నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్యా హోప్ తారాగణంగా ఆరన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం `అప్పట్లో ఒకడుండేవాడు`. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 30న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.....
ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ - ``అప్పట్లో ఒకడుండేవాడు ఫిక్షనల్ క్యారెక్టర్ బయోపిక్ ఫిలిం. ఇప్పటికే రెండు సార్లు సినిమా చూశాను. ఇంక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్‌ను సాగర్ అండ్ టీం చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేశారు. రోహిత్, సాగర్, శ్రీవిష్ణు సహా అందరూ సినిమాను చాలా కేర్ తీసుకుని తెరకెక్కించారు. ఈ సినిమా ఒక బ్యూటీఫుల్ జర్నీ. ఇలాంటి చిన్న సినిమాలను చూసి ఎంకరేజ్ చేస్తే కొత్త కాన్సెప్ట్ సినిమాలు మరిన్ని వస్తాయి`` అన్నారు.
శ్రీవిష్ణు మాట్లాడుతూ - ``ఏదైనా సినిమా కథ వినగానే పర్టికులర్ జోనర్ అని ఫిక్స్ అవుదాం. కానీ ఈ సినిమా చేసేటప్పుడు పర్టికులర్ జోనర్ అంటూ ఎక్కడా ఫిక్స్ కాలేదు. సినిమా చూసిన తర్వాత సినిమా జోనర్ గురించి ఐడియా వచ్చింది. డిఫరెంట్ సినిమా పక్కా కమర్షియల్ సినిమాను కొత్తగా చేసి చూపించాం. సినిమా డిసెంబర్ 30న ప్రేక్షకులు ముందుకు రానుంది`` అన్నారు.
డైరెక్టర్ సాగర్ కె.చంద్ర మాట్లాడుతూ - ``అప్పట్లో ఒకడుండేవాడు సినిమా డిసెంబర్ 30న రిలీజ్ అవుతుంది. ఫిక్షనల్ బయోపిక్ సినిమా ఇది. 92-96 నేపథ్యంలో జరిగిన ఘటనలు ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించాం. నారా రోహిత్‌గారి సపోర్ట్ మరచిపోలేం. కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ధుర్యోధనుడు, కర్ణుడు అనే రెండు క్యారెక్టర్స్ ఉండే సినిమా. ధుర్యోధనుడిలా ఈగో ఉన్న క్యారెక్టర్‌లో నారా రోహిత్ కనపడితే, అన్ని మంచి లక్షణాలున్నా ఎక్కడో తేడా ఉండే కర్ణుడు వంటి క్యారెక్టర్‌లో శ్రీవిష్ణు నటించారు. భారతంలో ఈ ఇద్దరూ మంచి స్నేహితులైతే, ఇక్కడ ఈ ఇద్దరు విరోధులుగా కనపడతారు`` అన్నారు.
నారా రోహిత్ మాట్లాడుతూ - ``నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా నాకు ఇది డిఫరెంట్ మూవీ. గ్లోబలైజేషన్, ముస్లిం క్యారెక్టర్, లవ్, క్రికెట్ గురించి ఇలా అన్నీ ఎలిమెంట్స్‌ను టర్ చేశాం. ఫిక్షనల్ క్యారెక్టర్ బయోపిక్ సినిమా. ఈ ఏడాది నేను చేసిన ఆరవ సినిమా ఇది, చాలా కొత్త సబ్జెక్ట్ మూవీగా నేను భావిస్తున్నాను`` అన్నారు.