pizza
Naa Nuvve music launch
`నా నువ్వే` ఆడియో విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

6 May 2018
Hyderabad

ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం `నా నువ్వే`. జ‌యేంద్ర దర్శ‌క‌త్వంలో కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా...

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ మాట్లాడుతూ - ``ఈ సినిమా టేకింగ్ స‌మ‌యంలో ల‌వ్‌లీ మూమెంట్స్ నేను మ‌ర‌చిపోలేను. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే మ‌హేశ్ కొనేరుగారు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి జ‌యేంద్ర‌గారు ఒక క‌థ చెబుతారంటా వినండి అన్నారు. అప్ప‌టికే జ‌యేంద్ర‌గారు డైరెక్ట్ చేసిన `180` సినిమాను నేను చూశాను. ఆయ‌న ప్యూర్ ల‌వ్ స్టోరీస్ చేస్తాం. మ‌న‌మేమో మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తాం. నాకు న‌మ్మ‌కం లేదండి అన్నాను. అయితే మ‌హేశ్ `లేదు సార్‌.. నిజం సార్‌.. అందులో పి.సి.శ్రీరామ్‌గారు కెమెరామెన్ అండి` అన్నారు. క‌లా? నిజ‌మా? అనుకున్నాను. ఘ‌ర్ష‌ణ‌, గీతాంజ‌లి వంటి సినిమాలు చూసి ఆయ‌నలాంటి కెమెరామెన్ మ‌న‌తో ఎందుకు వ‌ర్క్ చేస్తారు. మ‌న‌కు క‌ల‌లాగా మిగిలిపోతుందేమో అనుకున్నాను. ఆయితే ఆ డ్రీమ్‌ను నేరవేర్చింది జ‌యేంద్ర‌గారు. క‌థ విన‌గానే న‌చ్చింది. కానీ ఈ సినిమాలో హీరోగా నేను క‌రెక్టేనా? అని అడిగాను. దానికి జయేంద్ర‌గారు `నువ్వు రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే చేస్తున్నారు. నిన్ను కొత్త స్ట‌యిల్లో చూపిస్తాం. అలా చూపించి స‌క్సెస్ అయితే సినిమా పెద్ద స‌క్సెస్ అవుతుంది` అన్నారు. నేను సినిమా చూశాను. నాలో క‌న‌ప‌డ్డ చేంజ్ ఓవ‌ర్ క్రెడిట్ అంతా జ‌యేంద్ర‌గారికే ద‌క్కుతుంది. సాధార‌ణంగా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసిన నాకు బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. దాన్ని కొత్తగా మార్చ‌డానికి జ‌యేంద్ర‌గారు ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డారు. పి.సి.శ్రీరాంగారితో ప‌నిచేయాలంటే కాస్త భ‌య‌మేసింది. శ్రీరాంగారు ప్ర‌తి షాట్‌లో న‌న్ను కొత్త‌గా చూపించారు. ఆయ‌న‌తో ప‌నిచేయ‌డం నా అదృష్టం. శ‌ర‌త్ గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇదొక మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరీ. దానికి త‌న సంగీతంతో శ‌ర‌త్‌గారు ప్రాణం పోశారు. ఆల్బమ్‌లో ప్ర‌తిసాంగ్‌ను ఇష్ట‌ప‌డ్డాను. ముఖ్యంగా నువ్వే నా వంటి సాంగ్ నా సినిమాల్లో ఉంటుంద‌ని అనుకోలేదు. ఈ సినిమాతో నా కోరిక తీరింది. కిర‌ణ్, విజ‌య్‌లు మంచి అవుట్ పుట్ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. యూనిట్‌కి మేకింగ్ ప‌రంగా ఎలాంటి స‌పోర్ట్ కావాలో దాన్ని అందించారు. త‌మ‌న్నా త‌ప్ప మ‌రో హీరోయిన్ ఉంటే ఈ సినిమాలో నేను న‌టించ‌లేక‌పోయేవాడిని. త‌మ‌న్నా.. నా వ‌ర్క్‌ను ఈజీ చేసేసింది. ఇప్ప‌టి వర‌కు నేను ప‌నిచేసిన కోస్టార్స్‌లో నా బెస్ట్ కోస్టార్ త‌మ‌న్నాయే. నేను ల‌వ్‌స్టోరీలో న‌టించాల‌ని బ‌లంగా కోరుకుంది మ‌హేశ్ కోనేరు. ఈ సినిమా నా కోసం జ‌యేంద్ర‌గారు అండ్ టీం న‌మ్మ‌మ‌ని మ‌హేశ్ నన్ను ముందుకు న‌డిపించారు. ఇదొక మంచి జ‌ర్నీ. డాన్స్‌, ఎలా ప్రెజెంట్ చేయాలి అనే విష‌యాల‌ను నేర్చుకున్నాను. నాకు స‌పోర్ట్ చేసిన టీం అంతంటికీ థాంక్స్ `` అన్నారు.

త‌మ‌న్నా మాట్లాడుతూ - ``ఈమ‌ధ్య కొత్త ద‌ర్శ‌కుల క‌థ‌ల‌నే వింటున్నాను. నేను క‌లిసిన అలాంటి యువ ద‌ర్శ‌కుల్లో ఎక్కువ మంది జ‌యేంద్ర‌గారితో ప‌నిచేయాల‌నుకున్నవారే. అలాంటి ద‌ర్శ‌కుడితో నేను ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. మంచి ద‌య‌గ‌ల‌, మృదు స్వ‌భావంగ‌ల, స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌, ఎమోష‌న్స్‌ను క‌లిగిన వ్య‌క్తి. మంచి అనుభ‌వ‌మున్న వ్య‌క్తి. ఈ సినిమాలో మెయిన్ పాయింట్ నాకు బాగా న‌చ్చింది. నాకు వ్య‌క్తిగ‌తంగా కూడా ఆ కోర్ పాయింట్ బాగా న‌చ్చుతుంది. సెన్సిటివ్‌, బ్యూటీఫుల్ మూమెంట్స్‌ను తెర‌పై ఆర్.జె.మీరాగా ప్రెజెంట్ చేసే అవ‌కాశాన్ని నాకు క‌లిగించిన జ‌యేంద్ర‌గారికి థాంక్స్‌. ఈ సినిమా చేయ‌డం ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. నాకు స్పెష‌ల్ మూవీ. శ‌ర‌త్‌గారు అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. నా నువ్వే .. సాంగ్ నాకు బాగా న‌చ్చింది. మ‌హేశ్‌, కిర‌ణ్‌, విజ‌య్‌గారు మంచి స‌పోర్ట్ అందించారు. వారి వ‌ల్లే బెస్ట్ మూవీ వ‌చ్చింది. రామ‌జోగ‌య్య‌గారు, అనంత శ్రీరామ్‌గారు మంచి సాహిత్యాన్ని అందించారు. క‌ల్యాణ్ రామ్ లేకుంటే ఈ సినిమాను పూర్తి చేసే దాన్ని కాదు. మోస్ట్ స‌పోర్టివ్ కోస్టార్‌. త‌న డేడికేష‌న్ లెవ‌ల్స్ మ‌రో స్థాయిలో ఉండ‌టాన్ని గ‌మ‌నించాను.`` అన్నారు.

డైరెక్ట‌ర్ జ‌యేంద్ర మాట్లాడుతూ - ``మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ‌ర‌త్ వండ‌ర్‌ఫుల్ ఆల్బ‌మ్ ఇచ్చాడు. పాట‌లు విన్న‌వారందరూ అప్రిసియేట్ చేస్తున్నారు. రామ‌జోగ‌య్య‌శాస్త్రి, అనంత శ్రీరామ్‌గారు ఎక్స‌లెంట్ లిరిక్స్ అందిస్తే.. బృంద‌గారు కొరియోగ్ర‌ఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యింది. క‌ల్యాణ్ రామ్ రొమాంటిక్ జోన‌ర్‌లో న‌టించ‌డానికి కార‌ణం నాపై త‌ను ఉంచిన న‌మ్మ‌క‌మే. త‌మ‌న్నా ఓ కొత్త హీరోయిన్‌లా న‌టించింది. మ‌హేశ్‌గారు, కిర‌ణ్‌గారు, విజ‌య్‌గారికి అభినంద‌న‌లు. కూల్‌, బ్రిజీ ఎంట‌ర్‌టైనింగ్ మూవీ`` అన్నారు.

మ‌హేశ్ కోనేరు మాట్లాడుతూ - ``సినిమా ఇండ‌స్ట్రీలో ప‌దేళ్లుగా జ‌ర్నీ చేస్తున్నాను. నా త‌ల్లిదండ్రులు, భార్య‌, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌కు థాంక్స్‌. శ్యామ్ ప్ర‌సాద్‌రెడ్డిగారి వ‌ద్ద నా జ‌ర్నీ ప్రారంభ‌మైంది. త‌ర్వాత ఆర్కా మీడియా, త‌ర్వాత ఎన్టీఆర్‌గారు, క‌ల్యాణ్ రామ్‌గారు, హ‌రిగారు ఇలా అంద‌రితో ప‌ని చేసే అవ‌కాశం క‌లిగింది. తొలి సినిమానే అయినా క‌ల్యాణ్ రామ్‌గారు న‌మ్మ‌కంతో సినిమా చేశారు. తార‌క్‌గారు, క‌ల్యాణ్‌రామ్‌గారు, హ‌రిగారి స‌పోర్ట్ లేకుంటే ఈ సినిమా పూర్త‌య్యేది కాదు. ఈ సినిమా గురించి చెప్ప‌డం కంటే తెర‌పై చూస్తే అర్థ‌మ‌వుతుంది. జ‌యేంద్ర‌గారు, పి.సి.శ్రీరాంగారు మంచి విజువ‌ల్ ఫీస్ట్ అందించారు`` అన్నారు.

 




Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved