కథను చెప్పాడు. చాలా మందికి ఆయాచితంగా విజయాలు వస్తుంటాయి. కానీ కొంతమంది చాలా కష్టపడితేనే కానీ గొప్ప విజయాలు రావు. పరుశురాం గొప్ప విజయాలు సాధించాల్సిన దర్శకుల్లో ఒకడు. తన రైటింగ్‌ స్టయిల్‌ నాకు ఇష్టం. తనకు విజయ్‌లాంటి హీరో దొరికాడు. పరుశురాంకి గీత గోవిందం అద్భుతమైన విజయాన్ని తెచ్చి పెడుతుంది'' అన్నారు.

బన్నీ వాసు మాట్లాడుతూ - ''పరుశురాం ఈ కథను ముందు నాకు, బన్నిగారికి చెప్పారు. కథ విన్న బన్నిగారు.. 'వాసు.. నీకు 100 పర్సెంట్‌ లవ్‌' తర్వాత అంతే పెద్ద హిట్‌ అవుతుంది. వదలకుండా చెయ్‌' అన్నారు. ఈ కథకు హీరో ఎవరు అని వెతుకుతున్నప్పుడు 'పెళ్ళిచూపులు' విడుదలైంది. బుజ్జిని సినిమా చూడమంటే చూశాడు. తనకు హీరోలో మ్యాజిక్‌ ఉందనిపించి..తనతో సినిమాచేద్దామని చెప్పాడు. అలా సినిమా స్టార్ట్‌ అయింది. సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయిన తర్వాత అర్జున్‌రెడ్డి విడుదలైంది. ఆ సినిమా చూసిన తర్వాత తను నిజంగా పెద్ద స్టార్‌ అవుతాడనిపించింది. రష్మికను అడగ్గానే సినిమా చేయడానికి ఒప్పుకుంది. తనకు చాలా మంచి పేరు వస్తుంది. మంచి మ్యూజిక్‌ ఇచ్చిన గోపీసుందర్‌గారికి థాంక్స్‌'' అన్నారు.

విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ - ''నేను పాడిన పాట ఏదో సెన్సేషనల్‌ అవుతుందనుకుంటే.. మరో రకంగా సెన్సేషన్‌ అయింది. అందరూ నన్ను, మా లిరిక్‌ రైటర్‌ను తిట్టారు. సరే..ప్రేక్షకులు ఈ పాటను పాడి పంపితే.. ఎవరి గొంతు బావుంటుందో వారితోనే ఈ పాటను పాడిస్తాం'' అన్నారు.

గోపీసుందర్‌ మాట్లాడుతూ - ''నా సాంగ్స్‌, నా ఎమోషన్స్‌ను పాటల రూపంలో వినిపించే అవకాశం ఇచ్చినందుకు బన్నివాసుగారికి థాంక్స్‌. డైరెక్టర్‌ బుజ్జి డౌన్‌ టు ఎర్త్‌ పర్సన్‌'' అన్నారు.

డైరెక్టర్‌ పరుశురాం మాట్లాడుతూ - ''ఈ కథ రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. శ్రీరస్తు శుభమస్తు పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉండగానే అల్లు అరవింద్‌గారు ఈ కథను ఓకే చేశారు. గీత గోవిందం సినిమాలో నేను బాగా ఇన్‌వాల్వ్‌ అయి చేశాను. నా రెండు సంవత్సరాల కష్టమే ఈ సినిమా. విజయ్‌దేవరకొండ, రష్మికలకు ఈ సినిమా రాసి పెట్టి ఉంది. అర్జున్‌రెడ్డి నాకు రాసి పెట్టి ఉంది. మా సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయిన తర్వాత అర్జున్‌రెడ్డి విడుదలైంది. ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయాడు. తను ఎలా బిహేవ్‌ చేస్తాడోనని అనుకున్నాను. కానీ తను ముందు ఎలా బిహేవ్‌ చేసేవాడో అలాగే బిహేవ్‌ చేశాడు. తన సంస్కారానికి హ్యాట్సాఫ్‌. నన్ను ఎందుకిలా చేయాలి అని ప్రశ్నించకుండా గోవిందం పాత్రను నేను అనుకున్న దాని కంటే అందంగా చేశాడు. బన్నివాసు స్వంత బ్రదర్‌లా కేర్‌ తీసుకున్నారు. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని ఈసినిమాతో పూర్తి చేసుకుంటానని నమ్ముతున్నాను. గోపీసుందర్‌గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్రాఫర్‌ మణికంఠన్‌గారు సహా అందరికీ థాంక్స్‌. ప్రతి అమ్మాయి.. అబ్బాయి వాళ్ల జీవితాన్ని ఈ సినిమాలో చూస్తారు. క్యాజువల్‌గా ఉంటూ.. నవ్విస్తూ.. అక్కడక్కడా ఏడిపిస్తూ.. ఎంటర్‌టైనింగ్‌గా ఉండే సినిమా. అందరూ ఈ సినిమాకు కనెక్ట్‌ అవుతారు'' అన్నారు.

ఈ కార్యక్రమంలో యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

 

Photo Gallery (photos by G Narasaiah)
 
 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved