12 March 2018
Hyderabad
Amaravati: Jana Sena president and popular film star sri Pavan Kalyan along with his wife Anna pawan kalyan laid the foundation stone for the construction of his residence-cum-personal office at Kaza village in the capital region of Amaravati on Monday.
The ritual for laying the foundation started at 8.26 am with Pavan Kalyan and his wife Anna performing the Homam and at 9.30 am the couple laid the foundation stone for the new home which would also serve as his personal office. After the ceremonial ritual, the couple was presented with new clothes.
The ceremony ended with the couple worshiping a sacred cow.
The house would be constructed in two-acre site which was purchased recently near Kaza toll gate on Kolkata-Chennai National Highway from where Pavan Kalyan would continue his political activities in future.
Later, Pavan Kalyan visited the ground near Nagarjuna University where public meeting would be held on March 14. He enquired the details of the arrangements with the senior leader Madasu Gangadharam who is looking after the programme.
అమరావతిలో నూతన గృహానికి శ్రీ పవన్‌కళ్యాణ్ దంపతుల భూమి పూజ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జనసేన అధినేత శ్రీపవన్‌కళ్యాణ్ నూతనంగా నిర్మించ తలపెట్టిన గృహానికి భూమి పూజ నిర్వహించారు.. శ్రీపవన్‌కళ్యాణ్, అన్నా పవన్‌కళ్యాణ్ దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం పూర్తి శాస్త్రోక్తంగా జరిగింది.. సోమవారం ఉదయం గం 8.26 నిమిషాలకు శ్రీ పవన్‌కళ్యాణ్ హోమం నిర్వహించడం ద్వారా పూజా కార్యక్రమం మొదలైంది.. అనంతరం ఉదయం గం 9.30 నిమిషాలకి శ్రీ పవన్‌కళ్యాణ్ దంపతులు ప్రధాన గృహానికి సంప్రదాయ బద్దంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి., పునాది రాయి వేశారు.. ఆ తర్వాత 9.45 నిమిషాలకి ప్రధాన గృహానికి ఈశాన్యంలో నిర్మించనున్న వ్యక్తిగత కార్యాలయానికి భూమి పూజ నిర్వహించారు.. పూర్తి సంప్రదాయబద్దంగా జరిగిన భూమి పూజ కార్యక్రమం అనంతరం శ్రీపవన్‌కళ్యాణ్ దంపతులకి నూతన వస్త్ర బహూకరణ జరిగింది.. చివరిగా శ్రీ పవన్‌కళ్యాణ్, అన్నా పవన్‌కళ్యాణ్ దంపతులు గోపూజా కార్యక్రమం నిర్వహించడంతో శంకుస్థాపన మహోత్సవం ముగిసింది..
ఖాజా టోల్ గేట్‌కి సమీపంలో జాతీయ రహదారి 5కి దగ్గర్లో శ్రీ పవన్‌కళ్యాణ్ ఇటీవల కొనుగోలు చేసిన రెండెకరాల విస్తీర్ణంలో ఈ గృహం నిర్మాణం కాబోతుంది.. రానున్న రోజుల్లో శ్రీ పవన్‌కళ్యాణ్ ఇక్కడి నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తారు..
గుంటూరు సభా స్థలిని సందర్శించిన శ్రీపవన్‌కళ్యాణ్
నూతన గృహానికి భూమి పూజ అనంతరం మార్చ్ 14న నిర్వహించ తలపెట్టిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనున్న గ్రౌండ్ వద్ద ఏర్పాట్లను శ్రీ పవన్‌కళ్యాణ్ పరిశీలించారు.. ప్రధాన వేదికపై నుంచి బారీకేడింగ్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు.. సభకి సంబంధించి పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న శ్రీ మాదాసు గంగాధరం గారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు..