15 March 2017
Hyderabad
దర్శకుడు మారుతి సమర్పణలో యువ కథానాయకుడు చరణ్ తేజ్ హీరోగా , దర్శకుడిగా పరిచయం చేస్తూ మారుతి టాకీస్- సి.టి.ఎఫ్ సంస్థలు సంయుక్త నిర్మాణంలో శ్రీనివాస రావు , రజనీ కుమారి నిర్మిస్తున్న చిత్రం` ఆయుష్మాన్ భవ `. త్రినాథ్ రావు నక్కిన కథ అందించగా , పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రం కర్టన్ రైజర్ కార్యక్రమం ( మార్చి 15) న హైదరాబాద్ ఎన్ - కన్వెన్షన్ హాల్ లో సిని ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. మారుతి , పరుచూరి వెంకటేశ్వరరావు , నిర్మాతలు శ్రీనివాసరావు , రజనీ కుమారి, డూడ్లీ సినిమా టైటిల్ లోగోను ఆవిష్కరించారు. అనంతరం...
పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ `చరణ్ తేజ్ రెండేళ్లుగా పరిచయం. మంచి కమిట్ మెంట్ తో ఈ సినిమా తెరకెక్కించనున్నాడు. కథ కోసం రెండేళ్లు సమయం పట్టింది. పకడ్బందీ స్క్రిఫ్ట్ తో ఈ చిత్రం తెరక్కెకుతుంది. మారుతి అంటే గ్యారంటీగా సక్సెస్ ఉంటుంది . వెంకటేష్ , మహేష్ బాబు, రాంచరణ్ సినిమాలకు పనిచేశాం. వాళ్లంతా ఇప్పుడు పెద్ద హీరోలు అయ్యారు. చరణ్ తేజ్ కూడా భవిష్యత్తులో పెద్దస్టార్ అవుతాడు. ప్రపంచంలో జరుగుతున్న సామాజిక అంశాలకు దర్పణం పట్టేలా సినిమా ఉంటుంది` అన్నారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ ` చరణ్ తేజ్ ఎంతో పట్టుదల , సినిమా మీద ఫ్యాషన్ ఉన్నవ్యక్తి . డాక్టర్ అయినప్పటికి సినిమా మీదున్న ఇష్టంతో హీరో గా , డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఒక సంవత్సరం పాటు త్రినాథ్ , పరుచూరి బ్రదర్స్ ఎంతో ఎఫర్ట్ పెట్టి ఈ కథ సిద్దం చేశారు. తప్పకుండా ఈ సినిమా చరణ్ తేజ్ కి పెద్ద సక్సెస్ ని ఇస్తుంది ` అని అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన రజనీ కుమారి మాట్లాడుతూ - `` చరణ్ పట్టుదల ఉన్న వ్యక్తి . చిన్పప్పటి నుండి సినిమాలంటే అంటే ఫ్యాషన్. కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు . ఇంక ముందు కూడా అదే కష్టంతో మంచి సక్సెస్ లు అందుకుంటాడన్న నమ్మకం ఉంది`` అన్నారు.
దర్శక, హీరో చరణ్ తేజ్ మాట్లాడుతూ ` పక్కా ఎంటర్ టైనర్ మూవీ ఇది . తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది. ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభించి సినిమాని ఆగష్టు 11 న విడుదల చేస్తాం`` అన్నారు.
డూడ్లీ మాట్లాడుతూ `` దక్షినాదిన నా తొలి సినిమా ఇదే . హిందీలో చాలా చిత్రాలు చేశాను . తెలుగులో ఇంతమంచి కథ తో రూపొందుతున్న చిత్రంతో లాంచ్ అవడం ఆనందంగా ఉంది. వైవిధ్యమైన కథ ఈ సినిమాకి కుదిరింది` అని అన్నారు.
గీతాంజలి మాట్లాడుతూ `` ఈ చిత్రంలో చాలా మంచి పాత్ర పోషిస్తున్నాను . మంచి టీంతో రూపొందుతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను`` అని అన్నారు.
సంగత దర్శకులు మీట్ బ్రదర్స్ మాట్లాడుతూ `` తెలుగులో సినిమా చేయడం ఆనందంగా ఉంది. సినిమా కు మంచి బాణీలు అందిస్తాం. తప్పకుండా సినిమా పెద్ద హిట్ అవుతుంది` అని అన్నారు.