pizza
Green Card first look launch
`గ్రీన్‌కార్డ్‌` ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

14 March 2017
Hyderaba
d

సింహ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ‌తృఘ్న రాయ‌పాటి(యు.ఎస్‌.ఎ),స్టెఫానీ(యు.ఎస్‌.ఎ), జోసెలిన్‌(యు.ఎస్‌.ఎ) తారాగ‌ణంగా ర‌మ్స్ (యు.ఎస్‌.ఎ) ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస్ గుప్తా(యు.ఎస్‌.ఎ), మోహ‌న్‌.ఆర్‌(యు.ఎస్‌.ఎ), న‌ర‌సింహ‌, నాగ‌శ్రీనివాస‌రెడ్డి నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం `గ్రీన్‌కార్డ్‌`. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌తిరావు, నిర్మాత‌లు శ్రీనివాస్ గుప్తా(యు.ఎస్‌.ఎ), మోహ‌న్‌.ఆర్‌(యు.ఎస్‌.ఎ), న‌ర‌సింహ‌, నాగ‌శ్రీనివాస‌రెడ్డి , ద‌ర్శ‌కుడు ర‌మ్స్‌, శ‌తృఘ్న రాయ‌పాటి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా...

సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌తిరావు మాట్లాడుతూ - ``ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఉన్న టాప్ హీరోలంద‌రూ వేరే పేర్ల‌తో ఉండేవారు. పేర్లు మార్చుకున్న త‌ర్వాత పెద్ద స్టార్స్ అయ్యారు. అలాగే ఈ సినిమాలో హీరో మోహ‌న‌కృష్ణ శృతృఘ్న రాయ‌పాటి ఇక‌పై సినిమాల్లో శతృఘ్న రాయ‌పాటిగా రాణించాల‌ని కోరుకంటున్నాను. అలాగే ద‌ర్శ‌కుడు ర‌మ‌ణారెడ్డిగారు కూడా అమెరికా వెళ్ళి ర‌మ్స్‌గా పేరు మార్చుకున్నారు. గ‌తంలో రియ‌ల్ స్టోరీ అనే సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ గ్రీన్ కార్డ్ సినిమా తొంబై శాతం అమెరికాలోనే చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంది. ఇక్క‌డ నుండి అమెరికాకు వెళ్ళే వారు గ్రీన్‌కార్డ్ కోసం ఎన్ని తిప్పులు ప‌డ‌తార‌నే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించ‌బ‌డింది. సినిమాలో నేను హీరో తండ్రి పాత్ర‌లో న‌టించాను. సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రిస్తార‌ని న‌మ్మ‌తున్నాను`` అన్నారు.

ద‌ర్శ‌కుడు ర‌మ్స్ మాట్లాడుతూ - ``వీసా తీసుకుని అమెరికా చేరుకున్న ఓ కుర్రాడి క‌థే గ్రీన్‌కార్డ్‌. గ‌త 15 సంవ‌త్స‌రాలుగా నేను అమెరికాలో గ‌మ‌నించిన ప‌రిస్థితుల‌ను ఆధారంగా చేసుకుని ఈ క‌థ‌ను వారి వారి పిల్ల‌ల‌ను అమెరికాకు పంపాల‌నుకునే త‌ల్లిదండ్రుల‌కు ఈ సినిమాను అంకితం చేస్తున్నాను. అక్క‌డ మ‌న పిల్ల‌లు ఎలా ఉన్నార‌నే విష‌యం చాలా మందికి తెలియ‌దు. అలాంటి విష‌యాల‌ను కూడా ఈ సినిమాలో చూపిస్తున్నాను. వారం ప‌దిరోజుల్లో ఆడియో విడుద‌ల చేసి, సినిమాను వీలైనంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాం`` అన్నారు.

హీరో శతృఘ్న రాయ‌పాటి మాట్లాడుతూ - ``క‌థ వినగానే చాలా న‌చ్చింది. డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లేతోసాగే చిత్ర‌మిది. అంద‌రూ క‌ల‌సి ఒక యూనిట్‌గా స‌ర‌దాగా చేసే సినిమా ఇది`` అన్నారు.

శ‌తృఘ్న రాయ‌పాటి(యు.ఎస్‌.ఎ),స్టెఫానీ(యు.ఎస్‌.ఎ), జోసెలిన్‌(యు.ఎస్‌.ఎ), రెబెకా(యు.ఎస్‌.ఎ), మిల్లి(యు.ఎస్‌.ఎ), స్వీటెన్ (యు.ఎస్‌.ఎ) త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః కు(యు.ఎస్‌.ఎ), హెన్నీ ప్రిన్స్‌, ప్ర‌ణ‌య్‌కుమార్‌, కెమెరాః న‌వీన్‌(యు.ఎస్‌.ఎ), నాగ‌శ్రీనివాస్‌రెడ్డి, ఎడిటింగ్ః మోహ‌న్‌, రామారావు, నిర్మాత‌లుః శ్రీనివాస్ గుప్తా(యు.ఎస్‌.ఎ), మోహ‌న్‌.ఆర్‌(యు.ఎస్‌.ఎ), న‌ర‌సింహ‌, నాగ‌శ్రీనివాస‌రెడ్డి, ద‌ర్శ‌క‌త్వంః ర‌మ్స్ (యు.ఎస్‌.ఎ).


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved