pizza
Hello Guru Premakosame pre release function
`హ‌లో గురు ప్రేమ‌కోస‌మే` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


13 October 2018
Hyderabad

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ `హ‌లో గురు ప్రేమ కోస‌మే`. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్న శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్ర‌ణీత హీరోయిన్స్‌గా న‌టించారు. ఈ సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 18న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ క్యూట్ అండ్ సెన్సిబుల్ ల‌వ్ స్టోరీకి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌ను శ‌నివారం హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో...

రామ్ మాట్లాడుతూ - ``నేను, రాజుగారు క‌లిసి మ‌ళ్లీ సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుండో అనుకుంటుంటే ఈ స్క్రిప్ట్‌కి క‌నెక్ట్ అయ్యాం. ఈ క‌థ విన్న‌వాళ్లంద‌రూ.. ఒకే ఒక పాయింట్‌కి క‌నెక్ట్ అయ్యారు. సినిమా మెయిన్ పాయింటే అది. సినిమా చూసిన త‌ర్వాత అంద‌రూ దానికే క‌నెక్ట్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. రాజుగారి స్క్రిప్ట్ జ‌డ్జ్‌మెంట్ గురించి నేను చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న లైఫ్‌లో ల‌వ్‌స్టోరీస్ ఉన్నాయో లేదో కానీ ప్ర‌తి సినిమాను ఎంత‌గానో ప్రేమించేస్తారు. త్రినాథ‌రావుతో ప‌నిచేయ‌డం చాలా క‌ష్టం. ఎందుకంటే త్రినాథ‌రావు గారు ముందు ఆడియెన్ త‌ర్వాతే డైరెక్ట‌ర్‌. యాక్టింగ్ చేస్తుంటే న‌వ్వేస్తుంటారు. రైట‌ర్ ప్ర‌స‌న్న‌కుమార్.. కామెడీ సీన్స్‌తో పాటు, ఎమోష‌న‌ల్ సీన్స్‌ను కూడా చాలా బాగా రాశాడు. అలాగే సాయికృష్ణ‌గారికి థాంక్స్‌. దేవిశ్రీప్ర‌సాద్‌తో నేను చేసిన ఆరో సినిమా. సినిమా ఎలా ఉన్న మా కాంబినేష‌న్‌లో అన్ని సినిమా పాట‌లు చార్ట్ బ‌స్ట‌ర్స్ అయ్యాయి. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే.. దేవిశ్రీ ప్ర‌సాద్ యు.ఎస్‌లో షోస్ చేస్తున్నా కూడా ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేశాడు. చంద్ర‌బోస్‌గారు, శ్రీమ‌ణిగారు చాలా మంచి సాహిత్యాన్ని అందించారు. ప్ర‌కాశ్‌రాజుగారితో ప‌నిచేయ‌డం గౌర‌వంగా ఉంటుంది. ఆయ‌న‌తో ప‌నిచేస్తే న‌టులుగా మేం మ‌మ్మ‌ల్ని త‌రచి చూసుకోగ‌లుతాం. విజ‌య్‌గారు అద్భుతంగా తెర‌కెక్కించారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో రెండో సినిమా ఇది. ఫైనెస్ట్ పెర్ఫార్మ‌ర్‌. శిరీష్‌గారు, ల‌క్ష్మ‌ణ్‌గారికి థాంక్స్‌. అక్టోబ‌ర్ 18న సినిమా విడుద‌ల‌వుతుంది`` అన్నారు.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ``మ‌న లైఫ్‌లో మ‌నం చాలా చూస్తుంటాం. గెలిచిన వాళ్లు ఓడిపోతుంటారు.. మ‌ళ్లీ గెలుస్తారు. స్పోర్ట్స్ ప‌ర్స‌న్స్‌కి స‌క్సెస్‌, ఫెయిల్యూర్ అనేది కామ‌న్‌. ఓ ఎలక్ష‌న్స్ గెల‌వ‌డం, ఓడిపోవ‌డం.. మ‌ళ్లీ గెల‌వ‌డం అనేది పొలిటీషియ‌న్స్‌కి కామ‌న్‌. అలాగే మా సినిమా వాళ్ల విష‌యానికి వ‌స్తే స‌క్సెస్‌లు, ఫెయిల్యూర్స్ వ‌చ్చినా కూడా సినిమా తీయాల‌నే ప్యాష‌న్‌తో ఇక్క‌డే ఉంటూ.. సక్సెస్ గురించి ట్రావెల్ అవుతుంటారు. ఓ బెస్ట్ ఎంగ్జాపుల్ ర‌వికిషోర్‌గారు. ముప్పై ఏళ్లుగా ఆయ‌న సినిమాలు తీస్తూనే ఉన్నారు. 2002 ఫిబ్ర‌వ‌రి 16న అమృత సినిమాను విడుద‌ల చేయ‌డానికి తీసుకున్నాం. ర‌వికిషోర్‌గారు కృష్ణా, గుంటూరు డిస్ట్రిక్ట్ లో సినిమా డిస్ట్రిబ్యూష‌న్ గురించి మ‌ట్లాడారు. `ఇలాంటి హార్డ్ సిచ్యువేష‌న్‌ని చాలా స్మూత్‌గా డీల్ చేశావ్ తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీలో పెద్ద ప్రొడ్యూస‌ర్‌గా నిన్ను చూస్తాను` అని ర‌వికిషోర్‌గారు అన్నారు. `ఆయ‌న చాలానే సోప్ వేస్తున్నాడు` అని నేను కూడా అనుకున్నాను. కానీ బొమ్మ‌రిల్లు స‌క్సెస్‌మీట్‌లో ఆయ‌న గుర్తు చేసే వ‌ర‌కు నాకు గుర్తుకులేదు. నాలో ఏం చూసి ఆయ‌న ఆ మాట అన్నారో నాకు తెలియ‌దు. అయితే ఇప్పుడు ఏ సినిమా అయినా స‌క్సెస్ కాక‌పోతే.. ఆయ‌న మాట‌లనే త‌ల్చుకుంటాను. స‌క్సెస్‌, ఫెయిల్యూర్ కామ‌న్‌. కానీ మ‌నం ముందుకెళుతుండాల‌ని ఆయ‌న చెప్పిన మాట‌ల‌ను నేను ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుంటాను. ఆయ‌న‌కు థాంక్స్‌. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే.. నేను లోక‌ల్ సినిమా అయిన త‌ర్వాత ప్ర‌స‌న్న నాకు ఫోన్ చేసి సార్‌! నా ద‌గ్గ‌ర ఐడియాస్ ఉన్నాయి. చెప్పాలి సార్ అన్నాడు. నేను స‌రేన‌ని విన్నాను. త‌ను రెండు ఐడియాలు చెప్పాడు. అందులో ఒక‌టి హ‌లోగురు ప్రేమ‌కోస‌మే.. మ‌రో స్టోరి. విచిత్రంగా నేను త‌ను చెప్పిన మ‌రోస్టోరినే సెల‌క్ట్ చేసుకున్నాను. హ‌లోగురు ప్రేమ‌కోస‌మే సినిమాలో ఏముంది ప్ర‌స‌న్న అని నేను అన్నాను. ఆ క‌థ‌పై నేను, ప్ర‌స‌న్న‌తో ట్రావెల్ అవుతున్న‌ప్పుడు