pizza
Nartanasala pre release function
`@న‌ర్త‌న‌శాల` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


24 August 2018
Hyderabad

`ఛ‌లో` లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియేష‌న్స్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న‌ చిత్రం `@న‌ర్త‌న‌శాల`. శంకర ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాత. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడు. క‌ష్మిర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ఈ నెల 30న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రిగింది. కార్య‌క్ర‌మానికి వంశీ పైడిప‌ల్లి ముఖ్య అతిథిగా వ‌చ్చి, ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు.

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - ''నర్తనశాల అనే టైటిల్‌ పెట్టి సినిమా తీయడానికి చాలా ధైర్యం కావాలి. ఒక క్లాసిక్‌ సినిమాను తీసుకుని ఆ టైటిల్‌ పెట్టి... అందులోని క్యారెక్టర్స్‌ను కాంటెంపరరీగా తీసుకుని ఎంటైర్‌టైన్‌ చేస్తూ తీసిన సినిమా ఇది. డైరెక్టర్‌ శ్రీనివాస్‌ నా కుటుంబంలోని వ్యక్తి. తనకు ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అవుతుంది. గీత గోవిందంతో ఎంటర్‌టైన్‌ వేవ్‌ స్టార్‌ అయింది. అది నర్తనశాలకు కంటిన్యూ కావాలి. నాగశౌర్య ఇప్పటికీ సెల్‌ఫోన్‌ వాడడు. అంత కంటెంట్‌గా ఉండటం చాలా కష్టం. ఈ సినిమా పరంగా తనకు అభినందనలు. శంకర్‌గారు, ఉషాగారు వంటి తల్లిదండ్రులు ఉండటం తన అదృష్టం. కశ్మీరా, యామిని హీరోయిన్స్‌లకు ఈ సినిమా మంచి బ్రేక్‌ ఇవ్వాలి. అజయ్‌, శివాజీరాజా, సాగర్‌ మహతి, చంటిగారు, తమ్మిరాజుగారు సహా ఎంటైర్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

హీరో నాగశౌర్య మాట్లాడుతూ - ''వంశీ పైడిపల్లిగారు మొదటి నుండి మా సినిమాకు తన సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు. అజయ్‌, శివాజీరాజాగారు, యామినీ, కశ్మీరా అందరూ చక్కగా సపోర్ట్‌ చేశారు. సాగర్‌ మహతితో ఛలో తర్వాత చేస్తున్న సినిమా. ఆ సినిమాలో చూసీ చూడంగానే ... సాంగ్‌ చాలా పెద్ద హిట్‌ అయింది. అదొక అద్బుతంలా జరిగింది. ఈ సినిమా ఎగిరే ఎగిరే... సాంగ్‌ కూడా చాలా బాగా వచ్చింది. డైరెక్టర్‌ శ్రీనివాస్‌ చక్రవర్తి సినిమాను చాలా బాగా తీశారు. చెప్పింది చెప్పినట్లు తీశారు. సాయిశ్రీరామ్‌గారు చాలా పెద్ద సపోర్ట్‌ చేశారు. మా అమ్మనాన్నలకు థాంక్యూ సో మచ్‌. వాళ్ల గురించి అంత కంటే ఎక్కువగా చెప్పలేను. ఎంత చెప్పినా తక్కువే. మా ఫ్యామిలీకి ఎప్పుడూ సపోర్ట్‌ చేసే బుజ్జి అంకుల్‌, శ్రీనివాస్‌రెడ్డి అంకుల్‌కు థాంక్స్‌. డెఫనెట్‌గా సినిమా అందరికీ నచ్చుతుంది'' అన్నారు.

చిత్ర దర్శకుడు శ్రీనివాస్‌ చక్రవర్తి మాట్లాడుతూ - ''శౌర్య, శంకర్‌గారికి, ఉషాగారికి థాంక్స్‌. సినిమా చాలా ప్లెజంట్‌గా,కామిక్‌గా ఉంటుంది. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.

మధుర శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ - ''ఒక మనసు చిత్రం కోసం మా బ్యానర్‌లో శౌర్య పనిచేశాడు. మంచి హార్డ్‌వర్కర్‌. తనకు మంచి పేరెంట్స్‌ ఉండటంతో.. కెరీర్‌ను అందంగా వెళుతుంది. బ్యానర్‌ను స్టార్ట్‌ చేసి మంచి సినిమాలు చేస్తున్నారు'' అన్నారు.

నందినీ రెడ్డి మాట్లాడుతూ ''శంకర్‌గారు, బుజ్జిగారు, గౌతమ్‌, ఉషాగారే.. సినిమాకు మూల స్తంభాలు. సాగర్‌ మహతి సినిమా కోసం ఇంకా కష్టపడుతున్నాడు. శౌర్య సహా ఎంటైర్‌ యూనిట్‌కు సినిమా పెద్ద హిట్‌ కావాలి'' అన్నారు.

యామిని మాట్లాడుతూ - ''వంశీ పైడిపల్లిగారికి థాంక్స్‌. ఐరా క్రియేషన్స్‌ శంకర్‌గారు, ఉషాగారు మా యూనిట్‌ను తల్లిదండ్రుల్లా చూసుకున్నారు. నర్తనశాల అనే టైటిల్‌ పెట్టి సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. సాగర్‌ మహతి మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. నాగశౌర్య మంచి కోస్టార్‌. ప్రేక్షకుల ప్రేమ మా అందరికీ అవసరం'' అన్నారు.

శివాజీ రాజా మాట్లాడుతూ ''ఉషాగారు, శంకర్‌ప్రసాద్‌, బుజ్జిగారు, సత్యనారాయణగారు.. అందరికీ థాంక్స్‌. చాలా మంచి క్యారెక్టర్‌ చేశాను. 450 సినిమాల్లో ది బెస్ట్‌ క్యారెక్టర్‌ చేశాను. నా కోసమే ఈ సినిమా చేశారా? అనిపించేలా ఉంటుంది. సాగర్‌ మహతి చాలా మంచి సంగీతం ఇచ్చారు. ఎంటైర్‌ యూనిట్‌కు అభినందనలు'' అన్నారు. కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అతిథులు చిత్ర యూనిట్‌కు అభినంద‌నలు తెలిపారు.

 

Photo Gallery (photos by G Narasaiah)
 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved