pizza
Prema Entha Madhuram Priyuralu Antha Katinam pre release function
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుతుంది!!
-ప్రి రిలీజ్ వేడుకలో అభిప్రాయపడిన అతిధులు
You are at idlebrain.com > News > Functions
Follow Us

14 November 2017
Hyderabad

టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే.. 'ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం' కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం కలుగుతోందని.. ఈ చిత్రం ప్రి రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈ వేడుకలో హీరో చంద్రకాంత్, హీరోయిన్లు రాధిక, పల్లవి డోరా, దర్శకనిర్మాత గోవర్ధన్, ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన సిద్ధార్ధ, పబ్లిసిటీ డిజైనర్ విక్రమ్, ధీరజ్ అప్పాజీలతో పాటు.. ముఖ్య అతిధులుగా ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ (గోపి), దర్శకులు కార్తీక్ రెడ్డి, రామ్ భీమన, నాగరాజు తదితరులు హాజరయ్యారు. అంతా అమెరికాలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో నటించినవారు, పని చేసినవారు కూడా అమెరికాలో నివసిస్తున్న మన తెలుగువారే కావడం గమనార్హం. ఈనెల 17న రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాలోనూ విడుదలవుతున్న ఈ చిత్రం మంచి విజయం సాధించి, దర్శకుడిగా గోవర్ధన్ కు మంచి పేరు తీసుకురావడం ఖాయమని బెక్కెం వేణుగోపాల్ (గోపి), కార్తీక్ రెడ్డి అన్నారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రూపొందించిన ఈ చిత్రం విజయం పట్ల తమకు పూర్తి నమ్మకం ఉందని దర్శకుడు గోవర్ధన్, హీరో చంద్రకాంత్, హీరోయిన్లు రాధికా, పల్లవి డోరా పేర్కొన్నారు. ఈనెల 17న ఈ చిత్రం విడుదల కానుంది!!

 

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved