pizza
Achari America Yatra pre release function
'ఆచారి అమెరికా యాత్ర' ప్రీ రిలీజ్‌ వేడుక
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

20 January 2018
Hyderabad

మంచు విష్ణు, ప్రగ్యాజైశ్వాల్‌ జంటగా నటించిన చిత్రం 'ఆచారి అమెరికా యాత్ర'. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. ఈ సినిమా ముందస్తు విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో దర్శకుడు కె.రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్‌, మంచు విష్ణు, బ్రహ్మానందం, జి.నాగేశ్వరరెడ్డి, సి.కల్యాణ్‌, ప్రగ్యాజైశ్వాల్‌, తదితరులు పాల్గొన్నారు.

కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ''దర్శకుడు నాగేశ్వరరెడ్డి అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌. సినిమా పెద్ద విజయాన్ని సాధించి మంచి పేరు తెచ్చి పెట్టాలి. ఈ సినిమా స్టిల్స్‌ చూస్తుంటే.. నాకు నేను, మోహన్‌బాబు, బ్రహ్మానందం చేసిన అల్లరిమొగుడు సినిమా గుర్తుకు వస్తుంది. చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ - ''కుమార్‌చౌదరిగారి కోసం ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఢీ సినిమాలో బ్రహ్మానందం, విష్ణు కామెడీ ఎలాగైతే పండిందో అలాగే ఈ సినిమాలో అంతకన్నా ఎంటైర్‌ చేస్తారని అర్థమవుతుంది. విష్ణుతో నాగేశ్వరరెడ్డి చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్‌ అయ్యాయి. ఈ సినిమా వాటన్నింటికంటే పెద్ద హిట్‌ అవుతుందని భావిస్తున్నాను'' అన్నారు.

సి.కల్యాణ్‌ మాట్లాడుతూ - ''ఈ ఆచారి అమెరికా యాత్ర విడుదల తర్వాత సక్సెస్‌ యాత్రను కొనసాగిస్తుంది. డెఫనెట్‌గా ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది'' అన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ - ''సినిమా ప్రారంభం నుండి నేటి వరకు ఎన్నో అడ్డంకులను ఓర్చి కుమార్‌చౌదరిగారు సినిమాను పూర్తి చేశారు. ఇదొక సరదా యాత్రగా పూర్తి కావడానికి దర్శకుడు నాగేశ్వరరెడ్డిగారే కారణం. అందరి నుండి అద్భుతమైన పెర్ఫామెన్స్‌ను రాబట్టుకున్నారు. విష్ణు సినిమాలో కామెడీ టైమింగ్‌ కోసం చాలా కష్టపడ్డారు. అందరూ అద్భుతంగా నటించారు'' అన్నారు.

ఎం.ఎల్‌.కుమార్‌ చౌదరి మాట్లాడుతూ - ''సినిమాను అడగ్గానే ఒప్పుకున్నందుకు విష్ణు, బ్రహ్మానందంగారికి థాంక్స్‌. ఈ చిత్రం ద్వారా మేం ఎవరినీ కించపరచలేదు. నేను నిర్మాతగా 12 సినిమాలు చేశాను. ఇప్పుడు ఈ సినిమాను మా అబ్బాయి, అమ్మాయి నిర్మించారు. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. ఢీ, దేనికైనారెఢీ చిత్రాలను మించి విజయం సాధించాలని ఈ సినిమాను నిర్మించాం'' అన్నారు.

జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ - ''నేను, విష్ణు చేసిన దేనికైనా రెడీ సినిమా విడుదల తర్వాత కొన్ని సమస్యలను ఎదుర్కొంది. మళ్లీ బ్రాహ్మణులపై సినిమా అంటే వద్దనే అనుకున్నాను. కానీ మంచి టీం కుదరడంతో సినిమా చేశాను. ఢీ, దేనికైనా రెడీ సినిమాలు తర్వాత విష్ణు, నేను కలిసి చేసిన సినిమా. తమన్‌ మంచి సంగీతాన్ని, నేపథ్య సంగతాన్ని అందించారు'' అన్నారు.

ప్రగ్యా జైశ్వాల్‌ మాట్లాడుతూ - ''గ్రేట్‌ జర్నీ, వండర్‌ఫుల్‌ ఎక్స్‌పీరియెన్స్‌. సినిమాను చూసే ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు'' అన్నారు.

మంచు విష్ణు మాట్లాడుతూ - ''ఈ సినిమా రూపొందడానికి ముఖ్య కారణం పి.డి.ప్రసాద్‌గారే. బ్రిలియంట్‌ స్క్రిప్ట్‌. నాగేశ్వరరెడ్డిగారితో మంచి అనుబంధం ఉంది. నిర్మాతలైన కీర్తి, కిట్టులకు ఆల్‌ ది బెస్ట్‌. భవిష్యత్‌లో ఇద్దరూ పెద్ద నిర్మాతలుగా ఎదుగుతారు. సినిమా కోసం పనిచేసిన అందరికీ థాంక్స్‌. అయితే నేనను సారీ కూడా చెప్పాలి. అమ్మనాన్నలకు, అభిమానులకు, వినికి థాంక్స్‌. మలేషియాలో యాక్సిడెంట్‌ జరగడానికి కారణం నేనే. నాకు జిమ్నాస్టిక్స్‌ అంటే ఇష్టం. స్టంట్స్‌లో ఏడాదిపాటు ట్రైనింగ్‌ కూడా తీసుకున్నాను. అంతా తెలిసి కూడా రిస్క్‌ చేశాను. స్టంట్‌ మేన్‌కి ఎక్స్‌పీరియెన్స్‌ లేదు. ఏదో తేడా కొడుతుందనిపించింది. నాగేశ్వరరెడ్డిగారు ఇదొక్కటే బాబు చేసేయండి..ఏం కాదని అన్నారు. ఆరోజు హీరోగా నేను చేయనని ఉంటే కుమార్‌ చౌదరిగారికి కోటి రూపాయలు మిగిలేవి. నా వల్ల 45 సినిమా ఆలస్యమైంది. ఆ మేకింగ్‌ వీడియో విడుదల చేస్తాం. సినిమా అద్భుతంగా వచ్చింది'' అన్నారు.



 
Photo Gallery (photos by G Narasaiah)
 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved