pizza
Anaganaga Oka Oollo poster launch
`అన‌గ‌న‌గా ఒక ఊళ్ళో` ఫ‌స్ట్ లుక్ లాంచ్‌!
You are at idlebrain.com > News > Functions
Follow Us

6 July 2017
Hyderabad

చంద్ర బాలాజీ ఫిలింస్ ప‌తాకంపై అశోక్ కుమార్‌, ప్రియావ‌ర్మ జంట‌గా సాయి కృష్ణ కె.వి ద‌ర్శ‌క‌త్వంలో కె.చంద్ర‌రావు నిర్మిస్తోన్న చిత్రం `అన‌గ‌న‌గా ఒక ఊళ్లో`. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ గురువారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. న‌టుడు బెన‌ర్జీ చేతుల మీదుగా ఫ‌స్ట్ లుక్ ఆవిష్క‌రణ జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా న‌టుడు బెన‌ర్జీ మాట్లాడుతూ...``ఈ చిత్రంలో నేను రెగ్యుల‌ర్‌గా చేసే పాత్ర కాకుండా డిఫ‌రెంట్ పాత్ర‌లో న‌టించా. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సినిమా ఆస‌క్తి క‌రంగా ఉంటుంది. ల‌వ్‌, ఫ్యామిలీ రిలేష‌న్స్ , ఎమోష‌న్స్ ఇలా ఆల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను ద‌ర్శ‌కుడు కుటుంబం అంతా క‌లిసి చూసే విధంగా తెర‌కెక్కించాడు. సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకునేలా ఉంటాయి. నిర్మాత‌లు కూడా క‌థకు త‌గ్గ‌ట్టుగా ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాను నిర్మించారు. టీమ్ అంతా కూడా మంచి స‌హ‌కారాన్ని అందించార‌న్నారు.

హీరో అశోక్ కుమార్ మాట్లాడుతూ...``నాకిది తొలి సినిమా. ఈ చిత్రంలో నటించే అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థ్యాంక్స్ `` అన్నారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ...``అంత‌ర్వేదిలో సినిమా షూటింగ్ ప్రారంభించాం. 45 రోజుల పాటు రాజోలు ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ప‌ల్లేటూరి వాతావ‌ర‌ణంలో జ‌రిగే క‌థ ఇది. రాజ‌మౌళి గారి లాంటి పెద్ద ద‌ర్శ‌కుల వ‌ద్ద మా ద‌ర్శ‌కుడు సాయికృష్ణ ప‌ని చేయ‌డంతో తొలి సినిమా అయినా అనుభవం ఉన్న ద‌ర్శ‌కుడిలా సినిమా తీసాడు. కుటుంబం అంతా క‌లిసి చూసే విధంగా ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది. బెన‌ర్జీ గారు, సుమ‌న్ గారు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇందులో ఐదు పాట‌లు, మూడు ఫైట్స్ ఉన్నాయి. ప్ర‌స్తుతం సినిమా డ‌బ్బింగ్ ద‌శ‌లో ఉంది. సినిమా స‌కాలంలో పూర్త‌వ‌డానికి స‌హ‌క‌రించిన మా యూనిట్ స‌భ్యులంద‌రికీ నా ధ‌న్య‌వాదాలు`` అన్నారు.

ద‌ర్శ‌కుడు సాయికృష్ణ కె.వి. మాట్లాడుతూ...``2002లో సినీ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చాను. రాజ‌మౌళిగారి వ‌ద్ద నాలుగేళ్లు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేశాను. డైర‌క్ష‌న్‌లోని మెల‌కువ‌లు ఆయ‌న ద‌గ్గ‌రే నేర్చుకున్నాను. మా నిర్మాత‌లు క‌థ విన్న‌వెంట‌నే విప‌రీతంగా న‌చ్చి సినిమా చేయ‌డానికి ముందుకొచ్చారు. ఏ విష‌యంలో రాజీ ప‌డ‌కుండా సినిమా క్వాలిటీగా తీయ‌డానికి స‌హ‌క‌రించారు. మా ఆర్టిస్ట్స్, టెక్నీషియ‌న్స్ అంద‌రూ పూర్తి స‌హ‌కారాన్ని అందించారు. ఇక క‌థ విష‌యానికొస్తే...జులాయిగా తిరిగే ఓ కుర్రాడు అత్యుత‌న్న‌త స్థాయికి ఎలా ఎదిగాడు అన్న‌దే చిత్ర క‌థాంశం. ప్ర‌తి ఒక్కిరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది స‌రైన స‌మ‌యం వ‌చ్చినప్పుడు క‌చ్చితంగా బ‌య‌ట‌ప‌డుతుంద‌నే అంశాన్ని మా చిత్రం ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. త్వ‌ర‌లో ఆడియో విడుద‌ల చేస్తాం`` అన్నారు.

సుమ‌న్‌, బెన‌ర్జీ, పృథ్వీ, మ‌హేష్‌, పార్వ‌తి, క‌ల్ప‌ల‌త‌, ర‌మాదేవి, క‌ల్కీమిత్ర‌, రాజ‌శేఖ‌ర్ రెడ్డి, అర్జున్ అడ్డూరి, మోతీ చంద్ర‌, జ‌బ‌ర్ద‌స్త్ రాము త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మాట‌లుఃక‌మ‌ల్ విని; కెమెరాఃఎస్ రాజ‌శేఖ‌ర్‌; స‌ంగీతంః వినోద్ యాజ‌మాన్య‌; పాట‌లుఃక‌రుణాక‌ర్; ర‌జ‌నీ గంగాధ‌ర్, రామ్ ల‌క్ష్మ‌ణ్‌; డాన్స్ః చంద్ర‌కిర‌ణ్‌, బాలు, ఎడిట‌ర్ఃనంద‌మూరి హ‌రి; స‌హ నిర్మాత‌లుః డి.వి.ఆర్‌, శ్రీ తేజ్ మ‌నోజ్ పాలిక‌, బాలాజీ గెద్దాడ‌,క‌మల్ విని; నిర్మాతః కె.చంద్ర‌రావు; క‌థ‌-స్ర్కీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వంఃసాయికృష్ణ . కె.వి



 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved