16 November 2017
Hyderabad
ఆలూరి క్రియేషన్స్ పతాకంపై వాయుతనయ్, శశి, దేవి ప్రసాద్ కీలక పాత్రల్లో మోహన్ రావిపాటి దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు నిర్మిస్తున్న చిత్రం `నేనే ముఖ్యమంత్రి`. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన ఎన్.శంకర్ కెమెరా స్విఛ్చాన్ చేయగా జీవిత రాజశేఖర్ క్లాప్ నిచ్చారు. తొలి సన్నివేశానికి తమ్ముడు సత్యం గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మోహన్ రావిపాటి మాట్లాడుతూ....`` కాంటెంపరరీ అంశాలతో పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. దేవిప్రసాద్, వాయు తనయ్, శశి, సుచిత్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రేపటి నుంచి షెడ్యూల్ ప్రారంభిస్తాం. 15 రోజుల పాటు హైదరాబాద్ లో ఉంటుంది. ఆ తర్వాత కందుకూరు, వైజాగ్ ప్రాంతాల్లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. 40 రోజుల్లో సినిమాను పూర్తి చేస్తాం`` అన్నారు.
నిర్మాత ఆలూరి సాంబశివరావు మాట్లాడుతూ...`` మా చిత్రం ద్వారా ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరినీ కించపరిచే విధంగా సినిమా ఉండదు. పబ్లిక్ పాయింట్ వ్యూలో కూడా సినిమాలో చర్చిస్తున్నాం. మా దర్శకుడు మంచి ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. ఇక మీదట కూడా మా బేనర్‌లో ఇలా వరుసగా సామాజిక, కుటుంబ కథా చిత్రాలు చేయాలన్న సంకల్పంతో ఉన్నాం`` అన్నారు.
వాయు తనయ్ మాట్లాడుతూ...``ఇది నా ఫస్ట్ ఫిలిం. నేనొక యువ నాయకుడుగా నటిస్తున్నా. నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు`` అన్నారు.
సంగీత దర్శకుడు ఫణి కళ్యాన్ మాట్లాడుతూ....``ఇందులో నాలుగు పాటలున్నాయి. సంగీతానికి ప్రాధాన్యం ఉన్న చిత్రం. నాతో దర్శకుడు మంచి బాణీలు చేయిస్తున్నారు`` అన్నారు.
దేవిప్రసాద్ మాట్లాడుతూ...``ఇందులో నేనొక కీలక పాత్రలో నటిస్తున్నా. కాన్సెప్ట్ ఇంట్రస్టింగ్ గా అనిపించి నటించడానికి ముందుకొచ్చా. దర్శకుడు మోహన్ రావిపాటి గారు రైటర్ కావడంతో చాలా కథ మంచి రాశారు. క్యారక్టర్స్ కూడా అద్భుతంగా డిజైన్ చేశారు. అభిరుచి గల దర్శక నిర్మాతలు కావడంతో ఒక మంచి ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారన్నారు.
నటి సుచిత్ర మాట్లాడుతూ....``ఇందులో నేనొక స్టార్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నా`` అన్నారు.
శశి మాట్లాడుతూ.....`` ఈ చిత్రంలో ఇంపార్టెంట్ క్యారక్టర్ చేస్తున్నా. అవకాశం కల్పించిన దర్శ క నిర్మాతలకు ధన్యవాదాలు`` అన్నారు.
వాయు తనయ్, శశి, దేవిప్రసాద్, నళిని కాంత్, రామరాజు, శుభలేఖ సుధాకర్ , సుచిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః ఫణి కళ్యాన్, కెమెరాఃకమలాకర్, రచన సహకారంః హిరణ్మయి-సత్య జేబి, నిర్మాతః ఆలూరి సాంబశివరావు, రచన-దర్శకత్వంః మోహన్ రావిపాటి.