ఈయ‌న ఈ క‌థను తీసుకెళ్లి ప్ర‌కాశ్‌రాజ్‌గారి చెప్పారు. అరే! ఇది బావుంది క‌దా.. రాజుకెందుకు చెప్ప‌లేద‌ని ఆయ‌న అన్నారు. ఆయ‌న‌కు చెప్పామ‌ని ప్ర‌స‌న్న చెప్ప‌గానే ప్ర‌కాశ్‌రాజుగారు నాకు ఫోన్ చేసి .. ప్ర‌స‌న్న వ‌చ్చి చెప్పిన క‌థ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంది క‌దా! ఎందుకు సెల‌క్ట్ చేసుకోలేదు అని అడిగాడు. బావుంద‌న్న‌య్యా! నాకు కూడా న‌చ్చింది. నాకు వేరే క‌థ చేయాల‌నిపించింద‌ని చెప్పాను. దానికి ఆయ‌న లేదు..మ‌ళ్లీ క‌థ విను అంటూ ప్ర‌స‌న్న‌ను పంపాడు. మ‌ళ్లీ నేను క‌థ విని ఇది ఎంట‌ర్‌టైన‌ర్ క‌దా.. ఇదే చేద్దాం ప్ర‌స‌న్న ఎవరితో చేద్దాం అని త‌న‌ని అడగ్గా.. త‌ను రామ్ పేరు చెప్పాడు. నేను రామ్‌కి ఫోన్ చేసి క‌థ విన‌మంటే విని సినిమా చేయ‌డానికి ముందుకొచ్చాడు. అలా నేను , రామ్‌, దేవిశ్రీ ప్ర‌సాద్‌, ప్ర‌కాశ్‌రాజ్‌గారు.. ఓ పాయింట్‌కి క‌నెక్ట్ అయ్యాం. ఇది హిలేరియ‌స్ మూవీ.. ఇందులో ఎంట‌ర్‌టైన‌రే కాదు.. సినిమాలో అద్భుత‌మైన పాయింట్ ఉంది. దాన్ని రేపు సినిమాలో చూస్తారు. ప్ర‌సన్న‌, త్రినాథ్‌కు మంచి వేవ్ లెంగ్త్ కుదిరింది. వీరితో సాయికృష్ణ కూడా ట్రావెల్ చేస్తున్నారు. రెండు గంట‌ల ప‌దిహేను నిమిషాల క‌థ‌లో గంట ప‌ది నిమిషాలు.. థియేట‌ర్‌లో ప్రేక్ష‌కులు న‌వ్వుతూనే ఉంటారు. దేవిశ్రీ ప్ర‌సాద్ తో ఇది నా 9 సినిమా. ఈ సినిమాలోని ఐదు పాట‌లు.. ప్ర‌తి పాట‌ను ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తారు. రామ్ న‌ట‌న‌, డాన్సులు అమేజింగ్. డాన్సులు ఎవ‌రైనా చేయొచ్చు. అన్ని పాట‌ల్లో స్ట‌యిలిష్‌గా చేయొచ్చు. వేజిటెరియ‌న్ సినిమాలో రామ్ ఓ సాంగ్‌ను ఇర‌గ‌తీశాడు. రామ్ పెర్ఫామెన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌ను వ‌న్ ఆఫ్ ది బెస్ట్ పెర్‌ఫార్మ‌ర్‌. నేను శైల‌జ త‌ర్వాత రామ్ సెటిల్డ్ పెర్ఫామెన్స్‌తో న‌వ ర‌సాల‌ను ప‌లికించాడు. రామ్‌, ప్ర‌కాశ్‌రాజ్‌గారు... అనుప‌మ మూడు పిల్ల‌ర్స్‌. ప్ర‌కాశ్‌రాజ్‌గారిది కామెడీతో పాటు మంచి ఎమోష‌న‌ల్ పార్ట్ కూడా చూడొచ్చు. అనుప‌మ శ‌త‌మానం భ‌వ‌తి త‌ర్వాత త‌న‌కు చాలా మంచి పేరు వ‌స్తుంది. తెలుగు నెటివిటీ ఉన్న మ‌ధ్య త‌ర‌గ‌తి అమ్మాయిగా న‌టించింది. విజ‌య్ చ‌క్ర‌వ‌ర్తి విజువ‌ల్ ట్రీట్ ఇచ్చాడు. అంద‌రూ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు చేసిన సినిమా అంద‌రినీ మెప్పిస్తుంది`` అన్నారు.

డైరెక్ట‌ర్ త్రినాథ‌రావు న‌క్కిన మాట్లాడుతూ - ``ఈ సినిమాలో రామ్‌కి ప్ర‌కాశ్‌రాజ్‌గారు మామ అవుతాడా.. ఫ్రెండ్ అవుతాడా అనేదే స‌స్పెన్స్‌. 104 ఫీవ‌ర్‌లో కూడా రామ్ అద్భుతంగా డాన్స్ చేశాడు. రామ్‌, ప్రకాశ్‌రాజ్‌గారిని పాట పాడ‌మ‌ని అడ‌గ్గానే వాళ్లు వెంట‌నే ఓకే చేశారు. వాళ్లు ఎలా పాడుతారోన‌ని అనుకుని భ‌య‌ప‌డ్డాం. కానీ చాలా చ‌క్క‌గా పాడారు. అక్టోబ‌ర్ 18న సినిమా విడుద‌ల‌వుతుంది`` అన్నారు.

హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మాట్లాడుతూ - ``ఇది తెలుగులో నా 7వ చిత్రం. మ‌ర‌చిపోలేని జ‌ర్నీ. దిల్‌రాజుగారి బ్యాన‌ర్‌లో శ‌త‌మానం భ‌వ‌తి త‌ర్వాత చేసిన చిత్ర‌మిది. ఆ సినిమాకు ఎంత మంచి పేరు వ‌చ్చిందో ఈ సినిమాకు కూడా అంతే మంచి పేరు వ‌స్తుంద‌ని అనుకుంటున్నాను. దిల్‌రాజుగారికి, ల‌క్ష్మ‌ణ్‌, శిరీష్‌గారికి థాంక్స్‌. త్రినాథ‌రావు న‌క్కిన‌గారు సెట్స్‌లో ఎప్పుడూ ఆట‌ప‌ట్టిస్తుండేవారు. అలాగే ప్ర‌స‌న్న‌గారు చాలా మంచి స‌పోర్ట్ అందించారు. ప్ర‌కాశ్‌రాజ్‌గారి గురించి చెప్పాలంటే శ‌త‌మానం భ‌వ‌తి చిత్రంలో ఆయ‌న మ‌న‌వ‌రాలి పాత్ర‌లో న‌టించాను. ఈ చిత్రంలో కూతురి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాను. త‌దుప‌రి సినిమాలో ఆయ‌న నాకు బాయ్‌ఫ్రెండ్‌గా న‌టిస్తాడేమోన‌నిపిస్తుంది. ఎందుకంటే ఆయ‌న చాలా యంగ్ హార్టెడ్ ప‌ర్స‌న్‌. నాకు ఎప్పుడూ మంచి స‌ల‌హాలిస్తుండేవారు. రామ్‌తో కూడా ఇది రెండో చిత్రం. ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ త‌ర్వాత ఆయ‌న‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం రావ‌డం ఆనందంగా ఉంది. దేవిశ్రీ ప్ర‌సాద్‌గారితో కూడా ఉన్న‌ది ఒక‌టే జింద‌గీకి ప‌నిచేశాను. ఇది నా రెండో చిత్రం. మంచి సంగీతాన్ని అందించారు. సినిమా చాలా పెద్ద హిట్ కావాలి`` అన్నారు.

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ మాట్లాడుతూ - ``సినిమా పాట‌ల‌ను హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. ఆడియో ట్రైల‌ర్ మాత్ర‌మే.. అస‌లు సినిమా అక్టోబ‌ర్ 18న సంద‌డి చేస్తుంది. రామ్ వ‌న్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫామెన్స్‌. త‌ను రాకింగ్‌. చాలా చ‌క్క‌గా న‌టించాడు. త‌న న‌ట‌న‌, డాన్సులను ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తారు. విజ‌య్ చ‌క్ర‌వ‌ర్తి సినిమాటోగ్ర‌ఫీతో ప్ర‌తి ఫ్రేమ్‌ను ఫెంటాస్టిక్‌గా మ‌లిచారు. అనుప‌మ తెలుగులో చ‌క్క‌డా డ‌బ్బింగ్ చెప్పారు. రామ్‌, అను .. పెర్‌ఫార్మెన్స్ ఫెంటాస్టిక్‌గా ఉంటాయి. త్రినాథరావు న‌క్కిన కేవ‌లం కామెడీతో పాటు ఈ సినిమా అద్భుతంగా ఎమోష‌న్స్‌ను తెర‌కెక్కించారు. దిల్‌రాజుగారి సినిమా అంటే సెన్సార్ చేయ‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ప్రొడ‌క్ష‌న్స్ నుండి ఓ సినిమా వ‌స్తుందంటే క‌ళ్లు మూసుకుని న‌మ్మ‌కంతో థియేట‌ర్‌కు వెళ్లి సినిమా చూడొచ్చు. ఈ సినిమాతో పాటు రాజుగారి బ్యాన‌ర్‌లో ఎఫ్‌2 ... మ‌హ‌ర్షి సినిమాల‌ చేస్తున్నాను. శ్రీమ‌ణి చాలా చ‌క్క‌గా పాట‌లు రాశారు. అలాగే బోస్‌గారికి థాంక్స్‌. ప్ర‌స‌న్న‌గారు మంచి డైలాగ్స్ అందించారు. అంద‌రూ ప్రేమ‌తో సినిమాను చూసి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ చేస్తార‌ని భావిస్తున్నాం`` అన్నారు.

శ్రీమ‌ణి మాట్లాడుతూ ``మంచి ఆల్బ‌మ్ ఇది. ఎంజాయ్ చేస్తారు. ఇందులో ఓ మాస్ పాట కూడా రాశాను. మొత్తం నాలుగు పాట‌లు రాశాను`` అని అన్నారు.

ప్ర‌వీణ్ మాట్లాడుతూ ``ఈ సినిమా గురించి ఏం చెప్పినా థ్రిల్ మిస్ అవుతుంది. ఈ సంస్థ నా హోమ్ బ్యాన‌ర్‌. అందువల్ల డీఫాల్ట్ గా హిట్ కావాలి`` అని చెప్పారు.

ప్ర‌స‌న్న‌కుమార్ మాట్లాడుతూ ``ఈ క‌థ రాశాక రాజుగారికి రామ్ అయితే బావుంటుంద‌ని చెప్పాను. రామ్ క‌థ‌ను ఎలాంటి ఎక్స్ ప్రెష‌న్ లేకుండా విన్నారు. కానీ డైలాగ్ వ‌ర్ష‌న్ విని చాలా న‌వ్వారు. ఆయ‌న చేసిన సంజు పాత్ర‌తో ప్రేమ‌లో ప‌డిపోయాను. ఒకానొక‌స‌మ‌యంలో చాలా బాగా లేకున్నా రామ్‌గారు షూటింగ్‌కి వ‌చ్చారు. అనుప‌మ బంగారు త‌ల్లి. బండిమీద అనుపమ‌, రామ్ మ‌ధ్య ఓ సీన్ ఉంటుంది. చాలా బాగా కుదిరింది. నాకు ఎవ‌రైనా స్క్రిప్ట్ లో క‌రెక్ష‌న్స్ చెప్తే బీపీ వ‌స్తుంది. కానీ రాజుగారి ద‌గ్గ‌ర ఓడిపోవ‌డం నాకు చాలా ఇష్టం. ద‌స‌రాకి అంద‌రం క‌లిసి న‌వ్వుకుందాం. త్రినాథ్‌తో చాలా మంచి కెమిస్ట్రీ కుదిరింది నాకు`` అని అన్నారు.

సాయి కృష్ణ మాట్లాడుతూ ``ప్ర‌స‌న్న చెప్పిన పాయింట్‌ను ఇంట్ర‌స్టింగ్‌గా చేశాం. మంచి రిజ‌ల్ట్ వ‌చ్చింది. త్రినాథ్‌గారి గురించి కూడా అంద‌రూ గొప్ప‌గా చెబుతుంటే ఆనందంగా ఉంది. రాజుగారు టెండుల్క‌ర్ లాంటి వారు. 100 సినిమాలు తీస్తారు. అనుప‌మ డౌన్ టు ఎర్త్ ప‌ర్స‌న్‌. శిరీష్‌గారు బ్యాడ్ హ్యాబిట్‌లాంటివారు చాలా త్వ‌ర‌గా అల‌వాటైపోతారు. రామ్‌గారి ఒంటిమీద పాల‌చుక్క ప‌డితే న‌ల్ల‌గా క‌నిపిస్తుంది. నీటి చుక్క ప‌డితే పాల‌లాగా ఉంటుంది`` అని అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved