pizza
Nandini Nursing Home Audio Success Meet
'నందిని నర్సింగ్‌ హోం' ఆడియో స‌క్సెస్ మీట్
You are at idlebrain.com > News > Functions
Follow Us

15 October 2016
Hyderaba
d

నవీన్ హీరోగా, నిత్య, శ్రావ్య హీరోయిన్లుగా న‌టించిన చిత్రం `నందిని న‌ర్సింగ్ హోమ్‌`. ఎస్‌.వి.సి.ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై పి.వి.గిరి దర్శకత్వంలో రూపొందింది. రాధాకిషోర్‌.జి, బిక్షమయ్య సంగం నిర్మాతలు. అచ్చు సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియో స‌క్సెస్ మీట్ హైద‌రాబాద్‌లో శ‌నివారం ఉద‌యం జ‌రిగింది.

నిర్మాత గిరి మాట్లాడుతూ ``అచ్చు చాలా మంచి సంగీతాన్నిచ్చారు. రెహ‌మాన్ చ‌క్క‌టి పాట‌లు రాశారు. పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది`` అని తెలిపారు.

అచ్చు మాట్లాడుతూ ``రీరికార్డింగ్ పూర్త‌యింది. డిఫ‌రెంట్ నెంబ‌ర్స్ కుదిరాయి. సినిమా చూశాను . చాలా బావుంది`` అని అన్నారు.

భిక్ష‌మ‌య్య మాట్లాడుతూ ``మా చిత్రాన్ని ఈ నెల 21న విడుద‌ల చేస్తున్నాం. సినిమా మొత్తం పూర్త‌యింది`` అని తెలిపారు.

దాశ‌ర‌థి శివేంద్ర మాట్లాడుతూ ``సినిమా బాగా వ‌చ్చింది`` అని తెలిపారు.

Glam galleries from the event

కార్తిక శ్రీనివాస్ మాట్లాడుతూ ``ఈ సినిమాలో పార్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది`` అని చెప్పారు.

రెహ‌మాన్ మాట్లాడుతూ ``ముందు ఓ పాట రాయ‌మ‌ని పిలిపించారు. అన్ని పాట‌లూ రాశాను. స‌ర‌దా ల‌వ్‌స్టోరీలో యూనిక్ పాయింట్ ఉంటుంది. అది మెప్పిస్తుంది. ఒక పాట‌ను శేఖ‌ర్ చంద్ర చేశారు`` అని చెప్పారు.

గిరి మాట్లాడుతూ ``ఆడియోకి మంచి స్పంద‌న వ‌స్తోంది. నేనా అనే పాట ఈ ఆల్బ‌మ్‌లో చాలా కీల‌కం. సినిమా మొత్తం ఆ పాట‌లో ఉంటుంది`` అని అన్నారు.

నిత్య‌, శ్రావ్య మాట్లాడుతూ ``ఈ సినిమాలో న‌టించ‌డం ఆనందంగా ఉంది. మంచి టీమ్‌తో ప‌నిచేశాం`` అని తెలిపారు.

న‌వీన్ మాట్లాడుతూ `` అచ్చు నాకు ఏడేళ్లుగా తెలుసు. ఇందులో వేరియేష‌న‌ల్ సాంగ్స్ ఇచ్చారు. ఈ సినిమాను ఈ నెల 21న విడుద‌ల చేస్తున్నాం`` అని అన్నారు.

నరేష్‌ మాట్లాడుతూ - ''నవీన్‌ ఎడిటర్‌ అయ్యి మంచి టెక్నిషియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా అత‌నికి హీరోగా మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఈ కథ వినగానే మంచి సినిమా అవుతుందని, ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే ఓకే చేశాం. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా మూవీ చేశారు.మంచి టీం ఈ సినిమాకు పనిచేశారు. అచ్చు మంచి మ్యూజిక్‌ ఇచ్చారు'' అన్నారు.

షకలక శంకర్‌, సప్తగిరి, వెన్నెలకిషోర్‌, జయప్రకాష్‌ రెడ్డి, జయప్రకాష్‌, సంజయ్‌ స్వరూప్‌ తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి పాటలు: రెహమాన్‌, మాటలు: పి.వి.గిరి, సురేష్‌ ఆరపాటి, కొరియోగ్రఫీ: విజయ్‌, సంగీతం: అచ్చు, ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఆర్ట్‌: ఎస్‌.హరిబాబు, నిర్మాతలు: రాధాకిషోర్‌.జి, బిక్షమయ్య సంగం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.వి.గిరి.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved