pizza
Gang pre release function
`గ్యాంగ్` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

05 January 2018
Hyderabad

సూర్య‌, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం `తానా సెంద కూట్ట‌మ్‌`. ఈ చిత్రాన్ని తెలుగులో యు.వి.క్రియేష‌న్స్ గ్యాంగ్ అనే పేరుతో జ‌న‌వ‌రి 12న విడుదల చేస్తున్నారు. విఘ్నేశ్ శివ‌న్ ద‌ర్శ‌కుడు. ప్ర‌మోద్‌, వంశీ నిర్మాత‌లు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ శుక్ర‌వారం హైద‌రాబాద్ జె.ఆర్‌.సి. క‌న్వెన్ష‌న్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా...

హీరో సూర్య మాట్లాడుతూ - ``మ‌న అందరికీ స్కూల్‌లో ఓ గ్యాంగ్‌, కాలేజ్‌లో ఓ గ్యాంగ్, ప‌నిచేసుకునే ద‌గ్గ‌ర ఓ గ్యాంగ్ ఉంటుంది. అలాంటి గ్యాంగ్ మ‌న లైఫ్‌లో చాలా కీల‌క‌మైన పాత్ర‌ను పోషిస్తుంది. యు.వి.క్రియేష‌న్స్ తెలుగులో గ్యాంగ్ అనే చాలా మంచి టైటిల్ పెట్టారు. ఇక ఈ సినిమా విష‌యానికి వ‌స్తే..అల్లు అర‌వింద్‌గారు మా గ్యాంగ్‌లో చాలా కీల‌కమైన వ్య‌క్తి. ఆయ‌న సినిమా రిలీజ్‌కు ఎంత‌గానో స‌పోర్ట్ చేస్తున్నారు. అలాగే..జ్ఞాన‌వేల్ రాజా కూడా ఇక్క‌డ నా సినిమాల‌ను గ్రాండ్‌గా విడుద‌ల చేసే మ‌రో గ్యాంగ్ మెంబ‌ర్‌. మా గ్యాంగ్‌లో యు.వి.క్రియేష‌న్స్ వంశీ, ప్ర‌మోద్‌లు కూడా జాయిన్ అయ్యారు. అలాగే డైరెక్ట‌ర్ విఘ్నేశ్ శివ‌న్ నన్ను ఈ సినిమాలో చాలా కొత్త‌గా చూపించారు. ర‌మ్య‌కృష్ణ‌గారు కూడా మా గ్యాంగ్‌లో ఓ మెంబ‌ర్‌గా కావ‌డం ఆనందంగా ఉంది. అలాగే కీర్తి సురేష్‌, సినిమాటోగ్రాఫ‌ర్ దినేష్ స‌హా అంద‌రూ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌కు డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చే చిత్ర‌మ‌వుతుంది. తెలుగులో డ‌బ్బింగ్ కూడా నేనే చెప్పాను. కుటుంబం అంతా క‌లిసి చూసేలా సినిమా ఉంటుంది`` అన్నారు.

విఘ్నేశ్ శివ‌న్ మాట్లాడుతూ - `` తెలుగు ప్రేక్ష‌కులు సినిమాను ఎంత‌గానో ప్రేమిస్తారు. జ‌న‌వ‌రి 10న మనం అంతా క‌లిసి అజ్ఞాత‌వాసి మూవీ చూస్తాం. అలాగే జ‌న‌వ‌రి 12న మ‌ళ్లీ అంద‌రం క‌లిసి గ్యాంగ్ సినిమా చూడాలి. ఈ సినిమా చేసే అవ‌కాశం ఇచ్చిన సూర్య‌గారికి, జ్ఞాన‌వేల్ రాజాగారికి, వంశీ ప్ర‌మోద్‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

అల్లు అర‌వింద్ మాట్లాడుతూ - ``గ‌జిని` సినిమా నుండి నాకు, సూర్య‌గారికి మంచి అనుబంధం కొన‌సాగుతుంది. నాతో ఆయ‌న సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు కానీ కుద‌ర‌డం లేదు. త్వ‌ర‌లోనే ఆ సినిమా చేస్తాం. జ్ఞాన‌వేల్ రాజా, విఘ్నేశ్ శివ‌న్ క‌లిసి చేసిన సినిమాను తెలుగులో యు.వి.క్రియేష‌న్స్ వంశీ, ప్ర‌మోద్‌లు విడుద‌ల చేస్తున్నారు. అంద‌రికీ అభినంద‌న‌లు`` అన్నారు.

కీర్తి సురేష్ మాట్లాడుతూ - ``సూర్య‌గారితో న‌టించ‌డం ఆనందంగా ఉంది. విఘ్నేశ్ శివ‌న్ సినిమాను ఎంతో బాగా తెర‌కెక్కించారు. ఆయ‌న టేకింగ్ చాలా కొత్త‌గా ఉంటుంది. ర‌మ్య‌కృష్ణ‌గారితో క‌లిసి ప‌ని చేయ‌డం మ‌ర‌చిపోలేని అనుభ‌వం. జ్ఞాన‌వేల్ రాజాగారికి, సూర్య‌గారికి థాంక్స్‌. సూర్య‌గారితో క‌లిసి న‌టించ‌డం గొప్ప అవ‌కాశంగా భావిస్తున్నాను. జ‌న‌వ‌రి 12న గ్యాంగ్ విడుద‌ల‌వుతుంది`` అన్నారు.

మారుతి మాట్లాడుతూ - ``గ్యాంగ్‌తో మ‌రో వండ‌ర్ ఫుల్ సినిమాను సూర్య‌గారు తెలుగు ప్రేక్ష‌కులకు అందిస్తున్నారు. ఈ సంక్రాంతికి పెద్ద తెలుగు చిత్రాల‌తో పాటు సూర్య‌గారి సినిమా వ‌స్తుంది. విఘ్నేశ్ శివ‌న్ సినిమా `నాను రౌడీ తా` చూడ‌గానే, చాలా ఇన్నోవేటివ్‌గా అనిపించింది. ఆయ‌న సినిమాల్లో కామెడీ ట‌చ్ బావుంటుంది. అనిరుధ్ ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యూజిక్ అందించారు. ఈ సంక్రాంతికి అనిరుధ్‌వి రెండు సినిమాలు విడుద‌లవుతుండ‌టం విశేషం. అలాగే సూర్య మ‌న కోసం తెలుగు నేర్చుకుని డ‌బ్బింగ్ కూడా చెప్ప‌డం మ‌రో గొప్ప విష‌యం`` అన్నారు.

 


 
Photo Gallery (photos by G Narasaiah)
 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved