pizza
NTR's Bigg Boss Telugu press meet
బిగ్‌బాస్‌ షోను హోస్ట్‌ చేయడమనేది ఛాలెంజింగ్‌గా భావిస్తున్నాను - ఎన్టీఆర్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

8 July 2017
Hyderabad

STAR Maa and NTR launch the Bigg Boss promo

Star Maa is all set to launch the BIGGest ever reality show ‘BIGG BOSS’ in Telugu with Young Tiger NTR as host for the first time on television. In line with its vision of being audacious, inspiring and entertaining the channel is all set to sizzle with the show launching on 16th July at 9 PM . Promos are on- air and creating heavy buzz on TV & Digital platforms.

Right from the first reveal promo showcasing Jr. NTR in a stylish video to the one where he explains the format and promises entertainment, the promos have been creating a sensation. The latest promo launched brings out the naughty and fun loving side of the host and the show. The promo gives a glimpse into some elements of the life which the dozen celebrities will experience in the house. Jr. NTR as the host has a ringside view and is shown thoroughly enjoying it.

Bigg Boss, the Indian version of the international format Big Brother is one of the most successful reality television series ever. In this season, the show will have 12 celebrity contestants who will be locked up in 1 BIGG house with 60 cameras surrounding them and watching their every move for 71 days. The cameras will be on record mode all the time capturing the real side of these celebrities. Like the new promo illustrates, we shall see our famous and glamorous celebrities doing the regular chores and having to live without their gadgets. They will be periodically instructed by BIGG BOSS voice on tasks and rules and they will have to follow that. Each week the housemates have to nominate 3 names for eviction from the house and the viewers have the power to vote in the housemates for prolonging their stint on the show. The celebrity with the least votes is evicted from the show on the weekend.

The most anticipated question remains who are the dozen celebrities who will enter the house and that continues to be a mystery until 9pm 16th July.

Jr. NTR who seems to be having a blast with the project said “I feel technology and gadgets are increasingly taking over our lives. This show actually has a huge relevance and is fascinating because it will force a bunch of strangers to live inside a locked house with no gadgets and no access to the outside world, forcing them to forge new relationships. When I was offered the show, I said yes instantly because of the challenge it presented to me as an actor”

The presenting sponsors, Smartphone brand OPPO have quoted “"We are excited about our association with Star Maa. OPPO is a leading camera phone brand and is known and appreciated for its cameras experience and high-quality products. We believe that both brands have a high appeal amongst our local audience, especially the youth. Thus, this association is perfect. With the first ever Bigg Boss season on Star MAA with OPPO, we together want to offer our audience entertaining content, bring our fans closer, generate more ideas, and bring more surprise in the coming future."

Alok Jain, Business Head of Star Maa commented “At Star Maa we believe in the power of innovation and as a market with a huge appetite for the new, that is what has driven us to the no.1 position in primetime today and we are fairly certain that the first season of Bigg Boss will entertain the audience like never before taking us further ahead. Bigg boss is a huge platform for us to showcase our differentiated strategy to our target audience and strengthen our relationship with them. We are in the business of entertainment and that is a promise we hold very dearly for every project we embark on“

About Star Maa
Star Maa is a part of Star TV network, which is a wholly-owned subsidiary of global media company 21st Century Fox. Star Maa is a leading Telugu TV channel network known for its vibrant, innovative, pleasant and interactive programming in the Telugu language market and enjoys a strong growth trajectory, driven by general entertainment and movies. Star Maa Network has a bouquet of five channels—Star Maa, Star Maa HD, Star Maa Movies, Star Maa Movies HD, Star Maa Music, and Star Maa Gold.

బిగ్‌బాస్‌ షోను హోస్ట్‌ చేయడమనేది ఛాలెంజింగ్‌గా భావిస్తున్నాను - ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా స్టార్‌మా టీవీలో ప్రసారం కానున్న రియాలిటీ షో 'బిగ్‌బాస్‌'. ఎన్టీఆర్‌ తొలిసారి బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరించనుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. బిగ్‌బాస్‌ షో ఈ నెల 16 నుండి ప్రసారం కానుంది. ఓ పెద్ద ఇంటిలో 12 మంది సెలబ్రిటీలను నిర్భందిస్తారు. ప్రతి ఒకరి కదలికను 60 కెమెరాలతో గమనిస్తుంటారు.

స్టార్‌ మా బిజినెస్‌ హెడ్‌ అలోక్‌జైన్‌, ఎన్టీఆర్‌, విన్నెంట్‌, జెస్సి తదితరులు పాల్గొన్నారు. బిగ్‌ బాస్‌ స్పెషల్‌ ప్రోమోను ఎన్టీఆర్‌, అలోక్‌ జైన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా...

విన్సెంట్‌ మాట్లాడుతూ - ''అప్పో సంస్థ స్టార్‌మాతో అసోసియేట్‌ కావడం ఎంతో ఆనందంగా ఉంది. మేం అదృష్టంగా భావిస్తున్నాం. బిగ్‌బాస్‌ గ్రేట్‌ షో అవుతుందని భావిస్తున్నాం'' అన్నారు.

అలోక్‌ జైన్‌ మాట్లాడుతూ - ''ఎన్టీఆర్‌ మా రియాలిటీ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి ఒప్పుకోవడం ఆనందంగా ఉంది. తెలుగు మార్కెట్‌లో బిగ్టెస్ట్‌ షోగా బిగ్‌ బాస్‌ జులై 16 రాత్రి 9 గంటలకు నుండి ప్రసారం కానుంది. ప్రపంచంలోని నలబై దేశాల్లో ఈ షో హ్యుజ్‌ సక్సెస్‌ అయ్యింది. ఇప్పుడుతెలుగులో ప్రసారం కానుంది. 80 డిఫరెంట్‌ షోస్‌ మన ఇండియాలో ఉన్నాయి. అందులో 20 ప్రస్తుతం మంచి ట్రెండ్‌లో ఉన్నాయి. అయితే ఈ బిగ్‌బాస్‌ షో వీటన్నింటి కంటే ప్రత్యేకమైంది. తొలిసారి ఎన్టీఆర్‌ బుల్లితెర వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటం నాకు పెద్ద ప్లస్‌ అవుతుంది. ఈ షో తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తుందని కచ్చితంగా చెప్పగలను. అల్రెడి విడుదలైన ప్రోమోస్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ షో స్టార్‌మా మరింత పేరును తీసుకొస్తుందని భావిస్తున్నాను తమిళంలో కమల్‌గారు చేస్తున్న షోకు మంచి స్పందన వచ్చింది తెలుగులో 71 ' ఏపిసోడ్స్‌ ప్లాన్‌ చేస్తున్నార'' అన్నారు.

ఎన్టీఆర్‌ మాట్లాడుతూ - ''చాలా సార్లు మీకందరికీ చెప్పినట్లు ఛాలెంజస్‌ అంటే నాకు చాలా ఇష్టం. అసలు టీవీలో ఎలా హోస్ట్‌గా చేయాలని, ఎలా మాట్లాడాలనే దానిపై ఎప్పుడూ అవగాహన లేదు. కానీ ఎప్పుడైతే స్టార్‌మా బిగ్‌ బాస్‌ షోకు నన్ను వ్యాఖ్యాతగా వ్యవహరించమని అడిగారో వెంటనే రెండో నిమిషం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేశాను. నాకు బిగ్‌బాస్‌ షోను హోస్ట్‌ చేయడం సవాలుగా భావిస్తున్నాను. చాలా ఆసక్తిగా, అద్భుతమైన అనుభవం కోసం ఎదురుచూస్తున్నాను. ఇండియాలో అతి పెద్దదైన రియాలిటీ షోను తెలుగులో నేను హోస్ట్‌ చేస్తానని నాపై నమ్మకం ఉంచినందుకు స్టార్‌మా వారికి థాంక్స్‌. బిగ్‌బాస్‌ షోను నేను వ్యాఖ్యాతగా చేయాలని రఘు నన్ను అడిగారు. అలోక్‌ షో కు సంబంధించిన చాలా విషయాలను తెలియజేశారు. హిందీ షోను నేను చూడలేదు. నా కజిన్‌ సిస్టర్‌ ఒకావిడ హిందీ షోను చూస్తుంది. ఆ షోలో సల్మాన్‌ ఎవరో కంటెస్టెంట్‌ను తిట్టాడని, అదేదో పెద్ద వింత అయినట్లు నా దగ్గరకు వచ్చి చెప్పింది. తను అంతగా ఉద్వేగభరితంగా మాట్లాడింది. అప్పుడే బిగ్‌బాస్‌ గురించి నాకు తెలిసింది. నేను అప్పుడప్పుడు రెండు, మూడు షోస్‌ చూశానే తప్ప పూర్తి షోను ఎప్పుడూ చూడలేదు. నాతో పాటు ఇండియాలో చాలా మందికి బిగ్‌బాస్‌ అనేది అమేజింగ్‌ రియాలిటీ షో అనే నమ్మకం ఉంది. హిందీ షోను చూస్తే ఎక్కడో మనసులో అది మనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అదే ఏమీ తెలియకుండా వెళితే మనకు ఏం చేయాలో అది చేయోచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేక్షకులు మారుతూ వస్తున్నారు. బిగ్‌ బాస్‌ తెలుగు ప్రేక్షకుల సెన్సిటికీ దగ్గరగా ఉంటుంది. సోషల్‌ మీడియా పెరిగే కొద్తి తెలిసో, తెలియకో అందరం పబ్లిక్‌ లేయర్‌లోకి వచ్చేశాం. ఒకప్పుడు ఒక మనిషి గురించి తెలియడానికి చాలా కాలం పట్టేది. కానీ ఇప్పుడలా కాదు. అలాగే ప్రతి మనిషి గురించి తెలుసుకోవాలని మరొకరికి ఆశ ఉంటుంది. ఆ ఆలోచనే బిగ్‌బాస్‌ షో ను పెద్ద సక్సెస్‌ చేస్తుందని భావిస్తున్నాను. సోమవారం నుండి శుక్రవారం వరకు షో టెలికాస్ట్‌ అవుతుంది. శనివారం, ఆదివారం మాత్రమే హోస్ట్‌ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అవుతుంది. నేను కంటెస్టెంట్‌ను కాను. నేను షోను చూడాలనుకుంటున్నానే తప్ప పాల్గొనాలనుకోవడం లేదు. షోలో ప్రతిది ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే షోను ఎలా హోస్ట్‌ చేయాలో కూడా తెలియదు. కాబట్టే ఎలా చేయాలో తెలుసుకోవడం అనేది నటుడిగా ఓ అనుభవమని నమ్ముతున్నాను. ఇలా చేయాలని ఏం అనుకోవడం లేదు. స్టేజ్‌పైకి వచ్చినప్పుడు ఎలా చేయాలనిపిస్తే అలా చేస్తాను. అందరి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఆ ఆసక్తే షోను ఒప్పుకునేలా చేసిన మొదటి అంశం. ఇక రెండో అంశం ఓ షోను హోస్ట్‌ చేయడం చిన్న విషయం కాదు. ఛాలెంజింగ్‌గానే భావిస్తున్నాను. నా సినిమాలనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా ఛాలెంజింగ్‌ ఉండటం నాకు ఇష్టం. సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌కు అతీతంగా ఈ అనుభవం ఈరోజు కాకపోయినా మరెక్కడైనా ఉపయోగపడుతుంది. నాకు చిన్నప్పట్నుంచి చార్లిఎంజెల్స్‌ అంటే చాలా ఇష్టం. చార్లి కనపడడు కానీ ఎంజెల్స్‌ కనపడుతుంటారు. చార్లి ఎలా ఉంటాడో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఉండేది. అలాగే ఈ షోలో నేను బిగ్‌బాస్‌ కాను. నేను పాల్గొనేవారికి, బిగ్‌బాస్‌కు మధ్య నేను వారధిగా ఉంటాను. కాబట్టి నేను ఇక్కడ కంటెస్టెంట్స్‌ గురించి ఏ వివరాలు తెలియవు. ఒకవేళ స్టేజ్‌పై వచ్చిన తర్వాత వారెవరో నాకు తెలిసే అవకాశం ఉంది. అదే రేపు ఇంట్లో నుండి ఎవరు వెళ్ళిపోతారు కూడా నాకు చెప్పరట. కేవలం నా వల్లే ఈ షోకు బజ్‌ వచ్చిందంటే నేను నమ్మను. మంచి షో, టీవీ ఛానెల్‌పై ఉన్న నమ్మకం వల్ల షోకు స్పందన వచ్చింది. సల్మాన్‌గారు చేసిన షోను నేను చేయడం ఛాలెంజ్‌గానే భావిస్తున్నాను. కచ్చితంగా హిందీలో సక్సెస్‌ అయినట్లే తెలుగులో కూడా సక్సెస్‌ అవుతుందని భావిస్తున్నాను. షోను ఇలాగే చేయాలని నేను ప్రిపేర్‌ కావడం లేదు. అలా ప్రిపేర్‌ కావడం నాకు ఇష్టం లేదు. కంటెస్టెంట్‌ను ఎలివేట్‌ చేయాలా వద్దా అనేది నా చేతిలో ఉండదు. ఓటింగ్‌ ద్వారానే ఏదైనా నిర్ణయించబడుతుంది. స్వర్గీయ ఎన్టీఆర్‌గారు తెలుగు ప్రజల సొత్తు. ఆయన్ను ఎలా చూపిస్తారనేది చూడాలి. బాబాయ్‌గారు అందులో పాత్ర చేస్తాననడం నిజంగా బ్రహ్మాండమే. నేను అందులో చేయాలా వద్దా అనే దాని గురించి ఏం ఆలోచించలేదు.



 
Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved