pizza
Buddareddy Palli Breaking News first look launch
`బుడ్డారెడ్డి ప‌ల్లి బ్రేకింగ్ న్యూస్‌` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

14 August 2016
Hyderaba
d

శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ సినిమా ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `బుడ్డారెడ్డి ప‌ల్లి బ్రేకింగ్ న్యూస్‌`. న‌ర‌సింహ నంది ద‌ర్శ‌కుడు. బూచేప‌ల్లి తిరుప‌తి రెడ్డి నిర్మాత‌. పి.య‌ల్‌.కె.రెడ్డి, పాశం వెంక‌టేశ్వ‌ర్లు, ర‌విబాబు, హ‌రిబాబు స‌హ నిర్మాత‌లు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, మేకింగ్ వీడియోల‌ను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మం బుధ‌వారం హైద‌రాబాద్‌లో జరిగింది. అభి, ఫ‌ణి, వ‌రుణ్‌, సందీప్తి ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమాలో మ‌హంతి, సిల్వ‌ర్ సురేశ్‌, కృష్ణ‌మూర్తి, శ్రీనివాస్‌, భ‌ర‌త్‌, శ్రీపాద న‌టించారు.

నర‌సింహ నంది మాట్లాడుతూ ``ఈ చిత్రంలో గేదె ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. గేదె ప‌ల్లెటూర్ల‌లో కుటుంబాల‌ను పోషించ‌డానికి చాలా కీల‌కం. కొడుకులాగా చూసుకుంటారు. అలాంటి కొడుకులాంటి గేదె యాక్సిడెంట్‌లో క‌ళ్ల ముందు చ‌నిపోతే, యాక్సిడెంట్ చేసిన వాల్ల‌కు శిక్ష ప‌డాలంటూ, బ‌ర్రె య‌జ‌మాని న్యాయం కోసం చేసే పోరాటమే ఈ చిత్రం. సుకు మంచి సంగీతాన్నిచ్చారు. నిర్మాత‌లు చాలా ఆస‌క్తిగా నిర్మించారు. ఇందులో మీడియా గురించి చెప్పాం. పాజిటివ్‌గా ఉంటుంది. డా.చ‌ల్లా భాగ్య‌ల‌క్ష్మిగారు మీడియా గురించి ఆ పాట‌ను రాశారు`` అని అన్నారు.

వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ``న‌ర‌సింహ నంది ఈ సినిమా గురించి చెప్ప‌గానే చాలా ఆనందంగా అనిపించింది. మంచి స‌బ్జెక్ట్ తో చేస్తున్న ఈ సినిమా త‌ప్ప‌కుండా హిట్ కావాలి`` అని అన్నారు.

స‌హ నిర్మాత‌లు మాట్లాడుతూ ``మా ద‌ర్శ‌కుడు మంచి పాయింట్‌తో తీశారు. క‌మ‌ర్షియాలిటీ కూడా ఉన్న సినిమా ఇది. అంద‌రినీ ఆలోచింప‌జేస్తుంది. మీడియా త‌ల‌చుకుంటే ఈ సినిమాను మంచి స్థానంలో నిల‌ప‌గ‌ల‌రని చెప్పే చిత్ర‌మిది`` అని తెలిపారు.

సంగీత ద‌ర్శ‌కుడు సుక్కు మాట్లాడుతూ ``మీడియా గురించి పాజిటివ్ చిత్ర‌మిది. మీడియా మీద పూర్తిస్థాయి పాట‌ను ఇందులో పెట్టాం. చ‌ల్లా భాగ్య‌ల‌క్ష్మి గారు చాలా బాగా రాశారు. న‌ర‌సింహ నంది తీసిన ప్ర‌తి సీనూ మెప్పిస్తుంది. రీరికార్డింగ్ చేసేట‌ప్పుడు ఈ సినిమా మ‌రో స్థాయిలో ఉన్న‌ట్టు అనిపించింది`` అని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో బ‌సిరెడ్డి, అభి, ఫ‌ణి, మ‌హంతి, సిల్వర్ సురేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved