6 November 2017
Hyderabad
సందీప్ కిషన్, మెహరీన్ జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో, శంకర్ చిగురు పాటి సమర్పణలో, లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌లో చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం `కేరాఫ్ సూర్య`. ఈ సినిమా నవంబర్ 10న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమంలో..
ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ - ``ట్రైలర్ చూసిన తర్వాత సందీప్‌కు ఫోన్ చేసి చాలా బాగుందని ఫోన్ చేసి అభినందించాను. సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. సుశీంద్రన్ సినిమాలు చూశాను. తన సినిమాలు నేను చూశాను. అలాంటి డైరెక్టర్ సందీప్‌తో తెలుగు, తమిళంలో సినిమా చేయడం గొప్ప విషయం. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్`` అన్నారు
హరీష్ ఉత్తమన్ మాట్లాడుతూ - ``సందీప్ కిషన్ చాలా ఎనర్జీ ఉన్న హీరో. ఆయన అభిమానులకు ఈ సినిమా పెద్ద విందు భోజనం అవుతుంది. సినిమా అనేది ఫ్రెండ్ షిప్‌ను ఆధారంగా చేసుకుని తెరకెక్కింది. నిర్మాత చక్రిగారికి థాంక్స్. సుశీంద్రన్‌గారికి మొదటి తెలుగు సినిమా. మెహరీన్ చాలా అందంగా కనపడింది. నవంబర్ 10న విడుదలవుతున్న సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది`` అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ - ``క్యాచీ టైటిల్. అందుకే అందరికీ రీచ్ అయ్యింది. మన మధ్య జరిగే స్టోరీలా ఉండే ఈ సినిమా ట్రైలర్‌ను చూశాను. లైవ్‌లీగా అనిపించింది. నా పేరు సూర్య సినిమా చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. సందీప్ సినిమాలను బాగా ఇష్టపడుతుంటాను. తనకు ఈ సినిమా పెద్ద హిట్ మూవీగా నిలిచిపోతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
దర్శకుడు సుశీంద్రన్ మాట్లాడుతూ - ``కేరాఫ్ సూర్య నా తొలి తెలుగు సినిమా. సందీప్ కెరీర్లో ది బెస్ట్ పెర్ఫామెన్స్ మూవీ కేరాఫ్ సూర్య అవుతుంది. తమిళంలో ధనుష్ నాకు నచ్చిన హీరో. ఈ సినిమాలో సందీప్ ధనుష్‌లాంటి పెర్ఫామెన్స్ చేశాడు. ఆయనకు పొల్లాదవన్ సినిమాతో ఎలాంటి బ్రేక్ వచ్చిందో, అలాంటి బ్రేక్ సందీప్‌కు ఈ సినిమాతో వస్తుంది. చాలా హార్డ్ వర్క్ చేశాడు. తనతో మళ్లీ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. మెహరీన్ లక్కీ హీరోయిన్. ఆమెకు తమిళంలో తొలి సినిమా. మంచి నిర్మాతలు దొరికారు. మంచి టీంకు మంచి సినిమా అవుతుంది`` అన్నారు.
సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ - ``నిర్మాతలకు అభినందనలు. వారి నిర్మాణంలో వస్తోన్న నాలుగో సినిమా ఇది. వారికి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. అలాగే సుశీంద్రన్‌గారు డైరెక్ట్ చేసిన నా పేరు శివ సినిమా చూశాను. అది నాకు బాగా నచ్చింది. ఆ సినిమాలాగానే ఈ సినిమాకూడా పెద్ద హిట్ కావాలి. సందీప్ కు ఆల్ ది బెస్ట్. ఇమాన్‌గారు మంచి మ్యూజిక్ అందించారు.
సహ నిర్మాత రాజేష్ మాట్లాడుతూ - ``ఇండ్రస్ట్రీలో నాకు బెస్ట్ మిత్రుడు చక్రి. డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న నన్ను ఈ సినిమాతో కో ప్రొడ్యూసర్‌ని చేశారు. ఈ సినిమా చేసేటప్పుడు సందీప్ ప్లాపుల్లో ఉన్నాడు కదా..ఎందుకు తనతో మీరు సినిమాలు చేస్తున్నారని అడిగారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత సక్సెస్‌తో ఆ ప్రశ్నకు సమాధానం చెబుతుందని భావిస్తున్నాం`` అన్నారు.
చక్రి చిగురుపాటి మాట్లాడుతూ - ``సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్`` అన్నారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ - ``సుశీంద్రన్ సినిమాలకు నేను పెద్ద ఫ్యాన్‌ని. నా పేరు శివ సినిమాతో కార్తి అన్నను తెలుగు హీరోను చేశారు. సుశీంద్రన్‌గారు మంచి డైరెక్టరే కాదు, మంచి వ్యక్తి కాదు. ఇలాంటి వ్యక్తితో పనిచేయడం నా అదృష్టం. ఇమాన్‌గారు తొలిసారి తెలుగులో చేసిన సినిమా ఇది. మెహరీన్ పాజిటివ్ పర్సన్. సినిమాలో నటించిన వారందరూ చక్కగా నటించారు. తమిళ హీరోలు వారి సినిమాలను తెలుగులోకి అనువాదం చేసి సక్సెస్ కొట్టి మార్కెట్‌ను క్రియేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మన తెలుగు హీరోలు అలాంటి ప్రయత్నం చేస్తుంటే, చాలా మంది నెగిటివిటీతో మాట్లాడుతున్నారు.రెండు భాషల్లో సినిమా మొత్తాన్ని 59 రోజుల్లోనే పూర్తి చేశాం. కష్టపడి చేసిన సినిమాను డబ్బింగ్ సినిమా అని చెప్పడం బాధ కలిగిస్తుంది. `కేరాఫ్ సూర్య` హండ్రెడ్ పర్సెంట్ బైలింగ్వువల్ మూవీ. మంచి సినిమా తీశాం. మా పై నమ్మకంతో థియేటర్‌కు రండి సినిమా మెప్పిస్తుంది. సినిమా నవంబర్ 10న విడుదలవుతుంది`` అన్నారు.