డా.మోహన్‌బాబు నటిస్తూ అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పణలో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పై నిర్మిస్తున్న చిత్రం `గాయత్రి`. మదన్ దర్శకుడు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. డా.మోహన్‌బాబు ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా...
టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ - ``42 సంవత్సరాల నుండి మోహన్‌బాబు 560సినిమాలకు పైగా నటించడం ఒక ఎత్తైతే.. ఒక పాత్రకు మరో పాత్రకు సంబంధం లేకుండా నటించడం మరో ఎత్తు. ఆయన స్టైల్ వేరే. విలన్ నుండి హీరోగా మారి వందల చిత్రాల్లో హీరోగా నటించిన ఏకైక నటుడు మోహన్‌బాబు మాత్రమే. తను నాకెంతో ఆత్మీయుడు. వైవిధ్యమైన నటన ఆయన సొంతం. ఏ పాత్ర వేసినా అందులో లీనమైపోవడం ఆయనకే చెల్లింది. గాయత్రి సినిమా కచ్చితంగా సూపర్‌హిట్ అవుతుంది. మోహన్‌బాబు, విష్ణు ఇద్దరూ పోటీ పడి నటించారు.
గిరిబాబు మాట్లాడుతూ - ``42 సినీ చరిత్రంలో 560 సినిమాలు చేయడమే కాకుండా 65 సినిమాలు నిర్మించడం అనేది గొప్ప విషయం. ఎంతో క్రమశిక్షణ ఉంటేగానీ ఇన్ని సాధించడం చిన్న విషయం కాదు. పేద విద్యార్థుకు ఉదారంగా విద్యను అందిస్తున్నాడు. ఇక నటుడిగా ఆయన వేయని పాత్ర లేదు. ఈ గాయత్రి సినిమా అద్భుతంగా ఉంటుంది. డెఫనెట్‌గా హిట్ అవుతుంది`` అన్నారు.
మంచు లక్ష్మి మాట్లాడుతూ - ``నాన్నగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. నేను పెద్దయ్యాక కూడా ఆయనలోని నటుడిని ఝుమ్మందినాదం వంటి సినిమాలో దగ్గరుండి చూసి మెస్మరైజ్ అయ్యాను. తన మేనరిజం, వాయిస్ మాడ్యులేషన్‌తో సీన్‌ను గొప్పగా ఎలివేట్ చేస్తారు. ఇంత గొప్ప నటుడికి కూతురిగా పుట్టడం అదృష్టం. మాకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు`` అన్నారు.
తనికెళ్ల భరణి మాట్లాడుతూ - ``మోహన్‌బాబుగారు పనసపండులాంటివాడు. పనస పండులో బయటకు ముల్లు మాత్రమే కనపడుతుంది. కానీ లోపల తియ్యదనంతో నిండి ఉంటుందో అలాంటి వ్యక్తి మోహన్‌బాబుగారు. బయటకు కోపంగా కనపడ్డప్పటికీ.. మంచి మనసున్న వ్యక్తి. మదన్ మంచి దర్శకుడు. విష్ణు, శ్రియ సహా మంచి టీం కుదిరింది. నేను కూడా మంచి పాత్రలో నటించాను. సినిమా తప్పకుండా పెద్ద హిట్ సాధిస్తుంది`` అన్నారు.
అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ - ``మోహన్‌బాబుగారితో కలిసి పనిచేయడం నా అదృష్టం. ఆయనొక యూనివర్సిటీ. ఇతర నటీనటులకు ఆయనెంతో ప్రోత్సాహం అందిస్తారు. భయపడుతూ తొలిరోజు షూటింగ్‌కు వెళ్లాను. కానీ అక్కడ వాతావరం ప్లెజెంట్‌గా ఉంది. తమన్ ఎంతో మంచి సంగీతాన్ని అందించారు. ఇక నా పాత్ర గురించి చెప్పాలంటే.. మంచి క్యారెక్టర్‌ను ఇచ్చారు. మదన్‌గారు తనవంతు సహకారాన్నిఅందించారు. సినిమా విడుదల కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం``అన్నారు.
డా.బ్రహ్మానందం మాట్లాడుతూ - ``మోహన్‌బాబు, విష్ణు, శ్రియ అద్భుతమైన నటులు, తమన్ అద్భుతమైన సంగీత దర్శకుడు, ఇన్ని అద్భుతాలు కలిసి చేసిన అద్భుత చిత్రమే `గాయత్రి`. ఈ సినిమాలో విష్ణుతో కలిసి ఓ కామెడీ సీన్‌లో నటించాను. మోహన్‌బాబుగారు విశ్వ నట సార్వభౌముడు. నటనకు ఆయన ప్రతి స్వరూపం`` అన్నారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ - ``సినిమాలో ఫైట్స్ చూడగానే థ్రిల్ అయ్యాను. మేమింకా ఎంతో చేయాలని అర్థమైంది. టీంకు ఆల్ ది బెస్ట్. సక్సెస్‌మీట్‌లో మాట్లాడుతాను. ఆయనలాంటి తండ్రి ఉండటం మా అదృష్టం`` అన్నారు.
బి.గోపాల్ మాట్లాడుతూ - ``42 సంవత్సరాలు 560 సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆయన నటనతో బాగా నవ్విస్తారు, ఏడిపిస్తారు. ఎమోషనల్‌గా మెప్పిస్తారు. ఆయన హీరోయే కాదు, 65 సినిమాలు తీసిన నిర్మాత, విద్యావేత్త. పేద విద్యార్థులకు 25 శాతం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. గ్రాయత్రి టైటిల్ చాలా పవర్ఫుల్. ఆయన సినిమాలన్నింటి కంటే ఇది పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ - ``మోహన్‌బాబుగారు ఎంత గొప్పవారనేది ఒకరు చెప్పనక్కర్లేదు. ఆయన చరిత్ర అందరికీ తెలుసు. ఇప్పుడు వస్తున్న భావి తరాల నటులకు ఆయనొక గొప్ప డిక్షనరీ. అంత కంటే ఆయన గురించి చెప్పలేం. ఆయనలా మనం నటించాలని ఇతర నటులు అనుకునే వారిలో మోహన్‌బాబు ప్రథమంగా ఉంటారు. డైలాగ్ చెప్పే సందర్భంలో ఎక్కడ ఫుల్‌స్టాప్ వాడాలి. ఎక్కడ వ్యంగంగా మాట్లాడాలి అని తెలుస్తుంది`` అన్నారు.
శ్రియా మాట్లాడుతూ - ``నా హృదయానికి బాగా దగ్గరైన సినిమా గాయత్రి. మోహన్‌బాబుగారి చాలా రోజుల క్రితం కలిశాను. ఆయన గురించి తెలియగానే స్పెల్ బౌండ్ అయ్యాను. ఆయన నటించిన సినిమాలో నేను నటించడం ఆనందంగా ఉంది. అలాగే మంచు విష్ణుతో నటించడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. మదన్‌గారితో వర్క్‌చేయడం హ్యాపీ. అమేజింగ్ టీమ్ కుదిరింది. అందరికీ థాంక్స్`` అన్నారు.
మంచు విష్ణు మాట్లాడుతూ - ``మదన్‌గారు, డైమండ్ రత్నబాబుగారు కథ చెప్పగానే .. క్యారెక్టర్‌లో నేనే నటిస్తానని చెప్పి నటించాను. అలాగే తమన్ నాపై వచ్చే సాంగ్‌ను అద్భుతంగా చేశాడు. చాలా మంది ఢీ, దేనికైనా రెడీ సినిమాల్లో బాగా చేశానని అంటారు. కానీ నా దృష్టిలో అవా ఫేవరేట్ క్యారెక్టర్స్ కావు. ఒక నటుడిగా అనుక్షణం వంటి సినిమా నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ప్రతి నటుడికి లైఫ్‌లో ఓ టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆ పాత్ర తనని మంచి నటుడు అని అయినా కానీ, వీడు నటనకు పనికిరాడు అని అయినా గానీ తేల్చేస్తుంది. అలాంటి పాత్ర ఇందులో చేశాను. ఇందులో నేను పాస్ అయితే నటుడిగా ఉంటాను. నా కెరీర్‌లో మోస్ట్ టర్నింగ్ పాయింట్ క్యారెక్టర్ ఇదే. గాయత్రి చాలా ఎమోషనల్ కథ. ఓ తండ్రికి, కూతురికి జరిగే కథ. అందుకే అందరం బాగా కనెక్ట్ అయ్యాం. మేం చదువుకునే రోజుల నుండి శ్రియా అంటే మాకిష్టం. తను ఫ్యాబులస్ పెర్ఫామర్. తనలా మరెవరూ న్యాయం చేయలేరనిపించింది. అనసూయ కూడా మంచి పాత్ర చేసింది. కోటగారికి, బ్రహ్మానందంగారికి, రామజోగయ్యశాస్త్రిగారు సహా అందరికీ థాంక్స్. మా నాన్నగారి సినిమాలు చూస్తూ సినిమాల్లో పెరిగాను. ఆయన్ను అసెంబ్లీ రౌడీ, అల్లుడుగారు చిత్రాల్లో ఎలా చూశానో, అలా సర్వేష్ ఈ సినిమాలో చూపించాడు. ఫిబ్రవరి 9న సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాం. సెన్సార్ పూర్తి కావాలి`` అన్నారు.
దర్శకుడు మదన్ మాట్లాడుతూ - ``2017.. నా జీవితంలో గొప్ప ఏడాది. మోహన్‌బాబు అత్యంత అరుదైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. చాలా క్లారిటీ ఉంటే తప్ప ఆయనతో ట్రావెల్ చేయలేం. ఆయనతో అసోసియేట్ కావడం అంటే ప్రొఫెసర్‌తో విద్యార్థులు పనిచేసినట్లే. అలాంటి వ్యక్తి మళ్లీ పుట్టడు. కుండ బద్ధలు కొట్టినట్లు మాట్లాడేస్తారు. ఆయన చూపించే ప్రేమ ముందు మనం కరిగిపోతాం. ఆయనతో కలిసి పనిచేయడం గ్రేట్. మనుషులను చదివిన వాడు వేదాంతైనా, వ్యాపారైనా అవుతాడు లేదా మోహన్‌బాబులా మహానటుడన్నా అవుతాడు. ఎదుటివాడి మనస్తత్వాన్ని చదివేయగలరు. ఆయనతో మరచిపోలేని మధురానుభూతులున్నాయి. చాలా సెన్సిబుల్ పర్సన్ ఆయన. విష్ణుగారు తన పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. తమన్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. సర్వేష్ మురారి, వర్మ, రత్నబాబు అందరికీ థాంక్స్`` అన్నారు.
డా.యం.మోహన్‌బాబు మాట్లాడుతూ - ``పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని అంటుంటాం. అలాగే సినిమాను కష్టపడి తీయగలుగుతాం. కానీ జయాపజయాలు ప్రేక్షకుల చేతిలోనే ఉంటుంది. నాకు తెలిసింది సినిమా ఒక్కటే. ఇంకేం తెలియదు. నటుడిగా పుట్టాను, నిర్మాతగా సినిమాలు చేశాను. ఇవి తప్ప మాకు వ్యాపకాలు లేవు. గాయత్రి సినిమాను కష్టపడి చేశాం. ఫలితం మాత్రం దేవుడి చేతిలోనే. ఎంత అణిగిమణిగి, సౌమ్యంగా ఉంటే అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. విర్రవీగితే ఓ తొక్కుతొక్కుతాడంతే. నిర్మాతగా 60కి పైగా సినిమాలు చేశాను. ఎన్నోజయాలు వచ్చాయి. అలాగే అపజయాలు వచ్చాయి. జయం వచ్చినప్పుడు పొంగిపోలేదు. అపజయం వచ్చినప్పుడు కుంగిపోలేదు. ఐదు సినిమాలు హిట్టై ఒక సినిమా ప్లాపయినా, ఐదు సినిమాల హిట్టు పోతుంది. నిర్మాత పని ఎంత కష్టమో నాకుతెలుసు. నన్ను నటుడిగా పరిచయం చేసింది మా గురువు దాసరిగారు. ఆయన నాకు ఎన్ని పాత్రలు ఇచ్చారో నాకు తెలుసు. ఆయన లేకపోవడం పెద్ద లోటు. ఆయనెంత గొప్ప దర్శకుడో ఈ జనరేషన్‌కు తెలియదు. ఆయన నేర్పించిన డైలాగ్స్‌తోనే ఈ రోజు శభాష్ అని అనిపించుకుంటున్నాను. మహానటుడు ఎన్టీఆర్ తర్వాత డైలాగ్ మోహన్‌బాబు బాగా చెప్పగలడని పేరొచ్చిందంటే, ఆ క్రెడిట్ దాసరిగారిదే దక్కుతుంది. గాయత్రి సినిమా కోసం ఏడాది కష్టపడ్డాం. మదన్ దర్శకుడు అయితే , బయటి దర్శకులను, రచయితలను, భాష రాని ఇతర దర్శకులను పిలిపించి, కథను చెప్పి, ఒకటికి పదిసార్లు చూపించి, మళ్లీ రీషూట్ చేసి సినిమాను రెడీ చేశాం. సెన్సార్ పూర్తయితే ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. మదన్ గొప్ప దర్శకుడు. మంచి రచయిత. ఈ సినిమాను ఓ అద్భుతంగా తీశాడు. రేపు సినిమా చూస్తే అర్థమవుతుంది. కెమెరామెన్ సర్వేష్ మురారి సినిమాను గొప్పగా, అందంగా తీశాడు. డ్యూయెల్ రోల్ చేయడం కష్టం. ఆ రెండు పాత్రలను సర్వేష్ చక్కగా చూపించాడు. ఎడిటర్ వర్మ చక్కగా ఎడిట్ చేశాడు. ఆర్ట్ డైరెక్టర్ చిన్నా మంచి వర్క్‌ని అందించాడు. డైమండ్ రత్నబాబు వండరఫుల్ డైలాగ్స్‌ను రాశాడు. నా పరుచూరి బ్రదర్స్‌లో ఒకరైనా పరుచూరి గోపాల కృష్ణ, కొన్ని డైలాగులు రాసిచ్చారు. అలాగే భరణి, పృథ్వీ, రాజా రవీంద్ర, బ్రహ్మానందం, గిరిబాబు, పోసాని, కోట శ్రీనివాసరావు సహా అందరికీ ధన్యవాదాలు. బండ్ల విజయ్, సుబ్బులు కో ప్రొడ్యూసర్స్‌గా తమ వంతు సహకారం అందించారు. అందరూ నాకు విజయం రావాలని టీంగా కలిసి పనిచేశారు. తమన్ మంచి మ్యూజిక్‌ను అందించారు. హీరో నేనైతే నా యంగ్ ఏజ్‌లో రోల్‌ను విష్ణుబాబును వేయమని దర్శకుడు అన్నారు. విష్ణుకు శ్రియా జోడిగా నటించింది. తను ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫామెన్స్ చేసింది. నా బ్యానర్‌లో ఎంతో మందిని పరిచయం చేశాను. శ్రియా అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించింది.విష్ణు నాతో ఫ్లాష్ బ్యాక్ రోల్ చేస్తున్నాడు. ఏమాత్రం అది డౌన్ అయినా, సినిమా ఫ్లాట్ అయిపోతుంది. కానీ విష్ణు, శ్రియ పోటీపడి నటించారు. టోటల్ టీం తరపున ఇద్దరికీ అభినందనలు. ఈతరం హీరోయిన్స్ ఎవరూ అలాంటి పాత్రను చేయలేరు. ఆ భగవంతుడు చల్లనిచూపు చూడాలని, సినిమా పెద్ద విజయం సాధించాలని, ప్రేక్షకులను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.