pizza
RX 100 music launch
`ఆర్ ఎక్స్ 100` ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


29 June 2018
Hyderabad

KCW బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మిస్తున్న‌చిత్రం `RX 100`. ఈ చిత్రానికి అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి. An Incredible Love Story అనేది ఈ చిత్రానికి ఉప‌శీర్షిక‌. కార్తికేయ, పాయల్ రాజపుత్‌ హీరోహీరోయిన్లు. రావురమేష్, సింధూర పువ్వు రామ్‌కీ ఇందులో కీలక పాత్రధారులు. చైత‌న్ భ‌రద్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్క‌ర‌ణ హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

బిగ్ సీడీని రాజ్ కందుకూరి, హ‌వీశ్ ఆవిష్క‌రించారు. ఆడియో సీడీల‌ను హ‌వీశ్ విడుద‌ల చేయ‌గా.. తొలి సీడీని రాజ్ కందుకూరి అందుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో...

రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ``ఆర్ ఎక్స్ 100` అనే టైటిల్ ఎట్రాక్టివ్ టైటిల్‌..నాకు ద‌గ్గ‌ర సంబంధం ఉంది. ఎందుకంటే నేను ఆటోమొబైల్ ఫ్రీక్‌ని. చ‌దువ‌కునే రోజుల్లో ఆర్ ఎక్స్ 100 బైక్‌ని ఎక్కువ‌గా వాడేవాడిని. ఇప్పుడున్న హీరోలంద‌రూ చాలా బాగా బిజీగా ఉంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో మ‌న‌కు హీరోలు అవ‌సరం. కార్తికేయ‌లాంటి హీరోలు ఇండ‌స్ట్రీలోకి రావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. ఇదొక ఎన‌ర్జిటిక్ ఫిలిమ్‌. కార్తికేయ క‌చ్చితంగా రాకింగ్ ప‌ర్స‌న్ అవుతాడు. విజువ‌ల్‌గా అజ‌య్ భూప‌తికి మంచి నాలెడ్జ్ ఉంది. అందుక‌నే మంచి విజువ‌ల్స్‌ను రాబ‌ట్టుకున్నాడు. త‌నకి అద్భుత‌మైన క్లారిటీ ఉంది. నిర్మాత‌ల‌ను అభినందిస్తున్నాను`` అన్నారు.

సిరాశ్రీ మాట్లాడుతూ - ``నేను కూడా ఈ సినిమాలో పాట రాశాను. శ్రీమ‌ణి, నేను, చైత‌న్య‌ప్ర‌సాద్‌, చైత‌న్య‌వ‌ర్మ‌గారు పాట‌లు రాశాం. అశోక్ రెడ్డిగారికి చైత‌న్య‌క‌ర‌మైన‌, శ్రీక‌ర‌మైన ఫలితాన్ని సినిమా అందివ్వాల‌ని కోరుకుంటున్నాను. అజ‌య్ భూప‌తి స‌హ‌జ ద‌ర్శ‌కుడు. రామ్‌గోపాల్ వ‌ర్మ‌గారితో త‌ను వ‌ర్క్ చేస్తున్న‌ప్ప‌టి నుండి ప‌రిచ‌యం ఉంది. చైతన్ భ‌ర‌ద్వాజ్ సంగీతం చాలా మంచి సంగీతం అందించారు. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

నిర్మాత సురేశ్ రెడ్డి మాట్లాడుతూ - ``ఒక‌ప్పుడు ఆర్ ఎక్స్ 100 వెహిక‌ల్‌ను అంద‌రూ ఉప‌యోగించిన వాళ్లే. ఇప్పుడు యూత్ అంద‌రూ ఈ సినిమాను చూడ‌టానికి చాలా ఆస‌క్తిగా ఉన్నారు. హీరో కార్తికేయ‌కు చాలా మంచి భ‌విష్య‌త్ ఉంది. టాలీవుడ్‌కి మంచి యాక్ట‌ర్ దొరికిన‌ట్టు అయ్యింది. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.

సుధీర్ వ‌ర్మ మాట్లాడుతూ - ``ట్రైల‌ర్ చూడ‌గానే న‌చ్చింది. వెంట‌నే ట్వీట్ చేశాను. అప్పుడు నాకు అజ‌య్ నాకు ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమా గురించి విడుద‌లైన ప్ర‌తి పోస్ట‌ర్‌, ట్రైల‌ర్ అన్నీ సూప‌ర్బ్‌గా ఉన్నాయి. సినిమా ఇంకా బావుంటుంద‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్ యూనిట్‌కి అభినంద‌న‌లు`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ చైత‌న్ భ‌ర‌ద్వాజ్ మాట్లాడుతూ - ``ఈ మూవీ చేయ‌డం మంచి ఎక్స్‌పీరియెన్స్‌. ఫ్రెండ్లీగా మూవీ ఎంజాయ్ చేశాను. అజ‌య్ భూప‌తిగారు ప్ర‌తీ సీన్‌ను ఎక్స్‌ప్లెయిన్ చేసి సినిమాను నెరేట్ చేశారు. అందుకే మంచి మ్యూజిక్ చేశాం. టీమ్ క‌ష్ట‌ప‌డి మంచి సినిమా చేశామ‌ని అనుకుంటున్నాను. అశోక్‌గారు న‌న్ను న‌మ్మి నాపై న‌మ్మ‌కంతో అవకాశం ఇచ్చారు. అంద‌రికీ థాంక్యూ`` అన్నారు.

రాంకీ మాట్లాడుతూ - ``మంచి ప్యాకేజ్‌డ్ మూవీ. అజ‌య్ భూప‌తి, నిర్మాత అశోక్‌గారి ఎఫర్టే ఈ సినిమా. అజ‌య్ 50 సినిమాల అనుభ‌వ‌మున్న ద‌ర్శ‌కుడిలా సినిమా చేశాడు. కార్తికేయ అద్భుత‌మైన పెర్‌ఫార్‌మెన్స్ చేశాడు. అలాగే పాయల్ చ‌క్క‌గా న‌టించింది. అశోక్‌గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు`` అన్నారు.

నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడుతూ - `` ఆర్ ఎక్స్ 100 ను నా భార్య నా లైఫ్‌లో ఫ‌స్ట్ గిఫ్ట్‌గా నాకు ఇచ్చింది. అజ‌య్‌గారు నాకు స్టోరీ చెప్పిన‌ప్పుడు నేను షాకయ్యాను. త‌ర్వాత గ్రేట్‌గా ఫీల‌య్యాను. ఈరోజు సినిమా అంతా పూర్త‌య్యింది. ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇప్పుడు అంద‌రూ ఆర్ ఎక్స్ 100 గురించి మాట్లాడుతుండ‌టం గ‌ర్వంగా అనిపిస్తుంది. ఇంత రెస్పాన్స్ వ‌స్తుంద‌ని అనుకోలేదు. నేను, కార్తీ క‌లిసి ఈ క‌థ‌ను విన్నాం. ఆరోజు స్టోరీని ఎలా నెరేట్ చేశారో ... అలాగే తెర‌కెక్కించారు. తండ్రి పాత్ర‌లో రాంకీగారు అద్భుతంగా న‌టించారు. విన‌గానే సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నారు. పాయ‌ల్‌కి తెలుగు ఇండ‌స్ట్రీలోకి స్వాగ‌తం. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ మంచి సంగీతం అందించారు. ఆర్ ఎక్స్ 100 బైక్ ఉన్న సౌండ్ ఎలా ఉంటుందో అలాగే కార్తికేయ‌లో అంత ఎన‌ర్జీతో న‌టించాడు. 7/ జి బృందావ‌న్ కాల‌నీ, సైర‌ట్‌, ప్రేమిస్తే సినిమాల్లో ఎంత కంటెంట్ ఉందో దానికి మించిన కంటెంట్ ఈ సినిమాలో ఉంటుంది. సినిమా చూసి నేను ఏడ్చేశాను. జూలై 12న సినిమా రిలీజ్ అవుతోంది. ఆ రోజు హిస్ట‌రీ రిపీట్ అవుతుంది`` అన్నారు. డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి మాట్లాడుతూ - ``నేను స్క్రిప్ట్ ప‌ట్టుకుని తిరుగుతున్న సంద‌ర్భంలో.. నాపై న‌మ్మ‌కంతో న‌న్ను క‌లిసిన తొలి వ్య‌క్తి చైత‌న్ భ‌ర‌ద్వాజ్‌.. త‌ర్వాత క్ర‌మంగా టీమ్ ఏర్ప‌డింఇ. చాలా హానెస్ట్‌గా చేసిన సినిమా. ఎవ‌రూ ఊహించని విధంగా ఈ సినిమా ఉంటుంది. నాలుగు రోజుల్లో మ‌రో ట్రైల‌ర్‌ని విడుద‌ల చేయ‌బోతున్నాను. హీరో క్యారెక్ట‌ర్‌ను బేస్ చేసుకుని ఈ సినిమాకు పేరు పెట్టాను. ఆర్ ఎక్స్ 100 అన‌గానే మ‌న‌కు ఓ యార‌గేంట్ ఫెలో గుర్తుకు వ‌స్తాడు. దాన్ని బేస్ చేసుకుని పెట్టిన టైటిల్‌. నా సినిమాలో హీరో యార‌గెంట్‌.. చాలా మందిని డిస్ట్ర‌బ్ చేసే క్యారెక్ట‌ర్‌. మా బాస్ వ‌ర్మ‌గారు, వెంక‌ట్ ప్ర‌భు, జై, సుధీర్ వ‌ర్మ‌, నితిన్‌గారు, రామ్‌చ‌ర‌ణ్‌గారు అంద‌రూ నా ట్రైల‌ర్‌ని చూసి అప్రిషియేట్ చేశారు. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది. ఏ తెలుగు సినిమాలో ఎత్తని తెలుగు పాయింట్ ఈ సినిమాలో చెబుతున్నాను. మ‌న నెటివిటీకి ద‌గ్గ‌ర‌గా ఉండే సినిమా. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు కూడా సినిమా న‌చ్చుతుంది`` అన్నారు.

హ‌వీశ్ మాట్లాడుతూ - ``ట్రైల‌ర్ ఎంత ఇన్‌టెన్స్‌గా ఉందో.. అజ‌య్‌గారు అంతే ఇన్‌టెన్స్‌గా ఉంటారు. ఎక్స్‌ట్రీమ్ టాలెంటెడ్ ప‌ర్స‌న్‌. నాకు అజ‌య్‌గారు ఈ క‌థ చెప్పారు. ఇన్‌టెన్స్ టు ది నెక్స్‌ట్ లెవ‌ల్ క‌థ ఇది. హీరో, హీరోయిన్ క‌థ అద్భుతంగా ఉంటాయి. కొత్త డైరెక్ట‌ర్ సినిమాలా కాకుండా ఎక్స్‌పీరియెన్స్‌డ్ డైరెక్ట‌ర్ మూవీలా ఉంటుంది. మంచి టెక్నిక‌ల్ టీమ్ కుదిరింది. రీ రికార్డింగ్‌, విజువ‌ల్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇండ‌స్ట్రీలో అంద‌రూ ట్రైల‌ర్‌ను అప్రిషియేట్ చేస్తున్నారు. సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌ని నేను గ్యారంటీగా చెబుతున్నాను`` అన్నారు.

కార్తికేయ మాట్లాడుతూ - ``మా మూవీ టీమ్‌లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ పెద్ద‌గా ప‌రిచ‌యాలు కూడా లేవు. ప్రారంభంలో కొంత మంది సినిమా గురించి భ‌య‌పెట్టారు. కానీ మాపై న‌మ్మ‌కంతో మేం ముందుకు వెళ్లిపోయాం. ఆత్రేయ పురంలో షూటింగ్ స్టార్ట్ చేశాం. మా వెనుక ఆత్రేయ‌పురం నిలబ‌డింది. ఫ‌స్ట్ లుక్‌, పోస్ట్‌, మోష‌న్ పోస్ట‌ర్‌, ట్రైల‌ర్ విడుద‌ల చేశాం. క్ర‌మంగా క్రేజ్ ఎనిమిది మిలియ‌న్‌కు చేరుకుంది. మా న‌మ్మ‌కం వంద‌రెట్లు పెర‌గ‌డానికి కార‌ణం ప్రేక్ష‌కులే. సినిమాలో మంచి కంటెంట్ ఉంది. సినిమా చూసి పెట్టిన డ‌బ్బులు వేస్ట్ అయ్యాయ‌ని ఎవ‌రైనా అంటే.. వారికి నేను డ‌బ్బులు వెన‌క్కి ఇచ్చేస్తా. ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఎవ‌రైనా సినిమా చూసి బాగాలేదు అనిపించి వాళ్ల పిల్ల‌ల్ని కొట్ట‌డానికి వ‌స్తే.. ఆ పిల్ల‌ల కోసం నేను త‌న్నులు తిన‌డానికి కూడా రెడీ.. ఎందుకంటే నేను అంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. జెన్యూన్ ఫీల్‌ని చూపించిన‌ప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు న‌చ్చ‌దు అని అనుకోను. నాకు మంచి సినిమా వ‌స్తే బావుంటుంద‌ని అనుకుంటున్న త‌రుణంలో అజ‌య్ భూప‌తిగారు ప‌రిచ‌యం అయ్యారు. నాకు హిట్ ఇవ్వ‌డం కాదు.. నాకు ఈ సినిమాతో రెస్పాక్ట్‌ను ఇవ్వ‌బోతున్నారు. సినిమాలో నేనున ఇంత బాగా యాక్ట్ చేస్తాన‌ని అనిపించేంత బాగా న‌టింప చేశారు. అజ‌య్‌గారు 24 గంట‌లు సినిమా గురించే ఆలోచిస్తుంటారు. ఆయ‌న నాకు ఇన్‌స్పిరేష‌న్‌. చాలా విష‌యాలు నేర్చుకున్నాను. భ‌విష్య‌త్‌లో అజ‌య్‌గారు నాతో సినిమా చేస్తార‌ని అనుకుంటున్నాను. ఇక కెమెరామెన్ రామిరెడ్డిగారు ప్ర‌తి సీన్‌ను అందంగా చూపించారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. చాలా పెద్ద సినిమా అవుతుంద‌ని మా యూనిట్ అంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. పాయ‌ల్ తెలుగు ఇండ‌స్ట్రీకి కంగనా ర‌నౌత్ అవుతుంది. క్యారెక్ట‌ర్‌ను అద్భుతంగా పొట్రేట్ చేసింది. అలాగే స‌పోర్ట్ చేసిన రాంకీగారు, రావు ర‌మేశ్‌గారు నుండి ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌. అశోక్‌రెడ్డిగారు మేకింగ్ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. ఆయ‌న ప‌డ్డ క‌ష్టానికి వెయ్యి రెట్ల ఫ‌లితం వ‌స్తుంద‌ని అనుకుంటున్నాను`` అన్నారు.


 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved