pizza
Jaya Janaki Nayaka logo launch
`జ‌య జాన‌కి నాయ‌క‌` టైటిల్ లోగో విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

16 June 2017
Hyderabad

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రానికి `జ‌య జాన‌కి నాయ‌క‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమా టైటిల్ లోగోను శుక్ర‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. బెల్లంకొండ శ్రీనివాస్ కు జంటగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్ర‌యూనిట్ టైటిల్ లోగోను ఆవిష్క‌రించారు.

శరత్‌కుమార్‌ మాట్లాడుతూ - ''అసలు బోయపాటి సినిమాకు ఎలాంటి టైటిల్‌ పెడతాడనే నాతో పాటు యూనిట్‌లో అందరికీ ఉండేది. 'జయ జానకి నాయక'అనే టైటిల్‌ చాలా బావుంది. మంచి యూనిట్‌తో పనిచేశాను. బోయపాటిగారు, జగపతిబాబుగారు, రకుల్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌ సహా అందరూ సినిమా కోసం చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు'' అన్నారు.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ - ''సినిమా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రన్‌ అవుతుంది. సినిమాలో మంచి లవ్‌స్టోరీ కూడా ఉంది. ఈ సినిమాలో నా పేరు జానకి. బోయపాటిగారితో రెండో సినిమా చేస్తున్నాను. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌లో కొత్త కోణాన్ని చూస్తారు. తను అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు'' అన్నారు.

Rakul Preet Singh Glam gallery from the event

జగపతిబాబు మాట్లాడుతూ - ''బోయపాటి శ్రీను ఏం చేసినా బ్లాక్‌బస్టర్‌. అందుకు నేనే ప్రత్యక్షసాక్షిని. నాకు సినిమాలు లేని సమయంలో నన్ను జితేంద్రగా పరిచయం చేసి నా రేంజ్‌నే మార్చేశారు. ఈ సినిమాకు కూడా రెండు, మూడు టైటిల్స్‌ పరిశీలనలోకి వచ్చినా శ్రీను తన ట్రెండ్‌కు భిన్నంగా టైటిల్‌ను 'జయ జానకి నాయక' అని నిర్ణయించారు. సినిమా 100 పర్సెంట్‌ ష్యూర్‌ షాట్‌ హిట్‌ అవుతుంది. సాయి పెర్‌ఫార్మెన్స్‌ చూశాక ఇండస్ట్రీలో మరో స్టార్‌పుట్టాడని అనుకున్నాను. నిర్మాత రవీందర్‌రెడ్డిగారు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను నిర్మించారు'' అన్నారు.

నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ - ''మూవీ స్టార్ట్‌ చేస్తున్నప్పుడే బోయపాటిగారికి ఏదీ కావాలో అదిస్తే సరిపోతుంది. సినిమా హిట్‌ అవుతుందనే, ఆయనకు ఏం కావాలో దాన్ని సమకూర్చాను. సినిమా టాకీ అంతా పూర్తయ్యింది. ఒక సాంగ్‌, మూడు రోజుల ప్యాచ్‌ వర్క్‌ మాత్రమే మిగిలి ఉంది. ప్యాచ్‌ వర్క్‌ను ఈ నెలలో పూర్తి చేస్తాం. వచ్చే నెల 11న సాంగ్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం. ఈ నెలాఖరున రీ రికార్డింగ్‌ను స్టార్ట్‌ చేస్తాం. వచ్చే నెల ప్రారంభంలో ఆడియో విడుదల చేస్తాం. ఆగస్ట్‌ 11న సినిమాను విడుదల చేస్తాం'' అన్నారు.

హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ మాట్లాడుతూ - ''అల్లుడు శీను విడుదలై సక్సెస్‌ ఆనందంలో ఉండగానే బోయపాటిగారు నాతో సినిమా చేస్తాననడం ఇంకా సంతోషాన్నిచ్చింది. అసలు బోయపాటిగారు నాలో ఏం చూసి సినిమా చేశారో నాకు ఇంకా తెలియలేదు. కానీ సినిమా పరంగా ఆయనిచ్చిన ఎనర్జీ, సపోర్ట్‌ నేను మరచిపోలేను. రవీందర్‌రెడ్డిగారు అన్‌ కాంప్రమైజ్‌డ్‌గా సినిమాను చేశారు. దేవిశ్రీప్రసాద్‌గారు ఎక్స్‌ట్రార్డినరీగా మ్యూజిక్‌ అందించారు. తన సంగీతంలో సినిమాకు ఆత్మనిచ్చారు. ఆగస్ట్‌ 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. సినిమా అందరి అంచనాలను మించి వంద రెట్లు కాదు, వెయ్యి రెట్లు బావుంటుంది'' అన్నారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ''ఇలాంటి టైటిల్‌ ఎన్నుకోవడానికి కారణం మంచి కథ. కథకు అనుగుణంగానే టైటిల్‌ పెట్టాను. సినిమాలో క్యూట్‌ లవ్‌స్టోరీ ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అన్ని ఎమోషన్స్‌ సినిమాలో ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు ఒకే వరుసలో కూర్చొని చూసేలా సినిమా ఉంటుంది. ఈ విషయాన్ని రేపు ప్రేక్షకులు కూడా అంగీకరిస్తారు'' అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved