pizza
Sanjeevani music launch
`సంజీవ‌ని` ఆడియో విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

18 May 2018
Hyderabad

జి.నివాస్ ప్రోడ్యూస‌ర్ గా, ర‌వి వీడే ద‌ర్శ‌కుడి గా మ‌నోజ్ చంద్ర‌, అనురాగ్ దేవ్‌, శ్వేత ప్ర‌ధాన పాత్ర‌ల్లో అనేక‌మంది హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ దాదాపు రెండు సంవత్సరాల పాటు పని చేసి, మొట్టమొదటిసారిగా మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాలజీని సమ‌ర్థ‌వంతంగా వాడి,దాదాపు 1000 కి పైగా వి.ఎఫ్‌.ఎక్స్ షాట్స్ తో అత్యంత భారీగా నివాస్ క్రియేషన్స్ బ్యాన‌ర్ లో నిర్మించిన చిత్రం `సంజీవని`. శ్ర‌వణ్ కె.కె సంగీతం అందించిన ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం శుక్ర‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. కె.ఎం.రాధాకృష్ణన్‌ ఆడియో విడుద‌ల చేశారు. తొలి సీడీని వి.విజ‌యేంద్ర ప్ర‌సాద్ అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా...


వి.విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడ‌తూ - ``ఈ సినిమా చేసిన యూనిట్‌ను చూస్తే యంగ్ టీంగా అనిపిస్తుంది. ఆ క‌ష్టం, సాహ‌సం చూస్తుంటే థ్రిల్ ఫీల‌య్యాను. ఇలాంటి సినిమా తెలుగులో వ‌స్తున్నందుకు హ్యాపీగా పీల‌య్యాను.. అలాగే ఇలాంటి సినిమా చేయ‌లేక‌పోయినందుకు జెల‌సీగా కూడా ఫీల‌య్యా. సినిమా అద్భుత‌మైన విజ‌యం సాధిస్తుంది. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు`` అన్నారు.


రామ‌జోగ‌య్య శాస్త్రి మాట్లాడుతూ - ``శ్ర‌వ‌ణ్ మంచి సంగీత ద‌ర్శ‌కుడు. పాట‌లు, ఆర్‌.ఆర్ బాగా కుదిరాయి. టైటిల్ డిఫ‌రెంట్‌గా అనిపిస్తుంది. తెలుగు సినిమాకు ఇప్పుడు సువ‌ర్ణ‌కాలం న‌డుస్తుంది. ఇలాంటి త‌రుణంలో ఓ డిఫ‌రెంట్ సినిమా రావ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం`` అన్నారు.


కె.ఎం.రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ - ``హాలీవుడ్ మూవీకి ఏ మాత్రం త‌గ్గ‌కుండా క‌ష్ట‌ప‌డి, ఇష్ట‌ప‌డి తీసిన‌ట్టు క‌న‌ప‌డుతుంది. ద‌ర్శ‌కుడు ర‌వి నిజంగా అభినంద‌నీయుడు. సినిమాపై న‌మ్మ‌కంతో ప్యాష‌న్‌తో సినిమా చేసిన నిర్మాత జి.నివాస్‌ను అభినందిస్తున్నాను. శ్ర‌వ‌ణ్ అందించిన సంగీతం, నేప‌థ్య సంగీతం బావున్నాయి. కెమెరా వ‌ర్క్‌, వి.ఎఫ్‌.ఎక్స్ బావున్నాయి`` అన్నారు.


ర‌వి వీడే మాట్లాడుతూ - ``ప‌ర్వాతారోహ‌కుడు, అర్జున అవార్డు గ్రహీత అయిన శేఖ‌ర్‌బాబు బ‌చ్చేన‌ప‌ల్లి మా టీంతో అసోసియేట్ అయ్యి లొకేష‌న్స్ విషయంలో ఎంత‌గానో స‌పోర్ట్ అందించారు. ఆయ‌నకు ఈ సంద‌ర్భంగా నా థాంక్స్‌. ఇందులో న‌టించిన న‌టీన‌టులంద‌రికీ కొండ‌లెక్క‌డంలో ప‌దిరోజుల పాటు ట్ర‌యినింగ్ ఇప్పించాను. ప్ర‌తి లొకేష‌న్ వెళ్లిరావాలంటే నాలుగు గంట‌ల పాటు ట్రెక్కింగ్ చేయాలి. మూడు గంట‌ల పాటు జీప్‌లో ట్రావెల్ చేయాలి. ఇంత కష్ట‌ప‌డ్డ త‌ర్వాత యాక్టింగ్ చేయాలి. మూవీ వి.ఎఫ్‌.ఎక్స్ కోసం ఏడు స్టూడియోల్లో వ‌ర్క్ చేయించాం. కెన‌డాకు చెందిన హాలీవుడ్ టెక్నిషియ‌న్స్ మాకు ఫ్రీ లాన్స‌ర్స్‌గా స‌పోర్ట్ చేశారు. శ్ర‌వ‌ణ్ అద్భుత‌మైన సంగీతం అందించారు. హాలీవుడ్ మ్యూజిక్‌కి ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఉంటుంది. ఈ సినిమాకు శ్ర‌వ‌ణ్ అందించిన ఓఎస్‌టిని కూడా విడుద‌ల చేస్తాం. య‌తిరాజ్ సౌండ్ ఎఫెక్ట్స్ కోసం మూడు నెల‌లు పాటు క‌ష్ట‌ప‌డ్డారు. సౌండ్ ఎక్స‌లెంట్ అవార్డ్ వ‌చ్చింది. నివాస్‌గారు స‌పోర్ట్ లేక‌పోతే ఈ సినిమానే లేదు. డిఫ‌రెంట్ మూవీ చేద్దామ‌ని ఆలోచ‌న చేసి స‌మ‌యం తీసుకుని, మా యూనిట్ వెనుక నిల‌బ‌డి స‌హ‌కారం అందించారు`` అన్నారు.


మామిడిపల్లి హ‌రికృష్ణ మాట్లాడుతూ ``యువ‌కులంద‌రూ ఎంతో ప్యాష‌న్‌తో ప్రాణం పెట్టి ప‌నిచేసిన‌ట్టు క‌న‌ప‌డుతుంది. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో టర్నింగ్ పాయింట్‌గా, ట్రెండ్ సెట్టింగ్‌లా నిలిచ‌న సినిమాలన్నీ చిన్న సినిమాలే. ఈ సినిమా కూడా అలాంటి చిత్రాల కోవ‌లో నిల‌వాల‌ని కోరుకుంటున్నాను. సంగీతం, సినిమాటోగ్ర‌ఫీ చాలా బావున్నాయి`` అన్నారు.


శ్ర‌వ‌ణ్ మాట్లాడుతూ - ``సినిమాలో ఐదు సాంగ్స్ ఉన్నాయి. అన్నీ చ‌క్క‌గా కుదిరాయి. ఈ సినిమాలో కొత్త కొత్త క్రియేచ‌ర్స్ ఉన్నాయి. వాటికి త‌న మ్యూజిక్‌తో ప్రాణం పోసిన వ్య‌క్తి య‌తిరాజ్‌గారు. ద‌ర్శ‌కుడు ర‌విగారికి, నిర్మాత జి.నివాస్‌గారికి థాంక్స్‌`` అన్నారు.


ల‌క్ష్మిపిక్చ‌ర్స్ అధినేత బాపిరాజు గారు మాట్లాడుతూ.. ఈ స‌మ్మ‌ర్ లో ఎవెంజ‌ర్స్ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే.. ఆ రేంజి లో మా చిత్రం సంజీవిని వుంటుంది. పిల్ల‌లు , ఫ్యామిలి ఆడియ‌న్స్ అమితంగా ఇష్ట‌ప‌డే చిత్రం గా సంజీవిని వుంటుంది. ఈచిత్రాన్ని నేను చూశాను.ఇది హ‌లీవుడ్ చిత్రం అనుకున్నాం అంటూ ప్ర‌శంశ‌లు కురిపిస్తున్నారు. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప‌డిన క‌ష్టం టీజ‌ర్ లో క‌నిపిస్తుంది. త‌ప్ప‌కుండా ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధిస్తుంది`` అని అన్నారు



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved