pizza
Arjun Reddy pre release function
'అర్జున్‌ రెడ్డి' ప్రీ రిలీజ్‌ వేడుక
You are at idlebrain.com > News > Functions
Follow Us

21 August 2017
Hyderaba
d

విజయ్‌దేవర కొండ, షాలిని హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'అర్జున్‌ రెడ్డి'. సందీప్‌రెడ్డి వంగా దర్శకుడు. ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మాత. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో బిగ్‌ సీడీ, ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా...

నందినీ రెడ్డి మాట్లాడుతూ - ''సినిమా రిలీజ్‌కు ముందే కల్ట్‌ మూవీ అయ్యింది. సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుందని భావిస్తున్నాను. యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

క్రాంతి మాధవ్‌ మాట్లాడుతూ - ''దర్శకుడు సందీప్‌ నాకు మంచి మిత్రుడు. సినిమా ట్రైలర్‌ను చూస్తుంటే కొత్త దర్శకుడు చేసినట్లు అనిపించలేదు. నేను సినిమా చూశాను. సినిమా చాలా అద్భుతంగా ఉంది. సినిమాలో ఎమోషనల్‌ పార్ట్‌ హై రేంజ్‌లో ఉంటుంది. వండర్‌ఫుల్‌ లవ్‌స్టోరీ. సందీప్‌, ప్రణయ్‌, విజయ్‌ దేవరకొండ, షాలిని తదితరులకు అభినందనలు'' అన్నారు.

స్వప్నదత్‌ మాట్లాడుతూ - ''విజయ్‌ దేవరకొండ మా హీరో. సందీప్‌ స్టోరీ చెప్పినప్పుడు నాకు నచ్చింది. నాకు సినిమాను నిర్మించేంత ధైర్యం లేకపోయినా, సినిమా డెఫనెట్‌గా హిట్‌ అవుతుందనే నమ్మకం కలిగింది. నాకెంతో గర్వంగా ఉంది. యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ - ''సినిమాలో చాలా ఓరిజినాలిటీ కనపడుతుంది. ఫస్ట్‌డే ఫస్ట్‌ షో సినిమాను చూస్తాను'' అన్నారు.

శివ నిర్వాణ మాట్లాడుతూ - ''నేను, సందీప్‌ ఇద్దరం అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేశాం. ఇద్దరం ఒకే ఏడాదిలో దర్శకులయ్యాం. తన ఇంటెన్సిటీ, నిజాయితీ ట్రైలర్‌లో కనపడుతుంది. నేను కూడా కామన్‌ ఆడియెన్‌లా సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నాను'' అన్నారు.

విజయ్‌ దేవర కొండ మాట్లాడుతూ - ''నేను థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల రోజు సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందని, అందుకు నేను బెట్‌ కట్టడానికి కూడా రెడీగా ఉన్నానని మాట్లాడాను. ఆ వాఖ్యలు కొంతమందిని బాధించాయి. అయితే నేను చెప్పేదొక్కడే ఓ యాక్టర్‌కి తన సినిమాపై నమ్మకం లేకుంటే అది వేస్ట్‌. నాకే నమ్మకం లేనప్పుడు ఇంకేవరికి ఉంటుంది. నా సినిమాపై నమ్మకం లేని రోజు కూడా తప్పకుండా వస్తుంది. అయితే అది ఈరోజు కాదని నేను నమ్మకంగా చెప్పగలను. చాలా మంది జాగ్రత్తగా ఉండడని అంటున్నారు. కానీ ఫక్‌ ద హ్యుమిలిటీ అని చెబుతున్నాను. తల దించుకోని ఉండాల్సిన అవసరం లేదు. మీరెంతో సాధిస్తున్నారు. మేం సాధిస్తున్నామని గర్వంగా చెప్పండి. సెన్సార్‌ వాళ్లు మా సినిమాకు ఎ సర్టిఫికేట్‌ ఇచ్చారు. కథ వినగానే ఇది చిన్న పిల్లలు సినిమా కాదని అనుకున్నాను. అయితే నాకు కాలిది ఎక్కడంటే..వాళ్లు కొన్ని మ్యూట్స్‌ అడిగారు. మేం చాలా వివరించడానికి ప్రయత్నించాం. ఓ సీన్‌లో ఓ పదం వాడాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావ్‌ రా.. అనే పదాన్ని కూడా మ్యూట్‌ చేశారు. అయితే నన్ను మ్యూట్‌ చేశారు కానీ, ప్రేక్షకులను మ్యూట్‌ చేయలేరు. కాబట్టి ప్రేక్షకులే థియేటర్‌లో నాకు డబ్బింగ్‌ చెప్పాలి. ఇక
హీరోయిన్‌ షాలిని అద్భుతమైన నటి. తనని ఈ క్యారెక్టర్‌లో చూసిన తర్వాత మరేవరూ చేయలేరని అనిపించింది'' అన్నారు.

Glam galleries from the event

సందీప్‌ రెడ్డి వంగా మాట్లాడుతూ - ''ఈ సినిమా మూడు గంటల ఒక నిమిషం 47 సెకండ్ల నిడివితో ఉంటుంది. ఈ సినిమాలో హెవీ ఎమోషనల్‌ కల్ట్‌ రొమాంటిక్‌ మూవీ. మార్కెట్‌లోకి కొన్ని డ్రగ్స్‌ దొరుకుతాయి. వాటిని కొడితే రేడియో న్యూస్‌లాగా విషయాలు మన బ్రెయిన్‌లో గుర్తుండిపోతాయి. అలాంటి సినిమాయే అర్జున్‌రెడ్డి. నేనే ఎలాగైతే ఊహించుకుని రాసుకున్నానో విజయ్‌, షాలిని అలాంటి నటననే కనపరిచారు. మేం 10 రోజులు వర్క్‌ షాప్‌ కండెక్ట్‌ చేశాం. అప్పుడే సినిమా పెద్ద హిట్‌ అవుతుందని తెలిసిపోయింది. శర్వానంద్‌ అర్జున్‌రెడ్డిగా నటించాల్సింది. స్వప్న సినిమాను నిర్మించాల్సింది కానీ కుదరలేదు. వీరిద్దరూ విజయ్‌తో సినిమా చేయమని అనడంతో తనకు కథ చెప్పాను. సినిమా స్టార్ట్‌ అయ్యింది. నేను ఏదైనా డిటెయిల్డ్‌గా చెబుతాను. షాట్‌ పెట్టేటప్పుడు ఏ లెంగ్స్‌ వాడాలో కూడా చెబుతుంటాను. అలాంటి నా పిచ్చిని తట్టుకున్న తోటా రాజు, కలరిస్ట్‌ విష్ణు సహా అందరికీ థాంక్స్‌. ప్రేక్షకులు సినిమాను ఎలాగైతే ఊహించుకున్నారో దాన్ని ఈ సినిమాతో రీచ్‌ అవుతాం. ఏడాదికిపైగా నా టీంతో ట్రావెల్‌ చేశాను. కచ్చితంగా సినిమా అందరికీ నచ్చే సినిమా అవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడొచ్చు'' అన్నారు.

ప్రణయ్‌ రెడ్డి వంగా మాట్లాడుతూ - ''సినిమాలో విజయ్‌, షాలిని అద్భుతంగా చేశారు. వీరిద్దరూ లేకుంటే సినిమా ఇంత బాగా వచ్చుండేది కాదు. టీంకు థాంక్స్‌. ఈ నెల 25న సినిమా విడుదలవుతుంది. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అన్నారు.

శర్వానంద్‌ మాట్లాడుతూ - ''టీంను చూస్తుంటే అందరూ నా సినిమా అని రక్తం పెట్టి పనిచేసినట్లు కనపడుతుంది. క్రాంతి మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సమయంలో పరిచయం. తను చెప్పిన కథ వినగానే నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది. అయితే నేను సినిమా చేయలేకపోయాను. నాకు విజయ్‌ దేవరకొండను చూస్తే ఈర్ష్యగా ఉంది. నాతో సందీప్‌ నెక్ట్స్‌ సినిమా చేయాలనుకుంటున్నాను. 25న విడుదలైయ్యే సినిమా క్రేజీగా ఉంటుంది. నేను ఈ మధ్య కాలంలో విన్న హార్ట్‌ హిట్టింగ్‌ లవ్‌స్టోరీ. నిజమైన ప్రేమంటో అర్జున్‌రెడ్డి చెబుతుంది. ఎంటైర్‌ టీంకు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved