సూరజ్, రవీంద్ర తేజ, సోనియా హీరో హీరోయిన్లుగా ముళ్ళగూరు లక్ష్మీ దేవి సమర్పణలో అనంత లక్ష్మి క్రియేషన్స్ బ్యానర్‌పై జి.ఎల్.బి.శ్రీనివాస్ దర్శకత్వంలో ముళ్ళగూరు అనంత రాముడు, మళ్ళగూరు రమేష్ నాయుడు నిర్మాతలుగా కొత్త చిత్రం శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఎమ్మెల్యే గాంధీ క్లాప్ కొట్టగా, విజయ్ చందర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఓం సాయిప్రకాష్ ముహుర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..
పోలూర్ ఘటికాచలం మాట్లాడుతూ - ``నిర్మాత ముళ్ళగూరు అనంత రాముడుగారు అనంతపురం జిల్లాకు చెందిన పెద్ద రైతు. ఉత్తమ రైతుగా రాష్ట్రపతి అవార్డు కూడా గెలుచుకున్నారు. అనంత లక్ష్మి ఇంజనీరింగ్ కాలేజీలను స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. ఆయన సినిమా రంగంలోకి రావాలనుకోవడం, ఆ సమయంలో నేను చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. మంచి కథ, కథ విన్నవారందరూ చాలా బావుందని అప్రిసియేట్ చేశారు. లవ్ సబ్జెక్ట్. ప్రేమ కంటే స్నేహం గొప్పదని చాటే చిత్రం`` అన్నారు.
జి.ఎల్.బి.శ్రీనివాస్ మాట్లాడుతూ - ``మంచి కథను తయారు చేసుకోవడానికి ఏడాది సమయం పట్టింది. సాంగ్స్ అన్ని రికార్డింగ్ పూర్తయ్యాయి. నిర్మాతగారు క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని మంచి సినమా చేయాలని అంటున్నారు. యూత్‌కు సంబంధించిన మంచి కథ. అందరికీ నచ్చే చిత్రంగా తెరకెక్కిస్తాం`` అన్నారు.
నిర్మాత ముళ్ళగూరు అనంత రాముడు మాట్లాడుతూ - ``నేను రైతుగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నాను. ఇంజనీరింగ్ కాలేజీలను స్థాపించి విద్యను అందిస్తున్నాను. ఇప్పటి వరకు నేను చేసిన అన్ని పనులు విజయవంతమయ్యాయి. తొలిసారి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఇక్కడ కూడా విజయం సాదిస్తాననే ధీమా ఉంది. ఘటికాచలంగారు మంచి కథను అందించారు. ప్రేమ, స్నేహంపై సబ్జెక్ట్ ఇది`` అన్నారు.
ఈ కార్యక్రమంలో ఓం సాయిప్రకాష్, విజయ్ చందర్, ధనరాజ్, హీరో హీరోయిన్లు పాల్గొన్నారు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు చిత్రయూనిట్‌ను అభినందించారు.