pizza
Jaguar Music launch
'జాగ్వార్‌' ఆడియో ఆవిష్కరణ
You are at idlebrain.com > News > Functions
Follow Us

18 September 2016
Hyderaba
d

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూ టర్‌, ప్రముఖ నిర్మాత హెచ్‌.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ 75 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న చిత్రం 'జాగ్వార్‌'. హెచ్‌.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్‌ పతాకంపై రాజమౌళి శిష్యుడు ఎ.మహదేవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'జాగ్వార్‌'. ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌ నోవాటెల్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవగౌడ, హెచ్‌.డి.కుమారస్వామి, శ్రీమతి అనితా కుమారస్వామిహీరో నిఖిల్‌కుమార్‌, తెలంగాణ ఐటీ మినిష్టర్‌ కె.టి.ఆర్‌, టి.సుబ్బరామిరెడ్డి, జగపతిబాబు, విజయేంద్రప్రసాద్‌, సి.కల్యాణ్‌, తమ్మారెడ్డి భరద్వాజ, డి.సురేష్‌బాబు, పుల్లెల గోపీచంద్‌, పి.వి.సింధు, ఎస్‌.ఎస్‌.థమన్‌, అశోక్‌కుమార్‌, బ్రహ్మానందం, రఘురామరాజు తదితరులు పాల్గొన్నారు.

బిగ్‌సీడీ, ఆడియో సీడీలను దేవగౌడ, కె.టి.ఆర్‌ విడుదల చేశారు. ఆడియో సీడీలను కె.టి.ఆర్‌.విడుదల చేశారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ - ''ఈ సినిమా సూపర్‌డూపర్‌హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. ఎంటైర్‌ టీంకు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

డి.సురేష్‌బాబు మాట్లాడుతూ - ''కుమారస్వామిగారికి, నిఖిల్‌కుమార్‌ సహా టీం అంతటికీ అభినందనలు. సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి'' అన్నారు.

పి.వి.సింధు మాట్లాడుతూ - ''ఇలాంటి ఆడియో వేడుకకు రావడం ఇదే మొదటిసారి. పాట బావుంది. సినిమా పెద్ద హిట్‌ అయ్యి టీంకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

సి.కల్యాణ్‌ మాట్లాడుతూ - ''చన్నాంభిక ఫిలింస్‌ అంటేనే సెన్సేషన్‌. ఈ బ్యానర్‌లో విడుదలైన ప్రతి సినిమా సెన్సేషనల్‌ సక్సెస్‌ను సాధించింది. అనిత మేడమ్‌ నిర్మాతగా పెద్దాయన దేవగౌడగారి ఆశీర్వాదంతో కుమారస్వామిగారు ఆయన తనయుడు నిఖిల్‌ను ఎంత గ్రాండ్‌గా లాంచ్‌ చేస్తున్నారో మనం చూస్తున్నాం. సినిమా అక్టోబర్‌ 6న విడుదలవుతుందని వార్తలు రాగానే ఈ సినిమాతో మనకు పోటీ ఎందుకులే అనే విధంగా కొత్త సినిమా రిలీజ్‌ అవుతుందంటేనే సినిమాకున్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఈ బ్యానర్‌లో విడుదలై సెన్సేషన్‌ అయిన సినిమాలంటే పెద్ద హిట్‌గా ఈ సినిమా నిలవాలి. నిఖిల్‌ ఐరన్‌ మ్యాన్‌..రేసుగుర్రం. ఈ సినిమాతో తనకు గొప్ప ప్రతిఫలం దక్కాలని, ఈ సంస్థ ఇంకా గొప్ప సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ - ''నిఖిల్‌కుమార్‌కు, ఎంటైర్‌ జాగ్వార్‌టీంకు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

రఘురామరాజు మాట్లాడుతూ - ''కుమారస్వామిగారి తెర వెనుక కష్టం, తెరపై నిఖిల్‌ కష్టం మనకు కనపడుతుంది. సినిమా గ్రాండ్‌గా ఉంటుంది. సినిమా పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది. నిఖిల్‌ కుమార్‌ భవిష్యత్‌లో పెద్ద హీరో అవుతాడు. నిఖిల్‌కు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ - ''జాగ్వార్‌గా నటించిన నిఖిల్‌, కథను అందించిన విజయేంద్రప్రసాద్‌, మ్యూజిక్‌ అందించిన థమన్‌, దర్శకత్వం వహించిన మహదేవ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను. జగపతిబాబుగారు ట్రెండీ విలన్‌గా నటించారు. మహదేవ్‌ సినిమాను అద్భుతంగా చేశాడు. మనోజ్‌ పరమహంస ప్రతి సీన్‌ను ఎంతో అద్భుతంగా చూపించాడు. ఎంతో మంది టీంతో పనిచేసే అవకాశం కలిగింది. నిఖిల్‌ సౌతిండియన్‌ సూపర్‌స్టార్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

Glam gallery of DeeptiSati from the event

విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ - ''కుమారస్వామిగారు నన్ను బెంగళూరుకి పిలిచి నిఖిల్‌ను పరిచయం చేసి తను హీరోగా ఓ కథను రాయమని అన్నారు. ముందు సాధారణంగానే కనపడ్డాడు. అయితే తను చేసిన ఓ యాడ్‌ చూడగానే తనను సానపడితే ఓ వజ్రం అవుతాడనిపించింది. కుమారస్వామిగారు సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. కుమారస్వామి లాంటి తండ్రి ఉండటం నిఖిల్‌కుమార్‌ అదృష్టం. నిఖిల్‌కుమార్‌ చాలా సౌమ్యంగా ఉంటున్నాడు. తన మంచి ప్రవర్తనతోనే తనింకా ఎదుగుతాడు. ఇక దర్శకుడు మహదేవ్‌ నాకు బిడ్డలాంటివాడు. రాజమౌళిని ఎలా చూస్తానో, మహదేవ్‌ను కూడా అలాగే చూస్తాను. తను ఈ సినిమాతో తనెంటో ప్రూవ్‌ చేసుకుంటాడు. ఈ సినిమాతో నిఖిల్‌, మహదేవ్‌లా కెరీర్‌ లాంచ్‌ చేస్తున్నామని భావిస్తున్నాను'' అన్నారు.

తెలంగాణ ఐటీ మినిష్టర్‌ కె.టి.ఆర్‌ మాట్లాడుతూ - ''దేవగౌడ, కుమారస్వామిగారితో చాలా మంచి అనుబంధం ఉంది. వారి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్‌ అవుతున్న నిఖిల్‌లో చాలా ఫైర్‌ ఉంది. నిఖిల్‌ తన తాతగారు, తండ్రిగారి పేరుని నిలబెడతాడు. భవిష్యత్‌లో తను మంచి హీరోగా ఎదుగుతాడు. తమన్‌ మంచి మ్యూజిక్‌ అందించాడు. భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాను, హీరోలను ఎంకరేజ్‌ చేసే మంచి సంస్కృతి తెలుగు ప్రేక్షకులకు ఉంది. అలాంటి సంస్కృతితోనే నిఖిల్‌ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాం'' అన్నారు.

హెచ్‌.డి.దేవగౌడ మాట్లాడుతూ - ''మా నిఖిల్‌ను ఆశీర్వదించడానికి సుబ్బరామిరెడ్డి, కె.టి.ఆర్‌. సహా అందరూ మిత్రులు రావడం ఆనందంగా ఉంది. సినిమా హైదరాబాద్‌, బెంగళూరుల్లో అక్టోబర్‌ 6న విడుదలవుతుంది. నిఖిల్‌ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. డ్యాన్సులు, ఫైట్స్‌లో బాగా ట్రయినింగ్‌ తీసుకున్నాడు. ఈ సినిమా క్రెడిట్‌ అంతా దర్శకుడు మహదేవ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ సహా చిత్రంలో నటించిన నటీనటులు, టెక్నిషియన్స్‌కే చెందుతుంది. సహకారం అందించిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.

జగపతిబాబు మాట్లాడుతూ - ''దేవగౌడ, కె.టి.ఆర్‌. వంటి అగ్రెసివ్‌ లీడర్స్‌ను కలిశాను. అలాగే నన్ను ఎంతో ఎంకరేజ్‌ చేసిన సుబ్బరామిరెడ్డిగారికి థాంక్స్‌. ఈ సినిమాతో కుమారస్వామిగారు నాకు మంచి మిత్రుడుగా మారిపోయారు. చాలా మంచి వ్యక్తి. గొప్ప నాయకుడు. సినిమాకు పనిచేసిన దర్శకుడు మహదేవ్‌ నుండి మనోజ్‌ పరమ హంస, థమన్‌ సహా అందరూ ప్రాణం పెట్టి పనిచేయకుండా ప్రాణం పోయేలా పనిచేశారు. నిఖిల్‌ డౌన్‌ టు ఎర్త్‌ పర్సన్‌. మంచి హార్డ్‌వర్కర్‌. టీం అందరూ బాగా కష్టపడి పనిచేశారు. సినిమా చాలా పెద్ద సినిమా అవుతుంది'' అన్నారు.

ఎస్‌.ఎస్‌.థమన్‌ మాట్లాడుతూ - ''జాగ్వార్‌ సినిమా తెలుగు, కన్నడంలో రూపొందుతోంది. ఇలాంటి సినిమా చేయడం గొప్ప విషయంగా భావిస్తున్నాను. నిఖిల్‌ సహా టీం అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

నిఖిల్‌కుమార్‌ మాట్లాడుతూ - ''సినిమా అక్టోబర్‌ 6న విడుదలవుతుంది. చాలా ప్యాషన్‌తో సినిమా చేశాం. థమన్‌ వండర్‌ ఫుల్‌ మ్యూజిక్‌ అందించగా, మనోజ్‌ పరమహంస చాలా రిచ్‌గా సినిమాను చూపించారు. మహదేవ్‌ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. జగపతిబాబు, సంపత్‌, బ్రహ్మానందం సహా మంచి నటీనటులు, టెక్నిషియన్స్‌తో పనిచేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను'' అన్నారు.

జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్‌, ఆదిత్యమీనన్‌, భజ్రంగ్‌ లోకేష్‌, అవినాష్‌, వినాయక్‌ జోషి, ప్రశాంత్‌, సుప్రీత్‌ రెడ్డి, రావు రమేష్‌, రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: హెచ్‌.డి. కుమారస్వామి, కథ: విజయేంద్ర ప్రసాద్‌, సినిమాటోగ్రఫి: మనోజ్‌ పరమహంస, మ్యూజిక్‌: యస్‌.యస్‌. థమన్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, ఫైట్స్‌: రవివర్మ, రామ్‌-లక్ష్మణ్‌, కలోయాన్‌ (బల్గేరియా), సెల్వ, కో డైరెక్టర్‌: అమ్మినేని మాధవసాయి, నిర్మాత: శ్రీమతి అనితా కుమారస్వామి, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: ఎ. మహదేవ్‌.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved