pizza
Geethapuri Colony press meet
ఈ నెల 18 వస్తున్న`గీతా పురి కాలనీ `
You are at idlebrain.com > News > Functions
Follow Us

14 May 2018
Hyderabad

నరేన్, శ్రవణ్, పార్థు, దుష్యంత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం `గీతాపురికాలనీ.` గర‌లకంఠ మ‌ద్దేటి శ్రీనివాస్ దర్శకుడు. జి.రామకృష్ణ నిర్మాత . రామ్‌చరణ్ స్వరాలను సమకూర్చిన ఈ చిత్ర గీతాలు ఇటీవల విడుదలై అలరిస్తున్నాయి . అన్ని కార్యాక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 18 న రిలీజ్ అవుతుంది. ఈ సందర్బంగా ఈ రోజు ఫిలిం ఛాంబర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం లో నిర్మాత జి.రామ కృష్ణ మాట్లాడుతూ...`` స్టోరీ బాగా నచ్చడం తో ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో నిర్మించాను. ఐదుగురు పిల్లల నేపధ్యం లో జరిగే స్టోరీ. ఇందులో మా అబ్బాయి కూడా ఒక రోల్ చేసాడు. విద్య యొక్క విలువ గురించి చెప్పే చిత్రమిది. ఈ నెల 18 న విడుదల చేస్తున్నాం. ఈ సినిమాకు కచ్చితము గా అవార్డ్స్ వస్తాయన్న నమ్మకం ఉంది`` అన్నారు.


దర్శకుడు మాట్లాడుతూ...``ఐదు కథల సమాహారంగాసాగే చిత్రమిది. తెరపై పాత్రలే తప్ప నటులు కనిపించరు. గీతాపురి కాలనీలో ఏం జరిగిందనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తిని కలిగిస్తుంది . మాకు సపోర్ట్ చేసిన రాంకీ గారికి ధన్యవాదాలు . పిల్లల సినిమాలు తక్కువై పోతున్న టైం లో ఇలాంటి బాలల సినిమా తీసాం. అవార్డ్స్ కోసం పంపిస్తున్నాం . ఈ నెల 18న రిలీజ్ చేసాం `` అన్నారు.

దుష్యంత్ కుమార్ మాట్లాడుతూ.... ``పిల్లలలో చదువుకోవాలనే ఆసక్తి ఎలాంటి మలుపులు దారి తీసింది అనే కాన్సెప్ట్ తో సినిమా తీసాం. నేను కో ప్రొడ్యూసర్ గా చేస్తూ ఇందులో ఇంపార్టెంట్ రోల్ చేశాను `` అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ రామ్ చరణ్ మాట్లాడుతూ ...``ఇందులో సిక్స్ సాంగ్స్ నేనే రాసి, కంపోజ్ చేశాను. పాటలకు రెస్పాన్స్ బావుంది`` అన్నారు. న‌రేన్‌, శ్రావ‌ణ్‌, పార్ధు, శ్రీ హుత్, ప్ర‌జ్ఞ‌, దుష్యంత్ కుమార్ , ర‌మ‌ణి, శ్రీను కేస‌బోయిన‌, శ్రీహ‌రి, ప్ర‌తిమ‌, అంబిక‌, ముక్క‌రం, జ‌లాల్ మ‌హ్మ‌ద్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి మాటలుః నంద‌కిషోర్‌, కెమెరాః మ‌హేష్ మ‌ట్టి, ఎడిట‌ర్ః గోపి సిందం, ఆర్ట్ః పి.జీవ‌న్‌, కో-డైర‌క్ట‌ర్ః క‌త్తి. పోస్ట‌ర్ డిజైన్ః ధీర‌జ్ ఆర్ట్స్, పీఆర్వోః ర‌మేష్ చందు (బాక్సాఫీస్), నిర్మాతః జి. రామకృష్ణ , ద‌ర్శ‌క‌త్వంః గర‌లకంఠ మ‌ద్దేటి శ్రీనివాస్.​



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved