పూర్ణ, అభినవ్ సర్ధార్, అభిమన్యుసింగ్, గీతాంజలి తదితరులు ప్రధాన తారాగణంగా డ్రీమ్ క్యాచర్స్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై పన్నా రాయల్ దర్శకత్వంలో అశోక్ మందా, రాజ్ దళవాయ్, టోనీ నిర్మిస్తున్న ఈ చిత్రం `రాక్షసి`.ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను లగడపాటి శ్రీధర్, టైటిల్ లోగోను రాజ్ కందుకూరి, పోస్టర్‌ను కె.సురేష్‌బాబు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పూర్ణ, రవివర్మ, దర్శకుడు పన్నా రాయల్, వినోద్ యాజమాన్య, అభిమన్యు సింగ్, షానీ, నిర్మాత అశోక్ మందా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా....
పూర్ణ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించాలని దర్శకుడు పన్నా రాయల్ చెప్పగానే ముందుగా ఆలోచించాను. అయితే స్క్రిప్ట్ వినగానే సినిమా చేయడానికి అంగీకరించాను. రాక్షసి సినిమాలో నేను రాక్షసి పాత్రలో కనపడను. మదర్ పాత్రలో చేయడం గొప్ప అనుభూతినిచ్చింది. కచ్చితంగా నా కెరీర్‌లో ఈ సినిమా మరో హిట్ మూవీ అవుతుంది. వినోద్ యాజమాన్య సంగీతం, కర్ణగారి సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద హైలెట్ అంశాలుగా నిలుస్తాయి`` అన్నారు.
దర్శకుడు పన్నా రాయల్ మాట్లాడుతూ - ``కాలింగ్ బెల్ సినిమా సమయంలోనే కాలింగ్ బెల్ 2 చేయాలనుకున్నాను. అయితే సీక్వెల్ చేసే సమయంలో టైటిల్‌ను రాక్షసి అని ఫిక్స్ చేశాం. నిర్మాతల సహకారంతోనే సినిమాను మంచి స్టాండర్స్‌లో చేయగలిగాను. సినిమా మంచి టెక్నికల్ ఎలిమెంట్స్‌తో అందరికీ నచ్చేలా ఉంటుంది`` అన్నారు.
షానీ మాట్లాడుతూ - ``సినిమా ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్ చేసే దాని కన్నా ఎక్కువగానే ఉంటుంది`` అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన అశోక్ మందా మాట్లాడుతూ - ``దర్శకుడు పన్నా రాయల్ చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాం. పన్నాగారు సినిమాను చక్కగా తెరకెక్కించారు`` అన్నారు.
Poorna Glam gallery from the event
అభిమన్యు సింగ్ మాట్లాడుతూ - ``సినిమాకు అందరూ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ థాంక్స్. రాక్షసి సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను`` అన్నారు.
లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ - ``అవును, రాజుగారి గది, జయమ్మునిశ్చయమ్మురా వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించిన పూర్ణ, రాక్షసి సినిమాలో యాక్ట్ చేయడం సినిమాకు ఎంతో ప్లస్ అవుతుంది. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ``ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అవుతుంది. వినోద్ యాజమాన్యగారు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కర్ణగారి సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. దర్శకుడు పన్నా నాకు కాలింగ్ బెల్ సినిమా నుండి మంచి పరిచయం ఈ సినిమా సక్సెస్‌తో తను ఇంకా బెస్ట్ డైరెక్టర్ అనిపించుకోవాలి`` అన్నారు.