pizza
Amazing arts production no. 1 movie launch
అమేజింగ్ ఆర్ట్స్ చిత్రం ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

1 March 2017
Hyderaba
d

విశ్వ‌దేవ్ రాచ‌కొండ‌, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా అమేజింగ్ ఆర్ట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 గా కొత్త చిత్రం బుధ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోటి క్లాప్ కొట్ట‌గా, జెమిని కిర‌ణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి స‌న్నివేశానికి చంద్ర‌బోస్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోటి మాట్లాడుతూ - ``డైరెక్ట‌ర్ ప్ర‌దీప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా నాకు మంచి ప‌రిచ‌యం ఉంది. మంచి మ్యూజిక్‌ను అందించే ప్ర‌దీప్, ఇప్పుడు ఈ సినిమాతో ద‌ర్శ‌కుడుగా మారుతున్నాడు. ద‌ర్శ‌క‌త్వంలో కూడా ప్ర‌దీప్ త‌నెంటో ప్రూవ్ చేసుకుంటాడ‌నే న‌మ్మ‌కం ఉంది. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ కె.కె. మాట్లాడుతూ - ``క్లీన్ అండ్ క్యూట్ ల‌వ్‌స్టోరీ. పిట్ట‌గోడ హీరో విశ్వదేవ్ రాచ‌కొండ ఈ సినిమాలో యాక్ట్ చేయ‌డం ఆనందంగా ఉంది. సినిమాలో ఐదు పాట‌లుంటాయి. రేప‌టి నుండి సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ చిత్రీక‌రణ ప్రారంభం అవుతుంది. ఒక ఎన్నారై అమ్మాయి, ఇండియ‌న్ అబ్బాయి మ‌ధ్య న‌డిచే క్యూట్ ల‌వ్ స్టోరీ. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులు మా ప్ర‌య‌త్నాన్ని ఆద‌రిస్తార‌ని న‌మ్మ‌కంగా ఉన్నాం`` అన్నారు.

రావు ర‌మేష్‌, గౌతంరాజు, దువ్వాసి మోహ‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి కొరియోగ్ర‌ఫీః శేఖ‌ర్ వి.జె, ఆర్ట్ః నాగు.వై. ఎడిట‌ర్ః ఉపేంద్ర‌, పాట‌లుః చంద్ర‌బోస్‌, శ్రీమ‌ణి, డైరెక్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్ర‌ఫీః డి.ఆర్‌.వెంక‌ట్‌, నిర్మాతః అమేజింగ్ టీం, క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, సంగీతం, ద‌ర్శ‌క‌త్వంః ప్ర‌దీప్ కె.కె.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved