pizza
Vajralu Kavala Nayana music launch
`వజ్రాలు కావాలా నాయనా!` ఆడియో విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

15 December 2016
Hyderaba
d

శ్రీపాద ఎంటర్ టైన్మెంట్ ప‌తాకంపై అనిల్ బురగాని హీరోగా నేహ‌దేశ్ పాండే, నిఖిత బిస్ట్ హీరోయిన్లుగా రాధాకృష్ణ దర్శకత్వంలో కిషోర్ కుమార్ కోట పై నిర్మించిన చిత్రం `వజ్రాలు కావాలా నాయనా` . ఈ చిత్ర ఆడియో వేడుక గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ వేడుక లో ప్రతాని రామకృష్ణ గౌడ్ , తుమ్మలపల్లి రామసత్యనారాయణ , సాయి వెంకట్ , దర్శకులు రాధాకృష్ణ , నిర్మాత కిషోర్ కుమార్ , సంగీత దర్శకులు జాన్ పొట్ల తదితరులు పాల్గొన్నారు. బిగ్ సిడి ఆడియో ప్ర‌తాని రామకృష్ణ గౌడ్ ఆవిష్కరించగా ......సీడీని సాయి వెంకట్ ఆవిష్కరించి తుమ్మలపల్లి రామసత్యనారాయణ కు తొలి సీడీ ని అందించారు.

ఈ సందర్బంగా హీరో అనిల్ బుర‌గాని మాట్లాడుతూ " ఆరు సంవత్సరాలుగా సినిమాలో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో నిర్మాత కోట కిషోర్ కుమార్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. నన్ను నమ్మి మంచి బడ్జెట్ తో ఈ సినిమా చేశారు. కిషోర్ గారు నాకు సినీ లైఫ్ నిచ్చారు. మొదటిసారి లొకేషన్ కి వెళ్ళినప్పుడు ఎంతో టెన్షన్ పడ్డాను కానీ నా టెన్షన్ అంతా పోగొట్టి కూల్ గా సినిమా చేసేలా నన్ను ఎంతో ప్రోత్సహించాడు దర్శకులు అంటూ కృతఙ్ఞతలు తెలిపాడు .

నిర్మాత కిషోర్ కుమార్ కొట మాట్లాడుతూ " కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వడానికే నేను ఈ బ్యానర్ ని స్థాపించాను . నేను రాసుకున్న కథ కు తగ్గట్లుగా నటీనటుల ఎంపిక చేశాము. 4 పాటలు కూడా అద్భుతంగా వచ్చాయని ఆ క్రెడిట్ అంతా సంగీత దర్శకులు జాన్ పోట్ల .... సాహిత్యం అందించిన సురేశ్ గంగుల , రవికిరణ్ లదే నని అన్నారు .

దర్శకులు రాధాకృష్ణ మాట్లాడుతూ " ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి సినిమా పై మక్కువతో వి ఎఫ్ ఎక్స్ లో చేరాను. అదే సమయంలో నిర్మాత కిషోర్ గారు పరిచయం అయ్యారు . అడగందే అమ్మ అన్నం పెట్టదు కానీ నేను డైరెక్షన్ ఛాన్స్ అడగకుండానే నన్ను డైరెక్టర్ ని చేసిన గట్స్ ఉన్న నిర్మాత మా కిషోర్ గారు. తప్పకుండా ఈ సినిమా మంచి హిట్ అవుతుందన్న నమ్మకం ఉందన్నారు.

ప్రతాని రామక్రిష్ణ గౌడ్ మాట్లాడుతూ...`` ఈ చిత్రం లోని సాంగ్స్ బాగున్నాయి, నటీనటులందరికి మంచి పేరు తీసుకువస్తుంది.ఈ చిత్రం విడుదలకు అన్ని సహాయసహకారాలు అందిస్తాను, నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు.

లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ దర్శకుడు మంచి కధతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.టైటిల్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది.సంగీత దర్శకుడు మంచి సంగీతాన్ని అంధించారు, నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలనికొరుకుంటున్నాను అన్నారు .

అనిల్ బూరగాని, నేహాదేశ్ పాండే, నిఖిత బిస్థ్, విజయ్ సాయి, చిట్టిబాబు, శివ,అశ్విని, కుందన, కోట కిషొర్ కుమార్, ప్రసాద్ నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.అమర్ కుమార్, అర్ట్: డేవిడ్, కొరియోగ్రఫీ: వేణు మాస్టర్, సంగీతం:జాన్ పోట్ల, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: శివప్రసాద్, పాటలు:సురేష్ గంగుల, రవికిరణ్, ఎడిటర్: రమారావు జె.పి., కధ, నిర్మాత: కిషొర్ కుమార్ కోట,కధనం, మాటలు, దర్శకత్వం: పి. రాధాక్రిష్ణ.​​

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved