pizza
Paisa Vasool music launch at Khammam
`పైసా వ‌సూల్‌` ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

17 August 2017
Hyderaba
d

నటసింహ బాలకృష్ణ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ బేనర్‌పై వి.ఆనంద ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'పైసా వసూల్‌'. శ్రియ, కైరా, ముస్కాన్‌ హీరోయిన్లు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇటీవల రిలీజైన 'పైసా వసూల్‌' స్టంపర్‌కి అభిమానుల నుండి, ప్రేక్షకుల నుండి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ ఆగస్ట్‌ 17న ఖమ్మం ఎస్‌.ఆర్‌. అండ్‌ బి.జి.ఎన్‌.ఆర్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. 'పైసా వసూల్‌' ఆడియో సీడిలను మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను రిలీజ్‌ చేసి తొలి సీడిని దర్శకుడు క్రిష్‌కి అందించారు. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా ఆడియో రిలీజైంది. ఇదే వేదికపై థియేట్రికల్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.

నటసింహ బాలకృష్ణ మాట్లాడుతూ - ''సినిమా అన్నది పార్టీలకు అతీతం. అభిమానులకి అతీతం. ఒక మంచి ఆలోచనతో మంచి దైవ సంకల్పంతో ఈ సినిమా స్టార్ట్‌ చేశాం. పెద్ద వర్షం పడింది. వెంటనే ఆగిపోతుంది అన్నాను. ఇసుక వేస్తే రాలనంత జనం. అభిమానం అనే ఆనకట్టలు తెచ్చుకొని అభిమానులు తరలి వచ్చారు. ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. మ్యూజిక్‌ హిట్‌ అయితే సినిమా సగం హిట్‌ అయినట్లే అని నిర్ధారణతో వుంది. ఈ సినిమాకి అనూప్‌ అద్భుతంగా మ్యూజిక్‌ చేశాడు. మనకున్న వారిలో మంచి సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ ఒకరు. ఆణిముత్యాల్లాంటి ఐదు పాటలకి మణిపూసల్లాంటి బాణీలు సమకూర్చారు. నా సినిమా ఎలా వుండాలో, ప్రేక్షకుల్ని, అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తారు. నన్ను ఎవరైనా నువ్‌ ఎవరు? అని అడిగితే భారతీయుడ్ని అని చెప్తాను. మళ్ళీ నువ్‌ ఎవరు? అని అడిగితే తెలుగువాడ్ని అని చెప్తాను. ఇంకోసారి నువ్‌ ఎవరు? అని అడిగితే.. నేను నందమూరి తారక రామారావు కొడుకుని అని చెప్తాను. మళ్ళీ మళ్ళీ అడిగితే.. నేను అన్నగారి అభిమానిని అని చెప్తాను. నా దృష్టిలో ఆ మహానుభావుడికి ఎవరూ సాటి లేరు. సమాజమే దేవాలయం. ప్రజలే దేవుళ్లు. నేను ఒక అర్భకుణ్ణి అన్న నినాదంతో నేను కూడా స్ఫూర్తి పొంది 1983 నుండి కూడా పార్టీకి సేవలు అందిస్తూ వచ్చాను. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లోకి వచ్చి నాన్నగారి స్ఫూర్తి ఆదేశంతో హిందుపురం నుండి పోటీ చేయడం జరిగింది. నన్ను అభిమానించి, ఆదరించి ప్రజలు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఎమ్మెల్యేగా నా ప్రజలకి సేవ చేసి వారి రుణం తీర్చుకుంటాను. నా చివరి రక్తపు బొట్టు వరకూ కూడా నా హిందుపురం ప్రజలకి నా జీవితం అంకితం చేస్తాను. ఎందుకంటే నాన్నగారు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం అది. అక్కడ అవసరాలు ఎన్నో కావాల్సినవి వున్నాయి. ఈ సినిమాకి భాస్కరభట్ల, చిన్నారాయణ అద్భుతమైన పాటలు రాశారు. ఒక పాట నేను పాడాను. అన్న నందమూరి తారక రామారావుగారి 'జీవిత చక్రం'లోని ఒక పాటని 'కంటిచూపు చెప్తోంది.. కొంటె నవ్వు చెప్తోంది ఓ పిల్లా' పాటని రీమిక్స్‌ చేయడం జరిగింది. ఈ సినిమాకి అన్నీ శుభసూచకంగా కలిసాయి. పూరి జగన్నాథ్‌గారి డైరెక్షన్‌లో ఎప్పుడో నేను సినిమా చెయ్యాలి. ఎన్టీ రామారావుగారి కొడుకుగా 100 సినిమాలు చేశాను. నాన్నగారి విషయంలోగానీ, నా విషయంలోగానీ క్యారెక్టర్‌, క్యారెక్టర్‌కి ఒక ప్రత్యేకత వుంటుంది అనేది అందరికీ తెల్సు. నటీనటుల నుండి కథకి తగ్గట్లుగా అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకోగల సమర్థుడు పూరి జగన్నాథ్‌ అని గొప్పగా, గర్వంగా చెప్పుకోవాల్సిన దర్శకుడు. పూరితో మొదటి సినిమా. ఇది 101వ సినిమా అయినా మళ్ళీ ఇది నా ఒకటో సినిమాతో సమానం. మళ్ళీ రీ లాంచింగ్‌ ఆఫ్‌ బాలకృష్ణ అవుతుంది ఈ సినిమా. రీ లాంచింగ్‌ అంటే నా దృష్టిలో ఫ్లాప్‌లు నుండి మళ్ళీ సినిమాల్లోకి వచ్చి ఆ సినిమాతో ఊపిరి పోసుకోవడం కాదు. నా విషయంలో రీ లాంచింగ్‌ అంటే దీనిలో నేను కనబడితే.. నే కలబడితే అరె అంతెందుకు నా కటౌట్‌ నిలబెడితే అదే 'పైసా వసూల్‌' 'పైసా వసూల్‌' అనేలా ఈ చిత్రం వుంటుంది. ఇది నా నూట ఒకటో సినిమా. మళ్ళీ నేను ఒక రీ లాంఛింగ్‌లాంటి సినిమా అవుతుంది. మా నిర్మాత ఆనందప్రసాద్‌ స్వస్థలం అయిన ఖమ్మంలో ప్రజల మధ్యలో ఈ ఫంక్షన్‌ చేయడం చాలా ఆనందంగా వుంది'' అన్నారు.

డైరెక్టర్‌ బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ''వర్షం పడుతున్నా.. అంగుళం కూడా కదలకుండా కూర్చొన్న మా బాలయ్యబాబు అభిమానులందరికీ హ్యాట్సాఫ్‌. పూరి జగన్నాథ్‌గారు తన హీరోల్లో వున్న హీరోయిజాన్ని అద్భుతంగా బయటికి తీస్తారు. దానికి ఎగ్జాంపుల్‌ 'పోకిరి', 'బుజ్జిగాడు'. ఆ తర్వాత ఇప్పుడు 'పైసా వసూల్‌'. నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది అన్నా.. ఒక్కసారి కమిట్‌ అయితే నా మాట నేనే వినను అన్నా.. ఇప్పుడు 'పైసా వసూల్‌'లో 'అన్నా నేను జంగిల్‌ బుక్‌ చూడలా.. అందులో పులి అచ్చం నాలాగే వుంటుంది అన్నా అంత పవర్‌ఫుల్‌ డైలాగులు రాయాలన్నా పూరి జగన్నాథ్‌గారే. పూరిగారి సినిమా అంటేనే సరదా సరదాగా వెళ్తూ.. ఎక్కడ? ఎప్పుడు లేపాలో అక్కడ లేపటమే ఆయనకున్న స్టామినా.. దమ్ము. 'పైసా వసూల్‌' ఒక మంచి సినిమా అయ్యి మళ్లీ తెలుగు స్క్రీన్‌ మీద ప్రేక్షకులు, అభిమానులతో క్లాప్స్‌ కొట్టించే సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. అనూప్‌ అద్భుతమైన సాంగ్స్‌ ఇచ్చారు. ఇంత మంచి సాంగ్స్‌ చేసిన అనూప్‌ని అభినందిస్తున్నాను. ఈ సినిమా సూపర్‌హిట్‌ అయి నిర్మాత ఆనంద్‌ప్రసాద్‌గారికి మరిన్ని లాభాలు రావాలి. నిర్మాతలందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి బాలయ్యబాబు'' అన్నారు.

ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ మాట్లాడుతూ - ''పూరి జగన్నాథ్‌ పక్కా మాస్‌ డైరెక్టర్‌. మన బాల్య పక్కా మాస్‌ హీరో. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా డెఫినెట్‌గా పెద్ద హిట్‌ అవుతుంది. పాటలన్నీ బాలయ్యబాబు విన్పించారు. పర్టిక్యులర్‌గా బాలయ్య పాడిన 'మామ ఏక్‌ పెగ్‌ లావో' పాటకి ఫ్యాన్స్‌ అంతా విజిల్స్‌, క్లాప్స్‌తో థియేటర్‌ దద్దరిల్లుతుంది. అంత అద్భుతంగా ఆ పాట వుంటుంది. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ అందరికీ భగవంతుని ఆశీర్వాదాలు వున్నాయి. ఇది ఖమ్మనైన ఖమ్మం. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్‌గారు అద్భుతంగా తీర్చిదిద్దారు. మాస్‌ హీరో, మాస్‌ డైరెక్టర్‌ కాంబినేషన్‌లో వస్తున్న 'పైసా వసూల్‌' చిత్రం బ్లాక్‌ బస్టర్‌ కాబోతుంది'' అన్నారు.

ప్రముఖ దర్శకుడు క్రిష్‌ మాట్లాడుతూ - ''గౌతమిపుత్ర శాతకర్ణి'తో సెంచరీ పూర్తి చేసిన బాలయ్య 'పైసా వసూల్‌'తో డబుల్‌ సెంచరీకి శ్రీకారం చుట్టారు. పూరి జగన్నాథ్‌గారిలాంటి డైరెక్టర్‌, ఆనంద్‌ ప్రసాద్‌గారిలాంటి మంచి మేకర్‌కి బాలయ్యబాబు లాంటి హీరో దొరికితే ఆ సినిమా ఎంత డబ్బు కురిపిస్తుందో ఈ 'పైసా వసూల్‌' రుజువు చేస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా బిగ్‌ హిట్‌ అవుతుంది. పాటలన్నీ విన్నాను. 'మామ ఏక్‌ పెగ్‌ లావో' పాటతో బాలయ్య సింగర్‌గా టర్న్‌ అయ్యారు. కన్ను కన్ను కలిశాయి అనే గ్రేట్‌ పాట ఒకటి చాలా ఇష్టం నాకు. అనూప్‌ చాలా మంచి సాంగ్స్‌ ఇచ్చారు. శాతకర్ణి తర్వాత శ్రియ మళ్లీ బాలయ్యతో నటించింది. కైరా మస్కన్‌లు హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా బిగ్‌ హిట్‌ కావాలని ఈ 101వ సినిమా పెద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయి అందరికీ 'పైసా వసూల్‌' సినిమా అవుతుంది. పూరిగారు బిగ్గెస్ట్‌ హిట్‌ కొట్టబోతున్నారు. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ - ''ఎన్నో ఏళ్ల తర్వాత బాలయ్యబాబుతో వర్క్‌ చేసే అవకాశం వచ్చింది నాకు. ఆయనతో ఈ సినిమాకి వర్క్‌ చేశాక.. ఇంతకు ముందు బాలయ్యతో ఎందుకు వర్క్‌ చెయ్యలేదు. ఇంత లేట్‌ ఎందుకు అయ్యింది అని బాధపడ్డాను. అంత మంచి మనిషి బాలకృష్ణగారు. వెరీ స్ట్రైట్‌ ఫార్వార్డ్‌ ఆయన. ప్రేమొచ్చినా మొహం మీదే. కోపం వచ్చినా మొఖం మీదే. నాతో 101వ సినిమా చేశారు. ఆయన స్పీడు దూకుడు చూస్తుంటే ఇది ఆయన ఒకటో సినిమాలా అన్పించింది నాకు. ఫైట్స్‌ ఇరగదీశారు. 360 డిగ్రీస్‌లో కారు ఛేజింగ్‌ చేస్తారు. హీరోయిన్స్‌ని ఎత్తుకుని అమాంతం పరిగెడతారు. ఆయన వయసు మోక్షజ్ఞ కంటే కొంచెం ఎక్కువే అన్పిస్తుంది. ఆయనతో వర్క్‌ చెయ్యడం ఇట్స్‌ అమేజింగ్‌. నాతో ఆయన ఎప్పుడు ఏది మాట్లాడినా రెండు విషయాల గురించి మాట్లాడ్తారు. ఒకటి నాన్నగారు. రెండు సినిమా. ఈ రెండు విషయాలు గురించి తప్ప మిగతా విషయాల గురించి మాట్లాడరు. తల్లిదండ్రుల మీద గౌరవం, ప్రేమ వున్న కొడుకుని నేను ఎక్కడా చూడలేదు. అలాగే ఆయన హిందూపూర్‌ ప్రజల గురించి, క్యాన్సర్‌ హాస్పిటల్‌కి సంబంధించిన విషయాల గురించి ఫోన్‌లో మాట్లాడ్తారు. ఐ లవ్‌ బాలయ్య. 'పైసా వసూల్‌' సినిమా ఆయనతో తీయడం వెరీ హ్యాపీ. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎగురుకుంటూ రావాలని వుంది. షూటింగ్‌ అయిపోయిన దగ్గర్నుంచీ ఆయన లేక మా అందరికీ బోర్‌ కొడుతుంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్‌ వున్నారు. శ్రియతో ఫస్ట్‌ టైమ్‌ వర్క్‌ చేశాను. కైరాదత్‌, ముస్కాన్‌ బాగా యాక్ట్‌ చేశారు. అనూప్‌ ఫెంటాస్టిక్‌ పాటలు ఇచ్చాడు. ఇంతకుముందు పాటల కంటే మంచి సాంగ్స్‌ ఇచ్చాడు. భాస్కరభట్ల, పులగం చిన్నారాయణ మంచి లిరిక్స్‌ రాశారు. భవ్య క్రియేషన్స్‌ బేనర్‌లో ఫస్ట్‌ టైమ్‌ వర్క్‌ చేశాను. ఆనందప్రసాద్‌గారు వెరీ కూల్‌ అండ్‌ వెరీ సాఫ్ట్‌ పర్సన్‌. వెరీ డిసిప్లిన్‌ పర్సన్‌. మా అందర్నీ హెలికాఫ్టర్‌లో తీసుకొచ్చి ఇక్కడ గ్రాండ్‌గా ఫంక్షన్‌ చేశారు. ఖమ్మం, ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఎప్పటికీ మర్చిపోలేను. 'పైసా వసూల్‌' పెద్ద హిట్‌ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోకా కోలా పెప్సీ.. బాలయ్యబాబు సెక్సీ. లవ్‌ యు బాలయ్య'' అన్నారు.

నటుడు ఆలీ మాట్లాడుతూ - ''ఖమ్మం కళాకారుల గుమ్మం. 'సింహా' చూశాం. 'లెజెండ్‌' చూశాం. 'గౌతమిపుత్ర శాతకర్ణి' చూశాం. ఇప్పుడు 'పైసా వసూల్‌' చూడబోతున్నాం. నటసింహ బాలకృష్ణ డైలాగ్‌ చెప్పాలన్నా ఆయనే.. స్టెప్‌ వెయ్యాలన్నా ఆయనే. ఏదైనా క్రియేట్‌ చెయ్యాలన్నా బాలయ్య తర్వాతనే. టీజర్‌తో బాక్స్‌లు బద్దలు కొట్టారు. ఖచ్చితంగా ఇది 'పైసా వసూల్‌' ఫిల్మ్‌ అవుతుంది'' అన్నారు.

మాజీ ఎం.పి. నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ - ''మన ఖమ్మంలో 'పైసా వసూల్‌' ఆడియో జరగడం చాలా సంతోషంగా వుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావుగారు సినీ, రాజకీయం, సమాజ సేవలో అద్భుతంగా రాణించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. అదేవిధంగా బాలయ్య బాబు సినీ రంగంలో సింహంగా వున్నారు. రాజకీయ రంగంలో కూడా పెద్ద ఎత్తున రాణిస్తున్నారు. బసవ తారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ ద్వారా ప్రజలకి సేవ చేస్తున్నారు. అటువంటి బాలయ్య నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

నిర్మాత వి.ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ - ''స్వర్గీయ నటరత్న నందమూరి తారక రామారావుగారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, సినీ, రాజకీయ సేవా రంగంలో తనదైన శైలిలో నాలుగు దశాబ్దాలుగా అద్భుతంగా రాణిస్తూ తండ్రి ఆశయాలను నెరవేరుస్తున్నారు. ఖమ్మం జిల్లా వాసిగా బాలయ్యబాబులాంటి మంచి ప్రియ శిష్యుడు గల నటుడితో ఈ సినిమా తీసినందుకు గర్వపడుతున్నాను. మా భవ్య క్రియేషన్స్‌ బేనర్‌లో బాలయ్య బాబు మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. చాలా మంది బాలయ్యకి కోపం ఎక్కువ కదా! ఆయనతో మీరు సినిమా ఎలా చేస్తారు అని అడిగారు. కానీ ఆయన మాట ఇస్తే సత్యహరిశ్చంద్రుడు. ఎదుటివారు మాట తప్పితే విశ్వామిత్రుడు. ఈ ఒక్క నిజం తెల్సిన ఎవరైనా కూడా బాలయ్యతో సినిమా చెయ్యొచ్చు. ఆయన ఇష్టపడి పని చేస్తే ఎవరూ చూడని అద్భుతమైన విషయాలు చూపిస్తారు. అలాంటి మంచి వ్యక్తి. ఈ ఫంక్షన్‌ సక్సెస్‌ చేసిన అభిమానులకి, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌వారికి, అలాగే మినిష్టర్‌ తుమ్మల నాగేశ్వరరావుగారు ఆరోగ్యం బాగా లేకున్నా మాకు అన్ని వసతులు సమకూర్చారు. అందరికీ నా కృతజ్ఞతలు'' అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

 

 

 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved