pizza
C/o Surya shooting completed
`కేరాప్ సూర్య‌` షూటింగ్ పూర్తి
You are at idlebrain.com > News > Functions
Follow Us

11 October 2017
Hyderabad

సందీప్ కిషన్, మెహ్రీన్ జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, జాతీయ అవార్డు గ్రహీత సుశీంద్రన్ దర్శకత్వంలో, శంకర్ చిగురు పాటి సమర్పణలో, లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం కేరాఫ్ సూర్య. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

హీరో సందీప్‌కిష‌న్ మాట్లాడుతూ - ``సుశీంద్ర‌న్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన నా పేరు శివ సినిమా అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయ‌న మ‌ధ్య త‌ర‌గ‌తివారి మెంటాలిటీస్‌ను చ‌క్క‌గా ఎలివేట్ చేస్తారు. ఈ సినిమాలో అలాంటి ఎలిమెంట్స్‌ను మ‌ళ్లీ ట‌చ్ చేశారు ద‌ర్శ‌కుడు సుశీంద్ర‌న్‌. సినిమా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. సినిమా చూస్తుంటే..మ‌న చుట్టు ప‌క్క‌ల వారిని గ‌మ‌నించి క‌థ రాసుకున్న‌ట్లు అనిపిస్తుంది. టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మెహరీన్ క్యూట్ క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డుతుంది. సంగీత ద‌ర్శ‌కుడు ఇమాన్‌కు తెలుగులో ఇది స్ట్ర‌యిట్ మూవీ అవుతుంది. సిచ్చువేష‌న‌ల్ కామెడి ఉంటుంది. నాగినీడు, తుల‌సిగారు నాకు త‌ల్లిదండ్రుల పాత్ర‌ల్లో న‌టించారు. సినిమా న‌వంబ‌ర్ రెండోవారంలో విడుద‌ల చేస్తాం`` అన్నారు.

మెహ‌రీన్ మాట్లాడుతూ - ``న‌వంబ‌ర్ 3న నా బర్త్‌డే. అదే నెల‌లో ఈ సినిమా విడుద‌ల‌వుతుండ‌టం ఎంతో ఆనందంగా ఉంది. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ త‌ర్వాత ఒప్పుకున్న సినిమా ఇది. తెలుగు, త‌మిళంలో విడుద‌ల‌కావ‌డం ఆనందంగా ఉంది`` అన్నారు.

Glam gallery from the event

నిర్మాత చ‌క్రి చిగురుపాటి మాట్లాడుతూ - ``సినిమా చాలా బాగా వ‌స్తోంది. పాట చిత్రీక‌ర‌ణ జ‌ర‌గుతుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను త్వ‌ర‌గా పూర్తి చేసి న‌వంబ‌ర్ రెండోవారంలో సినిమాను విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.

సుశీంద్ర‌న్ మాట్లాడుతూ - `` నా పేరు శివ‌లోని ఐదుగురు విల‌న్స్ ఇందులో కూడా క‌న‌ప‌డ‌తారు. సందీప్, మెహరీన్‌ చ‌క్క‌గా న‌టించారు. ఈరోజుతో షూటింగ్ పూర్త‌య్యింది. స‌త్య‌, ప్ర‌వీణ్‌, ధ‌న‌రాజ్ అంద‌రూ బాగా నటించారు`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved