pizza
Mercury pre release function
`మెర్క్యురి` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

9 April 2018
Hyderabad

ప్రభుదేవా ప్రధాన పాత్రలో పెన్‌ స్టూడియోస్‌, స్టోన్‌ బెంచ్‌ ఫిలింస్‌ సమర్పణలో.. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో కార్తీకేయన్‌ సంతానం, జయంతి లాల్‌ నిర్మించిన సైలెంట్‌ చిత్రం 'మెర్క్యురి'. ఈ సినిమా ఏప్రిల్‌ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. తెలుగులో కె.ఎఫ్‌.సి. ప్రొడ‌క్ష‌న్‌ సినిమాను విడుద‌ల చేస్తుంది. ఆదివారం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా...

నిర్మాత కార్తికేయ‌న్ సంతానం మాట్లాడుతూ - ``ఇంత మంచి సినిమాను నిర్మించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. యూనిక్ పాయింట్‌తో తెర‌కెక్కిన చిత్ర‌మిది. 30 ఏళ్ల ముందు క‌మ‌ల్‌హాస‌న్‌గారు పుష్ప‌క‌విమానం అనే మూకీ సినిమాను చేశారు. త‌ర్వాత ఇప్పుడు మూకీ సినిమాను మా బ్యాన‌ర్‌లో చేశాం. కార్తీక్ సుబ్బ‌రాజ్ టేకింగ్‌, ప్ర‌భుదేవా న‌ట‌న, సినిమా మేకింగ్ ప్రేక్ష‌కుల‌ను అద్భుత‌మైన ఫీలింగ్‌ను క‌లిగిస్తుంది. క‌మ‌ర్షియ‌ల్ థ్రిల్ల‌ర్ జోన్‌లో తెర‌కెక్కింది. ఇండియ‌న్ సినిమాను నెక్స్‌ట్ లెవ‌ల్‌కు తీసుకెళుతుంది. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

కార్తీక్ సుబ్బరాజు మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడిగా `మెర్క్యురి` నా నాలుగో చిత్రం. నా తొలి చిత్రం పిజ్జా తెలుగులో కూడా మంచి స‌క్సెస్‌ను అందుకుంది. ఇదొక థ్రిల్ల‌ర్ మూవీ. సైలెంట్ ఫిలిం. సినిమాలో ఏ భాష ఉండ‌దు. ఏప్రిల్ 13న సినిమాను విడుద‌ల చేస్తున్నాం. ఇలాంటి ఓ డిఫరెంట్ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నందుకు గ‌ర్వంగా ఉంది. ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డ‌మే కొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది. ఎమోష‌న‌ల్‌గా అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. ఇందులో విల‌న్ పాత్ర యూనిక్‌గా ఉంటుంది. ఎవ‌రైనా గొప్ప న‌టుడు చేస్తే బావుంటుంద‌ని భావించాను. అప్పుడు ప్ర‌భుదేవాగారు గుర్తుకొచ్చారు. ఆయ‌న‌కు చెప్ప‌గానే.. ఆయ‌న‌కు న‌చ్చి చేయ‌డానికి ఒప్పుకున్నారు. ఇందులో పాట‌లు, డాన్సులు ఉండ‌వు. త‌మిళ‌నాడులో స్ట్ర‌యిక్ న‌డుస్తుండ‌టంతో.. త‌మిళ‌నాడు మిన‌హా అన్ని ప్రాంతాల్లో సినిమాను విడుద‌ల చేస్తాం. స్ట్ర‌యిక్ త‌ర్వాత త‌మిళంలో కూడా సినిమాను విడుద‌ల చేస్తాం`` అన్నారు.

ప్ర‌భుదేవా మాట్లాడుతూ - ``మంచి సినిమా. ఎంట‌ర్‌టైనింగ్‌, మాస్ ఫిలిం. నా కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఫిలింగా ఉంటుంది. విల‌న్‌గా చేయ‌డం ఎగ్జ‌యిట్‌మెంట్ అనిపించింది. సినిమా చూస్తున్నంత సేపు క్యారెక్ట‌ర్స్ మాత్ర‌మే క‌న‌ప‌డ‌తాయి. సినిమా ప్ర‌తి ఫ్రేమ్ ఎగ్జ‌యిట్‌మెంట్‌తో సాగుతుంది. విల‌న్ పాత్ర చేయ‌డానికి ఇన్‌స్పిరేష‌న్ లేదు. ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్‌పై న‌మ్మ‌కంతో సినిమాలో న‌టించాను. కార్తీక్ బ్రిలియంట్ డైరెక్ట‌ర్‌`` అన్నారు.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved